Jagapathi Babu: నన్ను మోసం చేశారు.. వాళ్ల ట్రాప్​లో పడకండి: జగపతి బాబు

సెకండ్ ఇన్నింగ్స్​లో ఫుల్ బిజీగా ఉన్నారు టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు. విలన్​గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా ఛాన్సులు అందుకుంటూ బిజీ యాక్టర్​ అయిపోయారు.

సెకండ్ ఇన్నింగ్స్​లో ఫుల్ బిజీగా ఉన్నారు టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు. విలన్​గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా ఛాన్సులు అందుకుంటూ బిజీ యాక్టర్​ అయిపోయారు.

జగపతి బాబు.. ఒకప్పుడు హీరోగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. ఫ్యామిలీ స్టార్​గా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు కుటుంబ ప్రేక్షకుల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉండేది. ఎన్నో హిట్ చిత్రాలతో టాప్ స్టార్స్​లో ఒకడిగా పేరు తెచ్చుకున్నారు జగపతి బాబు. అయితే ఆ తర్వాత ఆయన రేసులో వెనుకబడిపోయారు. అడపాదడపా హిట్లు కొట్టినా అవి సరిపోలేదు. దీంతో కొంత రెస్ట్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్​ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. విలన్​గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా ఛాన్సులు అందుకుంటూ బిజీ యాక్టర్​ అయిపోయారు జగపతి బాబు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను మోసపోయానన్నారు.

రియల్ ఎస్టేట్ రంగంలో జరుగున్న మోసాల విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు జగపతి బాబు. వాళ్ల ట్రాప్​లో పడకూడదని అభిమానులకు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ‘రియల్ ఎస్టేట్​ రంగంలో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో రీసెంట్​గా హెచ్చరించారు. ఇటీవలే ఓ రియల్ ఎస్టేట్​ యాడ్​లో నేను యాక్ట్ చేశా. అయితే నన్ను వాళ్లు మోసం చేశారు. వాళ్లు ఎవరు? అసలు ఏం జరిగింది? అనే వివరాలన్నీ త్వరలో చెబుతా. భూమి కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రూల్స్ కచ్చితంగా తెలుసుకోండి’ అని జగపతి బాబు పేర్కొన్నారు.

ఇక, జగపతి బాబు చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. ఆయన సెలెక్టివ్​గా ఉంటున్నారు. ఏది పడితే అది చేసేయకుండా తనకు మనసుకు నచ్చిన ప్రాజెక్టులే ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’లో జగపతి బాబు భాగమయ్యారు. ఇందులో ఆయనది పవర్​ఫుల్ రోల్ అని మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. అందులో ఆయన లుక్​కు సంబంధించిన ఫొటోను కూడా రిలీజ్ చేసింది. ఇంటెన్స్ లుక్​లో శక్తిమంతంగా కనిపించారు జగపతి బాబు. రవితేజతో ఢీ అంటే ఢీ అనే క్యారెక్టర్​లో ఆయన అదరగొట్టడం ఖాయం అని అంటున్నారు. జగపతి ముందు చాలా ఆఫర్లు ఉన్నాయని.. కానీ రోల్ బాగుంటేనే చేయాలని ఆయన అనుకుంటున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

Show comments