iDreamPost
android-app
ios-app

వీడియో: నడవలేని స్థితిలో బిగ్​బాస్ బ్యూటీ.. ఆమెకు ఏమైంది?

  • Published May 28, 2024 | 9:22 PM Updated Updated May 28, 2024 | 9:22 PM

అందం, అభినయంతో పాటు అదిరిపోయే డాన్సులతో ఆడియెన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుందామె. సినిమాల కంటే బిగ్​బాస్​ షోతో మరింత మంది ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. అలాంటి బ్యూటీ ఇప్పుడు నడవలేని స్థితిలో ఉంది.

అందం, అభినయంతో పాటు అదిరిపోయే డాన్సులతో ఆడియెన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుందామె. సినిమాల కంటే బిగ్​బాస్​ షోతో మరింత మంది ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. అలాంటి బ్యూటీ ఇప్పుడు నడవలేని స్థితిలో ఉంది.

  • Published May 28, 2024 | 9:22 PMUpdated May 28, 2024 | 9:22 PM
వీడియో: నడవలేని స్థితిలో బిగ్​బాస్ బ్యూటీ.. ఆమెకు ఏమైంది?

ఫిల్మ్‌ స్టార్స్​కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి స్పెషల్​గా చెప్పాల్సిన పనిలేదు. అందునా మన దేశంలో ఇది మరీ ఎక్కువ. క్రికెటర్ల తర్వాత అంతగా ఆదరణ దక్కించుకునేది సినీ తారలే. కొందరు మూవీ స్టార్స్​కు క్రికెటర్ల కంటే రెట్టింపు పాపులారిటీ ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. వాళ్లను ఆరాధించే అభిమానులు కోట్లలో ఉన్నారు. తారలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. అదే టైమ్​లో వాళ్లకు ఏమైనా అయిందంటే తట్టుకోలేరు. అందం, అభినయంతో పాటు అదిరిపోయే డాన్సులతో ఆడియెన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుందామె. సినిమాల కంటే బిగ్​బాస్​ షోతో మరింత మంది ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. అలాంటి నటి ఇప్పుడు అడుగు కూడా వేయలేని స్థితిలో ఉంది. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

రాఖీ సావంత్.. తన యాక్టింగ్​తో భారీగా అభిమాన గణాన్ని సందాదించుకున్న బాలీవుడ్ నటి. సినిమాల కంటే కూడా బిగ్​బాస్ షో ద్వారానే ఆమె పాపులారిటీ పెరిగింది. నిత్యం ఏవో కామెంట్స్ చేస్తూ వివాదాల్లో ఆమె పేరు వినిపిస్తూ ఉంటుంది. అలాంటి నటి ఇప్పుడు దీన స్థితిలో ఉంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాఖీకి ఇటీవలే డాక్టర్లు సర్జరీ చేశారు. ఇది జరిగి దాదాపు 10 రోజులు కావొస్తోంది. ఆమె గర్భాశయంలో భారీ కణతిని గుర్తించిన వైద్యులు.. దాన్ని ఆపరేషన్ చేసి తొలగించారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్న రాఖీ.. తాజాగా తన హెల్త్ కండీషన్ గురించి తెలియజేస్తూ భర్త రితేష్​తో కలసి సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది.

హాస్పిటల్​లో తీసిన వీడియోను రాఖీ పంచుకుంది. ఇందులో ఆమె అడుగు వేయడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ కనిపించింది. భరించలేని నొప్పితో ఆమె విలవిల్లాడటాన్ని అందులో చూడొచ్చు. నొప్పితో నడిచేందుకు ఇబ్బంది పడ్డ రాఖీకి నర్సులు సాయం చేశారు. దీనిపై ఆమె భర్త రితేష్ రియాక్ట్ అయ్యాడు. త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుంటుందని తెలిపాడు. తాను నడుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంటందూ ఎమోషనల్ అయ్యాడు. సోషల్ మీడియాలో వైరల్​గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. రాఖీ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె రికవర్ అయి.. మళ్లీ మునుపటి స్థాయిలో అందర్నీ ఎంటర్​టైన్ చేయాలని చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Md Kaif Md Kaif (@pinkvilla_v)

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş