iDreamPost
android-app
ios-app

సలార్ స్పందించలేదు.. ఆ డేట్ కి కర్చీఫ్ వేసిన మూవీస్ ఇవే!

  • Author ajaykrishna Updated - 03:44 PM, Tue - 5 September 23
  • Author ajaykrishna Updated - 03:44 PM, Tue - 5 September 23
సలార్ స్పందించలేదు.. ఆ డేట్ కి కర్చీఫ్ వేసిన మూవీస్ ఇవే!

ఎంతో ఎక్సయిట్ మెంట్.. ఎన్నో ఆశలు.. బాక్సాఫీస్ హడావిడి.. వీటన్నింటి మధ్య రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన పాన్ ఇండియా మూవీ వాయిదా పడితే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం సలార్ ఫ్యాన్స్ అలాంటి మూడ్ లోనే ఉన్నారు. ఎంతో ఆశగా సలార్ రిలీజ్ దగ్గరపడింది అనుకున్న టైమ్ లో.. ఒక్కసారిగా మేకర్స్ నుండి మౌనం, మీడియాలో సినిమా వాయిదా అని కథనాలు. అసలు అది నిజమో కాదో మేకర్స్ తేల్చలేదు.. మౌనం అర్థాంగీకారం అన్నట్లు.. సలార్ టీమ్ సైలెంట్ అయ్యిందంటే వాయిదా పడిందని కన్ఫర్మ్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు ఫ్యాన్స్. అయినా.. ఎక్కడో చిన్న ఆశ ప్రమోషన్స్ లేకపోయినా.. ట్రైలర్ వదిలి, అదే డేట్ కి రిలీజ్ చేస్తారేమో అని.. కానీ అవన్నీ జరగట్లేదని తాజాగా అర్థమైపోయింది.

ఎందుకంటే.. సలార్ డేట్ సెప్టెంబర్ 28న.. వేరే హీరోల సినిమాలు రిలీజ్ ఖరారు చేసుకున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ – కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ కాంబినేషన్ లో సలార్ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఊహించని రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేసిన సలార్.. ఒక్కసారిగా వాయిదా అనేసరికి కాసేపు షాక్ లోకి వెళ్లిపోయారు ఫ్యాన్స్. రాధేశ్యామ్, ఆదిపురుష్ ల తర్వాత ప్రభాస్ ని నెక్స్ట్ లెవెల్ కి సలార్ తీసుకెళ్తుందని అనుకున్నారు. కానీ.. ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. మరోవైపు సలార్ వాయిదా పడితే.. ఆ డేట్ లో తమ సినిమాలు రిలీజ్ చేసుకుందామని మేకర్స్ ప్రయత్నాలు.

ఎట్టకేలకు కొత్త సినిమాలు సలార్ డేట్ పై కర్చీఫ్ వేసేశాయి. తాజాగా రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశాయి. దీంతో ఇప్పుడు సలార్ కి సంబంధించి మేకర్స్ స్పందించకపోయినా.. ఈ విధంగా కన్ఫర్మ్ అయ్యిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ సలార్ రిలీజ్ టైంని ఏయే సినిమాలు కైవసం చేసుకున్నాయంటే.. రామ్ పోతినేని – బోయపాటిల స్కంద, కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ సినిమాలు 28న వస్తున్నాయి. వీటితో పాటు మ్యాడ్ అనే సినిమా కూడా అదే రోజు రానుంది. ఇక సెప్టెంబర్ 29న శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన పెదకాపు రిలీజ్ కాబోతుంది. ఇవేగాక మరికొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా వస్తున్నాయట. మరి సలార్ డేట్స్ కి వస్తున్న సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet