iDreamPost
android-app
ios-app

తనపై అత్యాచారం చేశాడని నటుడిపై యువతి పోలీస్ కేసు!

  • Published Sep 03, 2024 | 6:20 PM Updated Updated Sep 03, 2024 | 6:20 PM

Baburaj Police Case:సినీ ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం అనుకుంటారు. మంచి హోదా, గుర్తింపు, డబ్బు అన్నీ లభిస్తాయని భావిస్తుంటారు. అందుకే సినీమాల్లో ఛాన్సు కోసం దేనికైనా సిద్దపడుతుంటారు.

Baburaj Police Case:సినీ ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం అనుకుంటారు. మంచి హోదా, గుర్తింపు, డబ్బు అన్నీ లభిస్తాయని భావిస్తుంటారు. అందుకే సినీమాల్లో ఛాన్సు కోసం దేనికైనా సిద్దపడుతుంటారు.

  • Published Sep 03, 2024 | 6:20 PMUpdated Sep 03, 2024 | 6:20 PM
తనపై అత్యాచారం చేశాడని నటుడిపై యువతి పోలీస్ కేసు!

వెండి తెరపై ఒక్కసారి కనిపిస్తే చాలు సెలబ్రెటీ హోదా లభిస్తుందని చాలామంది అనుకుంటారు. అందుకే కాస్తో కూస్తో అందం, టాలెంట్ ఉన్న వాళ్ళు ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ స్టూడియోల చుట్టూ తిరుగుతుంటారు. అదృష్టం బాగుండి ఛాన్స్ దక్కించుకునే వారు చాలా అరుదుగా ఉంటారు. సినిమా చాన్స్ కోసం వచ్చే యువతులను కొంతమంది దళారులు టార్గెట్ చేసుకొని వారికి మాయమాటలు చెప్పి మోసం చేస్తుంటారు. సినీ పరిశ్రమకు చెందిన వారు ఛాన్సులు ఇప్పిస్తామని కాస్టింగ్ కౌచ్ కి తెగబడిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఓ నటుడు తనపై అత్యాచారం చేసినట్లు యువతి పోలీస్ కేసు పెట్టింది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల మాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కేసులు వరుసగా బయటపడుతున్నాయి. గతంలో తమపై లైంగిక దాడులు చేసిన వారి వివరాలు బయటపెడుతున్నారు. సినీ అవకాశం ఇప్పిస్తానని చెప్పి సినీ నటుడు బాబురాజ్ తనపై అత్యాచారం చేశాడని జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు మేరకు ఆదిమాలి పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. తిర్కుకానంలోని రిసార్ట్ ఒకసారి, ఎర్నాకులంలోని అతని ఇంట్లోనూ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు లో పేర్కొన్నారు.

రాష్ట్ర పోలీస్ ఛీఫ్‌కు ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదును ఆదిమలి పోలీసులు పంపించారు. సదరు యువతి నుంచి ఫోన్ లో సమాచాం అందుకున్న ఆదిమాలి పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు యువతి బాబురాజ్ రీసార్ట్ లో మాజీ ఉద్యోగిగా పనిచేసినట్లు సమాచారం. ప్రస్తుతం జూనియర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది. కేసు వివరాలను స్పెషల్ ఇన్వేస్టిగేషన్ అధికారులకు అందజేస్తామని ఆదిమలి పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. హేమ కమిటి రిపోర్టును బయటపెట్టడం వల్లనే ఈ విషయాన్ని బయట పెట్టినట్టు సదరు యవతి వివరించినట్లు సమాచారం.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss