iDreamPost
android-app
ios-app

‘టైగర్’, ‘కేసరి’తో భయపడనంటున్న ‘లియో’.. ఆ ధైర్యం వెనుక రీజన్!

  • Author singhj Published - 12:46 PM, Tue - 10 October 23
  • Author singhj Published - 12:46 PM, Tue - 10 October 23
‘టైగర్’, ‘కేసరి’తో భయపడనంటున్న ‘లియో’.. ఆ ధైర్యం వెనుక రీజన్!

టాలీవుడ్​కు సంక్రాంతి, సమ్మర్ తర్వాత అతి పెద్ద సీజన్ అంటే దసరా అనే చెప్పాలి. ఎక్కువ హాలీ డేస్ ఉండటంతో ఈ ఫెస్టివల్​ను టార్గెట్ చేసుకుంటూ రిలీజ్​కు చాలా మూవీస్ రెడీ అయిపోతాయి. ముఖ్యంగా పెద్ద హీరోలు తమ సినిమాలను దసరా పండుక్కి ప్లాన్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా దసరా పండుగ సందర్భంగా బాక్సాఫీస్ దగ్గర బిగ్ వార్ జరగబోతోంది. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోరిక తీరనుంది. దసరా పండుక్కి ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు తమ కొత్త చిత్రాలతో వచ్చేస్తున్నారు.

ఈసారి దసరాకు వస్తున్న సినిమాల్లో రెండు తెలుగు భాషవైతే.. ఒకటి తమిళ హీరో నటించిన మూవీ కావడం గమనార్హం. నటసింహం నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’, మాస్ మహారాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘దళపతి విజయ్ ‘లియో’ సినిమాలు దసరా పండక్కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ కూడా ఫెస్టివల్​కే వస్తున్నప్పటికీ అసలైన పోటీ మాత్రం పైమూడు సినిమాల మధ్యే ఉండనుంది. ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘లియో’ సినిమాల నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్స్​ ఆడియెన్స్​లో ఎక్స్​పెక్టేషన్స్​ మరింత పెంచేశాయి.

దసరా సినిమాల్లో ముందుగా అక్టోబర్ 19న విజయ్ ‘లియో’ రిలీజ్ కానుంది. ఆ తర్వాతి రోజు రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’తో పాటు బాలయ్య ‘భగవంత్ కేసరి’ విడుదల కానున్నాయి. తమిళంలో ‘లియో’పై చాలా హైప్, క్రేజ్ నెలకొన్నాయి. అక్కడ ఆ సినిమాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ తెలుగు నాట రవితేజ, బాలకృష్ణ మూవీస్​ను తట్టుకొని విజయ్ మూవీ రేసులో నిలబడగలదా అనే అనుమానాలు వస్తున్నాయి. ‘లియో’కి తెలుగులో బజ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘భగవంత్ కేసరి’ సినిమాలకు ఫుల్ పాజిటివ్ బజ్ ఏర్పడిన నేపథ్యంలో విజయ్ మూవీ ఎలా నెగ్గుకొస్తుందోననే డౌట్స్ వస్తున్నాయి.

తెలుగు నాట బడా స్టార్స్ మూవీస్ రేసులో ఉన్నా ‘లియో’ టీమ్ ఫుల్ కాన్ఫిడెంట్​గా ఉందని తెలుస్తోంది. రవితేజ, బాలయ్య సినిమాలతో తమకు ఎలాంటి భయం లేదన్నట్లుగా ఉంది. విజయ్ ధైర్యం వెనుక ఒక కారణం ఉందట. అదే మూవీకి జరిగిన బిజినెస్. ‘లియో’ సినిమాను తీయడానికైన ఖర్చు రూ.300 కోట్లు అని కోలీవుడ్ టాక్. ఈ ఫిల్మ్ దాదాపు రూ.500 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. దీంతో నిర్మాతలు ఇప్పటికే రూ.200 కోట్ల టేబుల్ ప్రాఫిట్స్​తో ఉన్నారని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. కాబట్టి తెలుగు నాట కలెక్షన్స్​ విషయంలో మూవీ మేకర్స్ భయపడట్లేదని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు.

ఇదీ చదవండి: ‘ఏజెంట్’ ఫ్లాపైనా సురేందర్ రెడ్డికి ఛాన్స్! కావాలనే డేర్ చేస్తున్నారా?

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)