iDreamPost
android-app
ios-app

దేవి సినిమాలోని ఈ బుడ్డోడు.. ఇప్పుడు బిజీ హీరో..

  • Published Feb 08, 2024 | 5:49 PM Updated Updated Feb 08, 2024 | 5:49 PM

1999లో వచ్చిన దేవి మూవీ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం ద్వారానే దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈ చిత్రంలో అలరించిన బుడ్డోడు గుర్తున్నాడా..?

1999లో వచ్చిన దేవి మూవీ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం ద్వారానే దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈ చిత్రంలో అలరించిన బుడ్డోడు గుర్తున్నాడా..?

  • Published Feb 08, 2024 | 5:49 PMUpdated Feb 08, 2024 | 5:49 PM
దేవి సినిమాలోని ఈ బుడ్డోడు.. ఇప్పుడు బిజీ హీరో..

చై ల్డ్ ఆర్టిస్టుల వల్ల సినిమాలు ఆడాయంటే.. ఇప్పుడు నమ్మక్యంగా ఉండకపోవచ్చు కానీ.. ఇది నిజం. అందుకు ఉదాహరణ బేబీ షామిలీయే. బేబీ షామిలీ అంటే విపరీతమైన క్రేజ్. ఆమె నటనకు, ముద్దు ముద్దు మాటలకు ఫిదా కాని పేరెంట్, చైల్డ్ ప్రేక్షకులు లేరు. ఆమె ప్రధాన పాత్రల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. చైల్డ్ ఆర్టిస్టుగానే ఆమె సక్సెస్ అందుకుంది.షామిలితో అనేక సినిమాలు చేసి డబ్బులు గడించిన నిర్మాతలు ఉన్నారు. హీరో,హీరోయిన్లతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు అప్పట్లో టాక్ నడిచింది. షామిలి, షాలిని, తరుణ్ వంటి చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించి, సక్సెస్ సాధించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి ఇలాంటి సినిమాలు చూసేందుకు ఇష్టపడేవారు. అలా వారి తర్వాతే అంతే పేరు తెచ్చుకున్నాడు ఓ చిచ్చర పిడుగు.

దేవి మూవీ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఈ మూవీతోనే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తన కెరీర్ స్టార్ చేశాడు. ఇందులో తన నటనతో ఆకట్టుకున్న పిల్లాడు గుర్తుకు ఉన్నాడా.. ఎలా మర్చిపోతారనుకుంటున్నారా.. అవును ఈ చిచ్చర పిడుగు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.. ఇప్పుడు బిజీ హీరో అయ్యాడు. ఆహా మూవీతో అల్లరి పిడుగుగా కనిపించిన అతడి పేరు మహేంద్రన్. 1994లో తమిళ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన మహేంద్రన్.. తెలుగులో పెదరాయుడు సినిమాలో కనిపించాడు. ‘నేను చూశాను తాతయ్య’ అంటూ రజనీకాంత్ లాంటి స్టార్ హీరో ముందు ఏ మాత్రం తడబడకుండా డైలాగ్ చెప్పి మెస్మరైజ్ చేశాడు ఈ బుడ్డోడు.

పెళ్లి చేసుకుందాం, ఆహా, దేవి, లిటిల్ హార్ట్స్, నీ స్నేహం, వంటి చిత్రాల్లో నటించాడు. దేవీ, లిటిల్ హార్ట్స్ మూవీలకు గానూ .. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నంది పురస్కారాలను అందుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారి తమిళంలో అనేక సినిమాలు చేశాడు. అలాగే సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు. మాస్టర్ సినిమాలో యంగ్ భవాని పాత్రలో కనిపించింది మహేంద్రనే. గత ఏడాది రిప్అప్ బరీ అనే మూవీతో పలకరించాడు. అలాగే లేబుల్ అనే ఓటీటీ వెబ్ సిరీస్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన ఇతడు.. ఇంకా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టలేదు. ఇప్పుడు తమిళంలో ఓ సినిమాను షురూ చేశాడు. రెండు రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ అయ్యింది. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. కోలీవుడ్ లో విజయ్ ఎంట్రీపై ప్రశ్న అడిగితే.. పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş