Keerthi
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యాత్ర 2’. ఇందులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ్ హీరో జీవా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఆయన పాత్రలో చేస్తున్నప్పుడు అతనికి కొన్ని బెదిరింపుడు వచ్చాయి. అందుకు జీవా ఏం చెప్పాడంటే..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యాత్ర 2’. ఇందులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ్ హీరో జీవా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఆయన పాత్రలో చేస్తున్నప్పుడు అతనికి కొన్ని బెదిరింపుడు వచ్చాయి. అందుకు జీవా ఏం చెప్పాడంటే..
Keerthi
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యాత్ర 2’. ఈ సినిమాకి మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా గతంలో వచ్చిన యాత్ర మూవీకి సీక్వెల్ అని విషయం తెలిసిందే. ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందించారు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. పొలిటికల్ డ్రామాగా 2019 ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన యాత్ర సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ కూడా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలయ్యాయి. తాజాగా యాత్ర-2 కు సంబంధించి చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చారు. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో నటిస్తున్న జీవాకి కొన్ని బెదిరింపు చర్యలు ఎదురైయ్యాయి. వాటికి స్పందించిన జీవా ఏం చేప్పాడంటే..
మరో రెండు రోజుల్లో యాత్ర -2 సినిమా థీయేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. అందుకు సంబంధించి సినిమా ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. అక్కడ ఈ సినిమా కోసం అతను ఎలా కష్టపడ్డారు, ఎలా ఆ పాత్రలో ఒదిగారు అనే అంశం పై ముచ్చటించారు. ఈ క్రమంలోనే జీవాకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అందులో మీరు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాత్ర చేసినప్పుడు ప్రతిపక్షం నుంచి మీకు ఎలాంటి బెదిరింపు కాల్స్ అయిన వచ్చాయా? అని ఒక రిపోర్టర్ అడిగారు. దానికి అతను స్పందిస్తూ.. ‘నాకు ఎటువంటి బెదిరింపు కాల్స్ రాలేదు కానీ, మెసేజ్స్ అయితే వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ ప్రశ్న నేను ఇంతకు ముందు మమ్ముట్టి సార్ ని కూడా అడిగా. సార్ మీకు ప్రతిపక్షం నుంచి ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? అని అడిగాను. అందుకు ఆయన స్పందిస్తూ మనం ఒక యాక్టర్స్.. ఇది ఒక క్రియేటివ్ స్పేస్ అంతే. దీనిని కేవలం సినిమాలనే చూడు అని ఆయన చెప్పారు. అలాగే ఈ సినిమాలో మీరు ఎక్కువగా ఎమోషనల్ కు గురయ్యే సందర్భాలు ఉన్నాయ అనే ప్రశ్న ఎదురవ్వగా.. దానికి జీవా ‘చూడు నాన్నా’ అనే పాట చిత్రీకరిస్తున్నప్పుడు నేను చాలా ఎమోషన్‌కు లోనయ్యాను’అని అన్నారు.
ఇక దర్శకుడు మహి వీ రాఘవ్ యాత్ర -2 మూవీ వైఎస్ జగన్ పాదయాత్రను బేస్ చేసుకుని ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అలాగే యాత్ర- 2లో కేవలం వైఎస్ జగన్ చేసిన పాదయాత్రనే ఆధారంగా సినిమా ఉంటుందని, ఇతర పాత్రలకు ఎక్కువగా చూపించలేదని, ఎవ్వరినీ కించపర్చేలా అసలే పాత్రలను డిజైన్ చేయలేదని మహి వీ రాఘవ్ మరోసారి వివరణ ఇచ్చారు. అలాగే రాజకీయ నేపథ్యంతో సినిమా తీస్తే.. బురద జల్లే వాళ్లు జల్లే వారు, రాళ్లు విసిరే వాళ్లు విసురుతారు. కానీ, ఆ బురద తుడుచుకుని, రాళ్లు ఏరుకునే ఓపిక తనకి లేదని, యాత్ర- 2 సినిమా ఏంటన్నది ఆడియెన్స్ చూసి డిసైడ్ చేస్తారని పేర్కొన్నారు.ఈ చిత్రంలోనూ సీన్లు కల్పితం, నిజాలే అని చెప్పలేం. ఇది ఒక ఎమోషన్, సోల్‌ను బేస్ చేసుకుని సీన్లు రాసుకున్నాను అంటూ దర్శకుడు మహి వీ రాఘవ్ చెప్పుకొచ్చారు. ఇలానే యాత్ర 2 సినిమా పై మరెన్నో విషయాలను ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి, త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.