iDreamPost
android-app
ios-app

Heroine: సన్యాసిగా మారిన స్టార్ హీరోయిన్.. కోట్లు వదులుకుని ఇలా!

  • Published Feb 07, 2024 | 1:21 PMUpdated Feb 07, 2024 | 2:52 PM

సినీ ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ స్టార్ హీరోల సరసన నటించి, స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. కానీ, ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయింది. ఈ హీరోయిన్ ఫోటోస్ చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకి ఆమె ఎవరంటే..

సినీ ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ స్టార్ హీరోల సరసన నటించి, స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. కానీ, ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయింది. ఈ హీరోయిన్ ఫోటోస్ చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Feb 07, 2024 | 1:21 PMUpdated Feb 07, 2024 | 2:52 PM
Heroine: సన్యాసిగా మారిన స్టార్ హీరోయిన్.. కోట్లు వదులుకుని ఇలా!

సినీ ఇండస్ట్రీలో చాలామంది నటన మీద ఉండే పాషన్ తో వెండితెర పై అడుగు పెడతారు. మరి కొంతమంది అనుకోకుండా ఈ రంగం పై అడుగులు వేస్తారు. ఇలా సినీ పరిశ్రమలో ఆవకాశలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు. అయితే ఈ క్రమంలోనే కొంతమంది కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు పెళ్లిళ్లు చేసుకొని నటనకు దూరం అవుతారు. మరికొందరు నటన మీద ఇంట్రెస్ట్ తగ్గి నటనకు గుడ్ బై చెప్తారు. అచ్చం ఇలాంటి ఈ కోవకు చెందిన ఓ హీరోయిన్ కూడా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు తన నటనకు స్వస్తి పలికింది. ఈమె ఒక స్టార్ హీరోయిన్. దాదాపు స్టార్ హీరోల అందరితో నటించి మెప్పించింది. అలాగే ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని కొద్దిలో టైటిల్ చేజార్చుకుంది. కానీ, ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయింది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా.

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఒక మోడల్. మోడల్ గా కేరీర్ మొదలుపెట్టిన ఈమెసినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మనసును దోచేశారు. అలాగే ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలను అందుకుంటూ.. మంచి పాపులారీటి సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్స్ గుర్తుపట్టాడానికి కాస్తా సమయమే పట్టింది. ఎంతో ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఇప్పుడు ఉన్నటుండి బౌద్ధ సన్యాసిగా మారింది. అలాగే ఆమె ఇన్ స్టా ఖాతాలోని అన్ని ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన విషయాలనే పంచుకుంటుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? తానే ‘బర్ఖా మదన్’. ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. 1994లో ‘మిస్ ఇండియా ఫైనలిస్ట్’ లో చేరింది. అంతేకాకుండా మిస్ ఇండియా కిరీటం కోసం సుస్మితా సేన్, ఐశ్వర్యా రాయ్ లతో పోటీ పడి మొదటి రన్నరప్ గా నిలిచారు. ఆ తర్వాత మిస్ టూరిజం వరల్డ్ వైడ్ రన్నరప్ గా నిలిచారు. మలేషియాలో ‘మిస్ టూరిజం ఇంటర్నేషనల్‌లో మూడవ రన్నరప్‌గా’ నిలిచింది.

అయితే 1996లో ‘ఖిలాడీ కా ఖిలాడీ’ సినిమాతో కథానాయికగా మదన్ బాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 2003లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘భూత్’ సినిమాలో మంజీత్ ఖోస్లా అనే ఘోస్ట్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే.. అజయ్ దేవగన్, ఊర్మిళ మటోండ్కర్, నానా పటేకర్, రేఖ, ఫర్దీన్ ఖాన్ వంటి స్టార్లతో కలిసి పనిచేసింది. కాగా, బర్ఖా మదన్ ఓవైపు సినిమాలు చేస్తునే.. మరోవైపు సీరియల్స్ లో కూడా నటించింది. అలా కొన్నాళ్లుకు ఆమె కోరుకున్న పాత్రలు లభించకపోవడంతో బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. అందులో 1857 క్రాంతితో సహా పలు టీవీ సీరియల్స్‌లో నటించింది.

కానీ, ఇప్పుడు ఉన్నట్లుండి సన్యాసిగా మారిపోయారు. బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ‘గ్యాల్టెన్ సామ్టెన్’ గా తన పేరును మార్చుకున్నారు. ప్రస్తుతం ఆమె పర్వతాలు, ఆశ్రమాలలలో తిరుగుతూ కనిపిస్తున్నారు. కాగా, ఈమె 2012లో బౌద్ధమతాన్ని స్వీకరించాలని అనుకోగా ఇప్పటికి జరిగింది. మరి, బౌద్ధ మతాన్ని స్వీకరించిన బర్ఖా మదన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Barkha Madan (@barkhamadan17)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి