iDreamPost
android-app
ios-app

Game Changer: గేమ్ ఛేంజర్ వచ్చేది అప్పుడేనట.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

ఈ మధ్య కాలంలో సినిమాలు తీస్తున్నారు కానీ అప్ డేట్స్ ఇవ్వడం మర్చిపోతున్నారు దర్శక నిర్మాతలు. సినిమా పూర్తయ్యే వరకు సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం లేదు. గేమ్ ఛేంజర్ విషయంలో ఇదే చోటుచేసుకుంది. ఎప్పుడు విడుదల తేదీ తెలియక.. అయోమయంలో ఉన్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్.

ఈ మధ్య కాలంలో సినిమాలు తీస్తున్నారు కానీ అప్ డేట్స్ ఇవ్వడం మర్చిపోతున్నారు దర్శక నిర్మాతలు. సినిమా పూర్తయ్యే వరకు సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం లేదు. గేమ్ ఛేంజర్ విషయంలో ఇదే చోటుచేసుకుంది. ఎప్పుడు విడుదల తేదీ తెలియక.. అయోమయంలో ఉన్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్.

Game Changer: గేమ్ ఛేంజర్ వచ్చేది అప్పుడేనట.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గేమ్ ఛేంజర్ మూవీతో బిజీ బిజీగా గడుపుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రముఖ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తున్నాడని సంతోషించాలా లేక.. కానీ ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందో తెలియక బాధపడాలో అర్థం కావడం లేదు అభిమానులకు. ఈ మూవీ నుండి అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే చూసి చూసి లీకు వీరులు జరగండి జరగండి అంటూ సాంగ్‌ను లీక్ కూడా చేసేశారు. అంతలో ఈ లీకైన పాట దీపావళికి వచ్చేస్తుంది అంటూ అనౌన్స్ చేసి.. ఫ్యాన్స్ ఆశలు గల్లంతు చేశారు. ఏడాదిన్నర నుండి ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంటుంది. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఎనౌన్స్ చేయడం లేదు. ఈ మూవీని భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు దిల్ రాజు, శిరీష్

ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి గతంలో దిల్ రాజు కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శంకర్ లాంటి దర్శకులతో పనిచేసేటప్పుడు.. రిలీజ్ డేట్స్ లాక్ చేయలేమని చెప్పారు. వాళ్లు సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చే వరకూ తీస్తూనే ఉంటారని చెబుతూ.. వాళ్లు చెప్పేంత వరకు విడుదల తేదీ చెప్పలేమని అన్నారు. ఈ క్రమంలో 80 శాతం షూటింగ్ పూర్తయ్యిందని చెప్పారు. అయితే తాజాగా ఆయన గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ చెప్పేశారు. గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఉంటుందని స్పష్టం చేశారు. సలార్ మూవీ చూసేందుకు వచ్చిన దిల్ రాజును ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అని అభిమానులు ప్రశ్నించగా.. ఈ విషయాన్ని వెల్లడించారు. వినాయక చవితికి గానీ, ఆ తర్వాత విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఓ పొలిటికల్ డ్రామా అని ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్ నటిస్తోన్న 15వ చిత్రం ఇది. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇటీవల మైసూరులో షూటింగ్ పూర్తి చేసుకుంది గేమ్ ఛేంజర్. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అందించిన కథను కళాఖండంగా తెరపైకి ఎక్కిస్తున్నాడు దర్శకుడు శంకర్. ఈ మూవీలో వినయ విధేయ రామలో అతడితో కలిసి ఆడిపాడిన కియారా అద్వానీ మరోసారి జతకడుతోంది. ఇందులో సముద్రఖని, నవీన్ చంద్ర, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు దిల్ రాజు చెప్పిన తేదీకైనా విడుదల అవుతుందని భావిస్తున్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş