Krishna Kowshik
మంజుమ్మల్ బాయ్స్ ఎంతటి హిట్ కొట్టిందో అందరికీ తెలుసు. 2006లో జరిగిన ఓ రియల్ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కాాగా, ఇప్పుడు ఈ సినిమా వల్ల తమిళనాడు పోలీసులకు కొత్త చిక్కొచ్చి పడింది.
మంజుమ్మల్ బాయ్స్ ఎంతటి హిట్ కొట్టిందో అందరికీ తెలుసు. 2006లో జరిగిన ఓ రియల్ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కాాగా, ఇప్పుడు ఈ సినిమా వల్ల తమిళనాడు పోలీసులకు కొత్త చిక్కొచ్చి పడింది.
Krishna Kowshik
మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సర్వైవల్ చిత్రం మంజుమ్మల్ బాయ్స్. 2006లో జరిగిన సంఘటన ఆధారంగా చిదంబరం ఈ సినిమాను తెరకెక్కించాడు. కాస్తో కూస్తో అంచనాలతో బరిలోకి దిగిన ఈ మూవీకి ఫిదా అయిపోయారు కేరళ ఆడియన్స్. ‘ఆపదలో ఆదుకున్నవాడే అసలైన స్నేహితుడు’ అనే పదానికి ఫర్‌ఫెక్ట్ పిక్చర్ ఈ మూవీ. ఫన్, ఎమోషన్స్ క్యారీ చేయడంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రూ. 20 కోట్లతో తెరకెక్కించగా.. రూ. 250 కోట్లకు పైగా కొల్లగొట్టింది. పరవ ఫిలింస్ పతాకంపై ఈ మూవీ హీరో సౌబిన్ షాహిర్, బాబు షాహీర్, షాన్ ఆంటోనీతో కలిసి నిర్మించాడు. తమిళంలో రిలీజ్ చేస్తే అక్కడ కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో కూడా మంచి హిట్ కొట్టింది.
ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చి రికార్డు స్థాయిలో వ్యూస్ రాబ్టుకుంటుంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లంతా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా వల్ల తమిళనాడు పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఎందుకంటే.. 2006లో తమిళనాడులోని కొడైకెనాల్‌లో ఉన్న గుణ కేవ్స్‌కు వెళతారు కేరళకు చెందిన 10 మంది బాయ్స్. అక్కడే ఓ స్నేహితుడు.. నిషేధం ఉన్న గుణ గుహాల్లోకి వెళ్లి అనూహ్యంగా లోయలోకి పడిపోతాడు. పోలీసులు, స్నేహితుల సాయంతో అతడు బయపడతాడు. ఈ ఘటన తమిళనాడులో జరగడంతో.. ఇప్పుడు ఈ కేసును తిరిగి తోడుతున్నారు. ఈ నేపథ్యంలో పాత కేసుపై మళ్లీ విచారణ జరపాలని తమిళనాడు ప్రభుత్వం.. ఆ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. 18 సంవత్సరాల తర్వాత ఈ కేసును రీ ఓపెన్ చేశారు.
కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు చేపట్టారు పోలీసులు. స్నేహితుడు లోయలో పడిపోయాడంటూ ఫ్రెండ్స్ కంగారు పడతారు. పోలీసులను కొంత మంది స్నేహితులు ఆశ్రయించగా.. తొలుత మీ ఫ్రెండ్ మీరే చంపి.. లోయలో పడ్డారని చెబుతున్నారా అని మండిపడుతున్నారు. ఆ తర్వాత లోయ దగ్గరకు వచ్చి కూడా లోయలో పడ్డ వ్యక్తి బతికి ఉండనని, అతడి ఫ్రెండ్స్‌ను భయపెడుతుంటారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇవన్నీ కూడా సినిమాలో చూపించాడు దర్శకుడు. దీంతో అప్పట్లో తమిళనాడు పోలీసులు ఇలాగే వ్యవహరించి ఉంటారని పేర్కొంటూ కాంగ్రెస్ నేత వి షిజు అబ్రహం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని కోరారు. దీంతో డీజీపీకి ఆదేశాలిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇందులో లోయలో పడ్డ స్నేహితుడ్ని కాపాడిన క్యారెక్టర్ కుట్టన్ పాత్రలో సౌబిన్ కనిపించగా.. లోయలో పడిపోయిన సుభాష్ పాత్రలో శ్రీనాథ్ బాసి నటించారు.