iDreamPost
android-app
ios-app

కళ్లతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

ఈ ఫోటోలోని చిన్నారిని చూశారా. తన కళ్లతోనే నటనను పలికిస్తున్నట్లు కనిపిస్తుంది కదూ. అవును మరీ ఇప్పుడు కూడా తన యాక్టింగ్ తో ఇరగదీస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా..?

ఈ ఫోటోలోని చిన్నారిని చూశారా. తన కళ్లతోనే నటనను పలికిస్తున్నట్లు కనిపిస్తుంది కదూ. అవును మరీ ఇప్పుడు కూడా తన యాక్టింగ్ తో ఇరగదీస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా..?

కళ్లతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

హీరోయిన్లు లేని సినిమా ఊహించడం కష్టం. అడపాదడపా సినిమాల్లో హీరోయిన్స్ లేకపోయినా పర్వాలేదు కానీ.. అన్ని వేళలా అయితే వర్కౌట్ కాదు. అందుకే కథ సిద్ధం అయినప్పుడే కథానాయకి పాత్రకు ప్రాణం పోస్తారు రైటర్స్. అయితే ప్రస్తుతం ఈ సితారలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎక్కడ నుండైనా పట్టుకొచ్చేసి హీరోయిన్స్ చేసేస్తున్నారు. మరో ఇండస్ట్రీలో ఎదుగుతున్న నటీమణుల్ని తీసుకువచ్చి స్టార్ హీరోయిన్స్‌గా మార్చేస్తున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. చివరికి టీవీ రంగంలో మంచి పేరు వస్తున్నా వారిని లైఫ్ ఇచ్చేస్తున్నారు. భాష రాకున్నా, తెలవకపోయినా పర్వాలేదు కానీ.. సినిమాల్లో నటించాలన్న ఫ్యాషన్, కాస్తంత యాక్టింగ్ టాలెంట్ ఉంటే చాలు తెలుగు పరిశ్రమలో హీరోయిన్‌గా రాణించడం పక్కా.

ప్రతి నటీమణి ఏదో ఒక దశలో తమను తాము కథానాయకిగా ఊహించుకునే ఉంటారు. చిన్నప్పుడు అమ్మ చీర కట్టినప్పుడో, యుక్త వయస్సులో మంచి డ్రెస్ వేసుకున్నప్పుడో అద్దం ముందు నుంచొని హీరోయిన్లుగా ఫోజులు కొడుతుంటారు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నది కూడా అదే బాపతు. మీరాబాయి వేషంలో కనిపిస్తున్న ఈ చిన్నారి కూడా అప్పట్లో ఊహించి ఉండదు.. తానిప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతానని. కళ్లతోనే హవాభావాలు పలికిస్తోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా..? టీవీ రంగం నుండి వచ్చి.. ఆ తర్వాత పరాయి భాషల్లో అనేక సినిమాలు చేసి.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా దూసుకెళుతోంది అమ్మడు. ఇంతకు ఆమె ఎవరంటే..

మన సీత.. మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచేసుకున్న అమ్మడు..తొలుత సీరియల్స్ చేసిన సంగతి విదితమే. తెలుగులో డబ్బింగ్ అయిన హిందీ ధారాావాహిక కుంకుమ భాగ్య సీరియల్ చూసిన ప్రతి ఒక్కరికీ ఈమె తెలుసు. సీరియల్స్ చేస్తూనే మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అటు నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి.. ఇటు టీ టౌన్‌లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తనదైన కట్టుబొట్టుతో తెలుగు ప్రేక్షకులను బుట్టలోకి వేసేసుకుంది ఈ భామ. తర్వాత హాయ్ నాన్న అంటూ పలకరించింది. అయితే తెలుగులో చేసిన రెండు సినిమాల్లోనూ రెండు పేర్లతో కనిపిండం విశేషం.

did you remember this girl she is a star heroine

సీతారామంలో ప్రిన్సెస్ నూర్జహాన్ గా, సీతా మహాలక్ష్మిగా అలరించిన ఈ బ్యూటీ..హాయ్ నాన్నలో కూడా యష్నా, వర్ష అనే క్యారెక్టరలో మెరిసింది. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం బెటర్ అనుకుందే ఏమో..వరుస పెట్టి సినిమాలు చేయకుండా ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడు విజయ్ దేవర కొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాకు సిద్ధం అవుతుంది. ఈ సంక్రాంతికే ఈ మూవీ రావాల్సి ఉండగా.. ఎందుకో వెనక్కు తగ్గింది. విజయ్ దేవరకొండ-పరశురాం కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్. ఈ మూవీ మార్చిలో వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet