iDreamPost
android-app
ios-app

వీడియో: టిల్లు-2లో అనుపమ పాత్రపై క్లారిటీ.. ఇది పెద్ద స్కెచ్చే!

వీడియో: టిల్లు-2లో అనుపమ పాత్రపై క్లారిటీ.. ఇది పెద్ద స్కెచ్చే!

డీజే టిల్లు.. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ సిద్ధూ జొన్నలగడ్డ స్టైల్లో ఎంతో టిల్లూలు కనిపిస్తూనే ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీస్ లిస్టులో డీజే టిల్లు సినిమా పేరు టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఎందుకంటే యూత్ ఈ సినిమాకి అంత కనెక్ట్ అయ్యారు. టిల్లు చేసిన పనులు, చెప్పిన మాటలకు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి కనెక్ట్ అయిపోయారు. అందుకే ఇప్పటికీ డీజే టిల్లు పేరును స్మరిస్తున్నారు. ప్రేక్షకులు ఎలా అయితే కోరుకున్నారో అలాగే టిల్లు-2 ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమా నుంచి క్రేజీ అప్ డేట్స్ కూడా వస్తున్నాయి.

ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే అడపాతడపా అప్ డేట్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టికెట్ ఏ కొనకుండా అనే ఒక సాంగ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. అది కూడా ఫంకాస్టిక్ సాంగ్ అని చెబుతున్నారు. ఈ పాటపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎందుకంటే టిల్లు సినిమాలో పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫుల్ సాంగ్ ని జులై 26న విడుదల చేయనున్నట్లు చెప్పారు. అయితే ఈ సాంగ్ ప్రోమోలో స్టార్ బాయ్ సిద్ధు కంటే కూడా అందరి దృష్టిని అనుమప పరమేశ్వరన్ ఆకర్షిస్తోంది.

అనుపమ అనగానే అందరికీ ఒక పక్కింటి అమ్మాయి అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన సినిమాలు కూడా అలాంటివే. దాదాపుగా హోమ్లీగా ఉండే పాత్రల్లోనే చేసింది. పైగా అందాల ప్రదర్శనను అంతగా ఎంకరేజ్ చేసే అమ్మాయి కాదని తెలిసిందే. కానీ, ఈ సినిమాలో మాత్రం అనుపమ ట్రాక్ మార్చేసింది. ఫుల్ బోల్డ్ లుక్స్, ఫంకీ స్టైల్ లో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ ఒక్క సాంగ్ కోసం ఆమె అలా పొట్టి డ్రెస్ లో రెడీ అయిందా? లేక ఫుల్ లెంగ్త్ పాత్ర అలాగే ఉండబోతుందా అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

 

View this post on Instagram

 

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

యదపై మ్యూజిక్ సింబల్ టాటూ.. వైట్ షార్ట్ ఫ్రాక్ వేసుకుని టిల్లుతో మాట్లాడుతున్న సీన్ ను రిలీజ్ చేశారు. పైగా ఆమె పాత్ర కాస్త రాష్ గా, పక్కా తెలంగాణ పోరిలా ఉండేలా కనిపిస్తోంది. టిల్లు సినిమా ఫస్ట్ పార్ట్ లో కూడా హీరోయిన్ ని పబ్ లో పరిచయం చేశారు. ఈ పార్ట్ లో కూడా వీరి మధ్య పరిచయం పబ్ లోనే ప్లాన్ చేసినట్లు ఉన్నారు. ఎప్పటిలాగానే టిల్లూ చూసిన కాసేపటికే అనుపమతో ఫ్లర్టింగ్ స్టార్ట్ చేస్తాడు. మొదటి పార్ట్ చూసిన తర్వాత రెండో పార్ట్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ సీన్ చూసిన తర్వాత టిల్లు 2ని గట్టిగానే ప్లాన్ చేశారని అర్థమవుతుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే అనుపమ మళ్లీ ఇలాంటి పాత్ర చేస్తుందో లేదో కూడా చెప్పలేం.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss