iDreamPost
android-app
ios-app

టాలెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ తరుణ్‌ భాస్కర్‌ బర్త్ డే స్పెషల్!

దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత తరుణ్‌ 2018లో ‘ ఈ నగరానికి ఏమైంది?’ సినిమాతో  ప్రేక్షకుల్ని పలకరించారు. చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసింది...

దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత తరుణ్‌ 2018లో ‘ ఈ నగరానికి ఏమైంది?’ సినిమాతో  ప్రేక్షకుల్ని పలకరించారు. చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసింది...

టాలెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ తరుణ్‌ భాస్కర్‌ బర్త్ డే స్పెషల్!

‘టాలెంట్‌ ఎవడబ్బ సొత్తు కాదు!’.. అవును.. నీలో టాలెంట్‌ ఉండి.. దాన్ని నిరూపించుకోగలిగే సత్తా కూడా ఉంటే.. నిన్ను ఎవరూ ఆపలేరు. అది ఏ రంగం అయినా సరే.. విజయం నీకు బానిసగా మారుతుంది. సినిమా రంగం ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. కేవలం టాలెంట్‌, పట్టుదలతో వచ్చి అద్భుత విజయాలు సాధిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో దర్శక,నటుడు తరుణ్‌ భాస్కర్‌ ఒకరు. ఆయన తీసింది తక్కువ సినిమాలే అయినా.. తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం దర్శకుడిగానే కాదు.. నటుడిగా కూడా తన సత్తా చాటుతున్నారు.

మొదటి సినిమాతో నేషనల్‌ అవార్డు!

తరుణ్‌ భాస్కర్‌ సినిమాల్లోకి రాకముందు షార్ట్‌ ఫిల్మ్‌లు తీసేవారు. అలా షార్ట్‌ ఫిల్మ్స్‌ ద్వారా తనను తాను ఫీచర్‌ ఫిలిమ్స్‌ కోసం సిద్ధం చేసుకున్న తరుణ్‌.. 2016లో వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఓ కొత్త కధను.. చాలా కొత్తగా ప్రేక్షకుల ముందు ఉంచారు. ఇందులోని నూటికి 90 శాతం సీన్లు నిజజీవితానికి చాలా దగ్గరగా ఉండటంతో ప్రేక్షకులకు ఇట్టే కనెక్ట్‌ అయింది. సంచలన విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు! ఈ సినిమాకు బెస్ట్‌ స్క్రీన్‌ ప్లే.. డైలాగ్స్‌కు గాను తరుణ్‌ నేషనల్‌ అవార్డు అందుకున్నారు. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయి గుర్తింపు సొంతం చేసుకున్నారు.

‘ ఈ నగరానికి ఏమైంది?’

దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత తరుణ్‌ 2018లో ‘ ఈ నగరానికి ఏమైంది?’ సినిమాతో  ప్రేక్షకుల్ని పలకరించారు. చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసింది ‘ఈ నగరానికి ఏమైంది?’. బెస్ట్‌ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఆ సంవత్సరంలో చరిత్ర సృష్టించింది. ఓ నలుగురు కుర్రాళ్ల జీవితంలో చోటుచేసుకునే సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. వాస్తవికతకు చాలా దగ్గరగా.. ఎంతో సింపుల్‌గా ఈ సినిమాను తీశారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌కు బాగా ఎక్కేసింది. ఈ మూవీ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని గత జూన్‌ నెలలో రీరిలీజ్‌ కూడా అయింది. సోషల్‌ మీడియాలో  ‘ ఈ నగరానికి ఏమైంది?’ మీమ్స్‌ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బహుముఖ ప్రజ్ఞాశాలి!

తరుణ్‌ భాస్కర్‌ దర్శకుడిగానే కాదు.. నటుడిగా.. స్క్రీన్‌ ప్లే.. డైలాగ్‌ రైటర్‌గా సత్తా చాటుతున్నారు. ‘‘ మహానటి’’ సినిమాతో యాక్టింగ్‌ కెరీర్‌ను స్టార్ట్‌ చేశారు. ఇప్పటి వరకు 10కిపైగా సినిమాల్లో నటించారు. తను దర్శకత్వం వహించిన ‘ కీడా కోలా’ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర చేశారు. ఇతర దర్శకుల సినిమాల్లోనూ నటిస్తున్నారు. అంతేకాదు! 2019లో వచ్చిన మీకు మాత్రమే చెప్తాతో డైలాగులు రాసి మెప్పించారు. తరుణ్‌ డైలాగుల్లో హ్యూమర్‌ పారుతూ ఉంటుంది. అందుకే అన్ని వర్గాల ప్రజల్లోకి ఇట్టే వెళ్లిపోతుంటాయి. అందరికీ నోటెడ్‌ అవుతూ  ఉన్నాయి.