iDreamPost
android-app
ios-app

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కానున్న 4 సినిమాలివే

  • Published Aug 05, 2024 | 4:38 PM Updated Updated Aug 05, 2024 | 4:38 PM

This Week Theatre Releases: ఎప్పటిలాగే ఈ వారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి థియేటర్స్ లో నాలుగు చిన్న సినిమాలు విభన్న కథలతో అలరించనున్నాయి. మీర, ఇంతకీ ఆ సినిమాలేవో ఏ తేదీలో రిలీజ్ కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

This Week Theatre Releases: ఎప్పటిలాగే ఈ వారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి థియేటర్స్ లో నాలుగు చిన్న సినిమాలు విభన్న కథలతో అలరించనున్నాయి. మీర, ఇంతకీ ఆ సినిమాలేవో ఏ తేదీలో రిలీజ్ కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Aug 05, 2024 | 4:38 PMUpdated Aug 05, 2024 | 4:38 PM
ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కానున్న 4 సినిమాలివే

ఎప్పటిలాగే మరో కొత్త వారం, కొత్త నెల ప్రారంభమైయింది. అయితే గడిచిన జూలై నెలలో థియేటర్ లో కల్కి హవా తప్పా, చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు. అన్ని చిన్న చిన్న సినిమాలే కావడం గమన్హారం. పైగా వాటిలో ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ కలిగిన సినిమాలేవు. దీంతో సినీ ప్రియలు ఆగస్టు నెల ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా.. కొత్త సినిమాలు థియేటర్స్ లో ఎప్పుడు వస్తాయనని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక ఈ ఆగస్టు నెల రానే వచ్చేసింది. దీంతో మూవీ లవర్స్ కు పండగ వాతవరణమనే చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ నెలలో సినిమాల జాతరకు కొదవే లేదు. రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ వంటి పెద్ద సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నాయి. ఇక వాటితో పాటు ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి థియేటర్స్ లో నాలుగు చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. మరీ, ఆ సినిమాలు ఏవీ ఏ తేదీలో రిలీజ్ కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తుఫాన్

ఈ వారం థియేటర్స్ లో తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి విజయ్ ఆంటోని ‘తుఫాన్’ మువీతో సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సినిమాను దర్శకుడ విజయ్ మిల్టన్ తెరకెక్కించారు. కాగా, ఈ సినిమాను కమల్ బోరా, డి. లలిత, బి. ప్రదీప్ , పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఇక తుఫాన్ మూవీ మొదట ఆగస్టు 2వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. కాగా, ఇప్పుడు ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే విజయ్ ఆంటోని సినిమాలంటే తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగ చూస్తారనే విషయం తెలిసిందే. మరీ, ఈ క్రమంలోనే ఈ ఆగస్టు 9వ తేదీన థియేటర్స్ లోకి రాబోతున్న తుఫాన్ మూవీని మిస్ చేయకుండా చూసేయండి.

కమిటీ కుర్రోళ్ళు

‘కమిటి కుర్రోళ్లు’.. ఈ సినిమాలో లో అందరూ కొత్త యాక్టర్స్ సందడి చేయనున్నారు. అయితే ఇందులో సందీప్‌ సరోజ్, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, త్రినాథ్‌ వర్మ, ప్రసాద్‌ బెహరా ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇకపోతే ఈ సినిమాను నిహారిక కొణిదెల ప్రొడ్యుసర్ గా వ్యవహారించగా.. ద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక సంయుక్తంగా నిర్మించారు. కాగా, ఇందులో సాయికుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా యూత్ ఎంటర్టైన్మెంటర్ గా తెరకెక్కనుంది.

సింబా

‘సింబా’.. ఇదొక సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీ. ఇందులో జగపతిబాబు, అనసూయ కీలక పాత్రల్లో నటించనున్నారు. అయితే ఈ మూవీని మురళీ మనోహర్ దర్శకత్వం వహించనున్నారు. అలాగే సంపత్‌ నంది, దాసరి రాజేందర్‌రెడ్డి నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 9వ తేదీన థియేటర్స్ లో విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో ప్రకృతిని నాశనం చేస్తే, పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయో ఇందులో చూపించనున్నారు. అసలు ఇంతవరకూ ఇండియన్‌ స్క్రీన్‌పై రాని సరికొత్త కథనంతో ఈ మూవీని తీర్చిదిద్దినట్లు ఇటీవలే చిత్ర యూనిట్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరీ, ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీన థియేటర్స్ లో మిస్ చేయకుండా చూసేయండి.

భవనమ్‌

‘భవనమ్’ (ది హంటెడ్‌ హౌస్‌).. ఈ సినిమా అటు సస్పెన్స్, ఇటు వినోదంతో మిక్సై థియేటర్స్ లో అలరించనుంది. ఇకపోతే ఇందులో సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్‌ ప్రధాన పాత్రధారులుగా నటించనున్నారు. అయితే ఈ సినిమా సూపర్ గుడ్ ఫిలింస్ సమర్పణలో..ఆర్‌.బి.చౌదరి, వాకాడ అంజన్‌ కుమార్, వీరేంద్ర సీర్వి నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా కూడా ఆగస్టు 9న థియేటర్స్ లో విడుదల కానుంది. కాగా, ఈ సినిమాలో సస్పెన్స్‌ థ్రిల్లింగ్‌ తో పాటు ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు వినోదాన్ని అందించనుంది. ఇకపోతే ఈ కథలో భవనం కథేమిటి? అది ఎవరిని, ఎలా వెంటాడిందనేది తెరపైనే చూడాలి’ అని చిత్ర బృందం తెలిపింది.

మరీ, ఈ వారం ఆగస్టు 9వ తేదీన సస్పెన్స్ థ్రిల్లర్, ఎంటర్టైన్మెంట్ వంటి డిఫరెంట్ కాన్సేఫ్ట్ కథలతో థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ నాలుగు సినిమాలను అస్సలు మిస్ చేయకుండా చూసేయండి. అలాగే ఈ నాలుగు సినిమాల్లో మీకు ఆసక్తి కలిగిన సినిమాలేవో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.