iDreamPost
android-app
ios-app

రజనీకాంత్ ని దాటేశాడా? కొన్ని నిజాలు తొందరగా ఒప్పుకోలేము!

సినిమా అనగానే రజినీకాంత్ స్టామినాని ఎవరూ టచ్ చేయలేరు అనే చెప్పాలి. కానీ, ఇప్పుడు దళపతి విజయ్ మాత్రం రజినీ స్టామినాని టచ్ చేశాడు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. వాటిలో నిజం ఎంతుంది?

సినిమా అనగానే రజినీకాంత్ స్టామినాని ఎవరూ టచ్ చేయలేరు అనే చెప్పాలి. కానీ, ఇప్పుడు దళపతి విజయ్ మాత్రం రజినీ స్టామినాని టచ్ చేశాడు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. వాటిలో నిజం ఎంతుంది?

రజనీకాంత్ ని దాటేశాడా? కొన్ని నిజాలు తొందరగా ఒప్పుకోలేము!

ప్రస్తుతం అంతా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. బాహుబలితో పాన్ ఇండియా అనే పదం పరిచయం అయ్యింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా సినిమా అనేది బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు దాదాపుగా అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. కానీ, రజినీకాంత్ ఎప్పుడో పాన్ ఇండియానే కాదు.. పాన్ వరల్డ్ హీరో అనే విషయాన్ని అందరూ ఒప్పుకోవాలి. ఒక్క ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా రజినీకాంత్ కు అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన రేంజ్ ఎక్కడో ఉంది. ఇప్పుడు ఆ స్థాయికి విజయ్ చేరుకున్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సినిమాల పరంగానే కాదు.. వ్యక్తిగా కూడా రజినీకాంత్ కు కోట్లలో అభిమానులు ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్న హీరోల జాబితాలో రజినీకాంత్ పేరు ప్రముఖంగా ఉంటుంది. ఇన్నేళ్ల అనుభవం, చేసిన సినిమాలతో ఆయన స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. సినిమాల పరంగా ఆయన స్థాయిని టచ్ చేయడం చాలా కష్టం అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ, ఇప్పుడు ఆ స్థాయిని టచ్ చేసే హీరో విజయ్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి రజినీకాంత్ తరహాలో తమిళ్ లో కోట్ల మంది అభిమానులు సొంతం చేసుకున్న హీరోల్లో విజయ్ పేరు టాప్ లో ఉంటుంది. వ్యక్తిత్వం పరంగా కూడా విజయ్ ఎంతో సింపుల్ గా ఉంటాడు. రజినీకాంత్ తో విజయ్ ని పోల్చడం అనేది చాలా మంది రిసీవ్ చేసుకోకపోవచ్చు.

రజినీకాంత్ అనుభవం, తీసిన సినిమాలను దృష్టిలో ఉంచుకుంటే.. విజయ్ ఆయన స్థాయిని టచ్ చేయడం అసాధ్యమనే చెప్పాలి. కానీ, రీజనల్ లో విజయ్ కి చాలా మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. విజయ్ నుంచి వస్తున్న ప్రతి సినిమా అవలీలగా రూ.200 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేస్తోంది. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో విజయ్ సినిమాలకు చాలా మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఈ లెక్కలు చూసుకుంటే కోలీవుడ్ లో రజినీకాంత్ కు పోటి ఇచ్చే.. ఇస్తున్న హీరోలు ఎవరైనా ఉన్నారా? రజినీ స్థాయిని టచ్ చేసేవాళ్లు ఎవరైనా ఉంటారా? అని ప్రశ్నిస్తే.. అందుకు సమాధానంగా కచ్చితంగా విజయ్ పేరు మాత్రమే వినిపిస్తుంది. అభిమానుల విషయంలో కూడా విజయ్ కు కల్ట్ ఫ్యాన్ బేస్ బాగా పెరిగిపోయింది. ఇలా అన్ని కోణాల్లో ఆలోచిస్తే రీజనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకున్నా.. పాన్ ఇండియా సినిమాల విషయంలోనైనా రజినీకాంత్ స్థాయిని దళపతి విజయ్ టచ్ చేశాడు అనే చెప్పాలి.  మరి.. రజినీకాంత్ స్టార్డమ్ ని దళపతి విజయ్ టచ్ చేశాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.