iDreamPost
android-app
ios-app

66 మూవీలు..ఐశ్వర్యతో రొమాన్స్.. కట్‌చేస్తే దీన స్థితి.. ఎవరు ఆ హీరో?

  • Published Apr 20, 2024 | 1:52 PM Updated Updated Apr 20, 2024 | 2:39 PM

సినీ ఇండస్ట్రీలో 1990 కాలంలో కళ్లు చెదిరే స్టార్ డమ్ ను తెచ్చుకొని, అప్పటిలో.. లవర్ బాయ్ గా పెరుతెచ్చుకున్నా ఓ స్టార్ హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు గుర్తుపట్టాలేని దీనస్థితిలోకి మారిపోయాడు. ఇంతకి ఆ హీరో ఎవరంటే..

సినీ ఇండస్ట్రీలో 1990 కాలంలో కళ్లు చెదిరే స్టార్ డమ్ ను తెచ్చుకొని, అప్పటిలో.. లవర్ బాయ్ గా పెరుతెచ్చుకున్నా ఓ స్టార్ హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు గుర్తుపట్టాలేని దీనస్థితిలోకి మారిపోయాడు. ఇంతకి ఆ హీరో ఎవరంటే..

  • Published Apr 20, 2024 | 1:52 PMUpdated Apr 20, 2024 | 2:39 PM
66 మూవీలు..ఐశ్వర్యతో రొమాన్స్.. కట్‌చేస్తే దీన స్థితి.. ఎవరు ఆ హీరో?

సినీ ఇండస్ట్రీ అనేది ఒక మాయ ప్రపంచం. ఇక్కడ ముఖానికి రంగు వేసుకోవడమే కాదు.. జీవితం కూడా అంత రంగుల మయంగా ఉంటుంది. అంతేకాకుండా.. ఈ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఎంత ఎత్తుకు ఎదుగుతారో, మళ్లీ అంతే కిందకు దిగజారిపోతుంటారు. అందుకే సిని పరిశ్రమలో ఎంత పెద్ద హిట్స్ సాధించినా, స్టార్ హోదా సంపాందించిన ఆచి, తూచి అడుగులు వేస్తు జాగ్రత్తగా ఉండాలి. కానీ, చాలామంది ఈ ఇండస్ట్రీలో రాత్రికి రాత్రే స్టార్లుగా మారుతుంటారు. అలాగే కెరీర్ ఏమాత్రం తిరుగులేదు, మంచి ఫామ్ లో ఉంది అనుకునేలోపే.. ఏదో ఒక తప్పులు చేస్తు చివరికి అవకాశాలు లేక దీన స్థితికి జారిపోతుంటారు. అలా ఇండస్ట్రీలో వచ్చిన స్టార్ డమ్ ను కాపాడుకోలేక కనుమరగైపోయిన వారిలో చాలామంది హీరోలు ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయిన హీరో కూడా ఒకరు. ఇంతకి ఆ హీరో ఎవరంటే..

చిత్ర పరిశ్రమలో 1990 కాలంలో ఒక వెలుగు వెలిగినా స్టార్ హీరో గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. కేవలం ఒకే ఒక్క సినిమాతో కళ్లు చెదిరే స్టార్ డమ్ ను తెచ్చుకొని, అప్పటిలో.. లవర్ బాయ్ గా పెరుతెచ్చుకున్నాడు ఈ హీరో. కానీ, కొన్ని చెడు నిర్ణయాలు తప్పటి అడుగులు వల్ల కెరీర్ ను త్వరగా నాశనం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎవరికీ కనిపించకుండా, ఎవరు గుర్తుకు పట్టలేని దీనస్థితిలో జీవిస్తున్నాడు. అతను మరెవరో కాదు.. ప్రేమదేశం సినిమాతో అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారిన స్టార్ హీరో ‘అబ్బాస్’. ఈయన అసలు పేరు మీర్జా అబ్బాస్ అలి. ఇతను ఒకప్పుడు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగాడు. అయితే ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉన్నడో కూడా తెలియని జీవితాన్ని గడుపుతున్నాడు. కాగా, అబ్బాస్ ‘ముస్తాఫా ముస్తాఫా’ అనే సూపర్ హిట్ ఫ్రెండ్‌షిప్ సాంగ్‌లో కనిపించి భారతదేశ వ్యాప్తంగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. దీనితో పాటు ‘ఛుయిముయి సి లగ్తి హో తుమ్‌’ ఆల్బమ్‌లో కూడా నటించి మంచి గుర్తింపు పొందాడు. అలాగే ఇండస్ట్రీలో ఐశ్వర్య రాయ్, టబు, రజనీకాంత్, మమ్ముట్టి లాంటి స్టార్లతో నటించిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు ఈ గ్లామర్ ఇండస్ట్రీకి దూరంగా జీవిస్తున్నాడు. కాగా, 90sలో సూపర్ స్టార్ గా అబ్బాస్ నాలుగు సార్లు దివాళా తీశాడు. ఆ సమయంలో.. పొట్టకూటి కోసం టాక్సీ డ్రైవర్‌గా, టాయిలెట్ క్లీనర్‌గా కూడా పనిచేశాడు.

