భారీ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న టిల్లు స్క్వేర్

సిద్దు జొన్నలగడ్డ నుండి రాబోతున్న మూవీ టిల్లు స్క్వేర్. డీజే టిల్లుకు కొనసాగింపు అన్న సంగతి విదితమే. అయితే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ భారీ ధరకు జరిగినట్లు తెలుస్తోంది.

సిద్దు జొన్నలగడ్డ నుండి రాబోతున్న మూవీ టిల్లు స్క్వేర్. డీజే టిల్లుకు కొనసాగింపు అన్న సంగతి విదితమే. అయితే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ భారీ ధరకు జరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో టైర్ 2 స్టార్ల థియేట్రికల్ బిజినెస్‌ అనుకున్న స్థాయిలో జరగటం లేదు. చాలా సినిమాలకు నాన్ థియేట్రికల్ డీల్స్ సరిగా జరగడం లేదు. ఓటీటీ సంస్థలు ఒకప్పటిలా భారీ ధరలకు ఒప్పుకోక పోవటమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే చిన్న హీరోల సినిమాల బిజినెస్ 25 కోట్లు, 30 కోట్ల స్థాయిలో జరగడం లేదు. అయితే పార్ట్ 1 బ్లాక్ బస్టర్ క్రేజ్ తో టిల్లు స్క్వేర్ సినిమా భారీ బిజినెస్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 35 కోట్ల బిజినెస్ (valued) చేసిందని అంటున్నారు.

నిజానికి ఈ సినిమా విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడినప్పటికీ సినిమా పై బజ్‌ని కొనసాగించడంలో చిత్ర బృందం విజయం సాధించింది. ఇటీవలే మేకర్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. కాగా సినిమా విడుదలకు ముందే మరో ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, రిలీజ్ డేట్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.

రామ్ మల్లిక్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాల పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన టిల్లు స్క్వేర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ప్రకాష్ ఉమ్మడిసింగు ఛాయాగ్రహణం, నవీన్ నూలి ఎడిటింగ్‌ను నిర్వహించారు. రామ్ మిరియాల సంగీతం అందించారు. థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో రాధికా, టికెట్టే కొనకుండా అనే పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. అనుపమ గ్లామర్ షో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. సీక్వెల్ సినిమాలకు ఉన్న క్రేజ్ వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Show comments