iDreamPost
android-app
ios-app

Fish Venkat: దయనీయ స్థితిలో ఫిష్ వెంకట్! సహాయం కోసం ఎదురుచూపులు..

  • Published Sep 03, 2024 | 7:20 PM Updated Updated Sep 03, 2024 | 7:20 PM

Fish Venkat Health Condition: టాలీవుడ్ యాక్టర్ ఫిష్ వెంకట్ ప్రస్తుతం దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Fish Venkat Health Condition: టాలీవుడ్ యాక్టర్ ఫిష్ వెంకట్ ప్రస్తుతం దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Fish Venkat: దయనీయ స్థితిలో ఫిష్ వెంకట్! సహాయం కోసం ఎదురుచూపులు..

టాలీవుడ్ లో ఎంతో మంది టాలెంటెడ్ నటీ, నటులు ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రం ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుని, ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అలాంటి వారిలో నటుడు ఫిష్ వెంకట్ ఒకడు. కామెడీ విలన్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు ఫిష్ వెంకట్. స్టార్ హీరోలందరితో నటించిన అనుభవం ఇతడి సొంతం. అలాంటి ఫిష్ వెంకట్ నేడు దయనీయస్థితిలో ఉన్నాడు. తాజాగా ఓ ఛానల్ ఆయన్ని ఇంటర్వ్యూ చేయగా.. తన దీన స్థితిని చెప్పుకొచ్చాడు.

ఫిష్ వెంకట్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటుడు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఇతడు.. తన యాసతో, యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆది సినిమాలో తొడగొట్టు చిన్నా డైలాగ్ ఎంత ఫేమస్సో మనందరికి తెలిసిందే. ఆ ఒక్క డైలాగ్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాడు ఫిష్ వెంకట్. ఆ తర్వాత వరుసగా విలన్ పక్కన ఉండే అనుచరుల్లో ఒకడిగా ఎన్నో సినిమాల్లో నటించాడు. తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అయితే కొన్ని రోజులగా అతడు సినిమాల్లో కనిపించడం లేదు. ఏం జరిగిందా? అని ఆరా తీయగా.. అతడి దయనీయ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. కాలుకి చిన్న దెబ్బ తగలడంతో.. తన జీవితం మెుత్తం రివర్స్ అయిందని చెప్పుకొచ్చాడు.

ఫిష్ వెంకట్ మాట్లాడుతూ..”ఆయాసం బాగా రావడంతో ఆస్పత్రికి వెళ్లాను. అయితే అక్కడ వారం రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డయాలసిస్ చేయాలని డాక్టర్లు చెప్పారు. అదేంటో మాకు తెలీదు. దాంతో వచ్చి నిమ్స్ లో జాయిన్ అయ్యి.. అక్కడే డయాలసిస్ చేపించుకుంటున్నాను. ఏడాదిన్నరగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. కాలికి చిన్న దెబ్బ తగిలింది. అదే టైమ్ లో బీపీ, షుగర్ రావడంతో.. కాలు మెుత్తం ఇన్ఫెక్షన్ కు గురైంది. డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఇదంతా నాలుగేళ్ల క్రితం జరిగింది. అప్పటి నుంచి నా పరిస్థితి ఇలా అయిపోయింది. రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి.” అంటూ తన పరిస్థితిని వెల్లడించాడు. అనారోగ్యంతో ఎన్ని సినిమా ఛాన్స్ లు వచ్చినాగానీ.. వెళ్లలేకపోతున్నానని, ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో.. గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నట్లు ఫిష్ వెంకట్ పేర్కొన్నాడు. కుటుంబం గడవడానికి కూడా కష్టంగా ఉందని భావోద్వేగానికి గురైయ్యాడు. అతడి దీన పరిస్థితి చూసి.. ఇండస్ట్రీకి పెద్దలు ఎవరైనా ఆదుకోవాలని సినీ అభిమానులు, నెటిజన్లు కోరుతున్నారు.