కాగా, అబ్బాస్ తండ్రి ఈ హీరోను అప్పటిలో ఇంజనీర్‌గా చూడాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే తండ్రి కోరిక మేరకు అబ్బాస్  ఇంజనీరింగ్ కాలేజీలో కూడా చేరాడు. అయితే 1994లో బెంగళూరులో ఒక మోడలింగ్ కాంపిటీషన్ జరుగుతుందని తెలుసుకుని, అందులో అబ్బాస్ పాల్గొన్నాడు. ఇక ఆ కాంపిటీషన్‌లో ఈయన గెలవడంతో.. అదే అతని సినీ కెరీర్ కు నాంది పలికింది.  అలా మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన అబ్బాస్, 1995లో ఒక స్నేహితుడి సలహా మేరకు ఓ తమిళ సినిమాకు ఆడిషన్‌కి వెళ్ళాడు. అక్కడ ఆయన నటనను చూసి ముగ్ధుడైన దర్శకుడు కాదీర్.. 1996లో ‘కాదల్ దేశం’ (తెలుగులో ప్రేమదేశం)  సినిమాలో స్క్రీన్‌టెస్ట్‌కి ఆహ్వానించాడు. ఇక ఆ టెస్ట్‌లో అబ్బాస్‌కు రాణించడంతో.. అతనికి ఆ సినిమాలో హీరో పాత్ర దక్కింది. అలాగే  ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ అవ్వడంతో.. అబ్బాస్ సూపర్‌స్టార్‌గా మారాడు.  కాగా, ఈ సినిమా విజయం తర్వాత ఈయనకు వరుసగా సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి.

ఈ క్రమంలోనే  ‘కందుకొండైన్ కందుకొండైన్’ (2000) సినిమాలో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో కలిసి రొమాన్స్ చేశాడు. ఆ సినిమానే తెలుగులో  ‘ప్రియురాలు పిలిచింది’ గా డబ్ అయి హిట్ అయింది. ఇందులో లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి కూడా నటించాడు. ఆ తర్వాత..  ‘పడయప్ప’ (నరసింహ) సినిమాలో రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకున్నాడు. అలాగే ‘హే రామ్’ (2000), ‘ఆనందం’ (2001), ‘మిన్నలే’ (2001) లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లోనూ నటించాడు. అలా ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించిన అబ్బాస్ కొంతకాలానికి కెరీర్ డైన్ ఫాల్ అయ్యింది.  అతని చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే ఓ ఇండర్వ్యూలో పాల్గొన్న అబ్బాస్ తన సినీ కెరీర్ గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఆ ఇంటర్వ్యూలో అబ్బాస్ మాట్లాడుతూ.. “నా కెరీర్ ప్రారంభంలో కొన్ని విజయాలు సాధించిన తర్వాత, ఆ తర్వాత కొన్ని  సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆర్థికంగా నేను బాగా కుంగిపోయాను. అద్దె, సిగరెట్లు లాంటి చిన్న అవసరాలను కూడా తీర్చుకోలేకపోయా  దుస్థితికి చేరుకున్నా.

ఇక ఆ పరిస్థితి  నుంచి బయటపడటానికి నేను నిర్మాత RB చౌదరిని కలిసి, నాకు ఏదైనా పని ఉంటే ఇవ్వమని అభ్యర్థించాను. ఆయన దయతో నాకు ‘పూవేలి’ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. కానీ ఆసక్తి లేకపోవడంతో, నేను సినిమాలను వదిలివేశాను.” అని అబ్బాస్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా, 2015లో సినిమాలను వదిలివేసిన అబ్బాస్ న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. అక్కడ డబ్బుల్లేక బైక్ మెకానిక్‌గా, టాయిలెట్ క్లీనర్‌గా, టాక్సీడ్రైవర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం, అబ్బాస్ మోటివేషనల్ స్పీకర్‌గా పనిచేస్తున్నాడు.మరి, స్టార్  హీరోగా వెలుగు వెలిగిన అబ్బాస్ కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకోక దీనస్థితికి దిగజారిపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.