iDreamPost
android-app
ios-app

విజయ్ ఆఖరి మూవీకి హయ్యెస్ట్ రెమ్యూనరేషన్! ఇండియాలోనే టాప్?

  • Published Feb 06, 2024 | 6:58 PM Updated Updated Feb 06, 2024 | 6:58 PM

Crazy Update On Thalapathy 69: దళపతి విజయ్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆఖరి చిత్రంపై కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Crazy Update On Thalapathy 69: దళపతి విజయ్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆఖరి చిత్రంపై కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

  • Published Feb 06, 2024 | 6:58 PMUpdated Feb 06, 2024 | 6:58 PM
విజయ్ ఆఖరి మూవీకి హయ్యెస్ట్ రెమ్యూనరేషన్! ఇండియాలోనే టాప్?

తమిళ్ స్టార్ హీరో విజయ్ తన సినిమా కెరీర్ ని ముగించబోతున్నారు అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తన పొలిటికల్ ఎంట్రీపై ఓ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇప్పటివరకు ‘విజయ్ పీపుల్స్ మూవ్మెంట్’ అనే స్వంచ్ఛంద సంస్థ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తాను ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. “తమిళగ వెట్రి కజగం” పేరిట పార్టీని కూడా ప్రకటించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణల్లో పూర్తి మార్పు తీసుకొస్తానంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే విజయ్ తన సినిమా కెరీర్ ని ముంగిచబోతున్నారు అనే వార్తలు జోరందుకున్నాయి. ఇప్పుడు తన కెరీర్ లో చివరి సినిమాని కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

తమిళ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై అతని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కానీ, సినిమాలకు దూరం కాబోతున్నారు అనే విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ, ఆయన సమాజంలో మార్పు తీసుకొస్తారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయ్ తన కెరీర్ లో చివరి సినిమాకి సైన్ చేశాడు అంటూ గట్టిగానే వార్తలు వస్తున్నాయి. ఆ మూవీకి నిర్మించబోతోంది.. తెలుగు నిర్మాతేనని చెప్పడంతో టాలీవుడ్ లో కూడా విజయ్ లాస్ట్ సినిమాపై గట్టిగానే బజ్ ఏర్పడింది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థకు ఒక సినిమా చేస్తానంటూ గతంలో విజయ్ మాటిచ్చాడట. తన కెరీర్లో చివరి సినిమాని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బేనర్ మీదే చేయబోతున్నాడు అంటున్నారు.

ఇప్పటికే విజయ్ తన కెరీర్ లో 68వ చిత్రానికి “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్” అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇప్పుడు 69వ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు అంటున్నారు. నిజానికి 70 చిత్రాలు చేసి తన సినిమా కెరీర్ ని ముగిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, 69వ చిత్రమే తన కెరీర్లో ఆఖరి చిత్రం అవుతుందని చెబుతున్నారు. ఆ మూవీకి డైరెక్టర్ ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ ‘వేట్రి మారన్’ దర్శకత్వంలో ఈ మూవీ ఉండబోతోందని సమాచారం. ఈ సినిమా కంప్లీట్ గా పొలిటికల్ ఎలిమెంట్స్ తో సోషల్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తోంది. పైగా ఈ మూవీకి దళపతి విజయ్ ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు చెబుతున్నారు. తన ఆఖరి చిత్రానికి విజయ్ ఏకంగా రూ.140 కోట్లు పారితోషకంగా తీసుకోబోతున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అంటే బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా దక్కని రేంజ్ లో విజయ్ కి ఆఖరి సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అదే నిజమైతే.. ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోగా విజయ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్లు అవుతుంది. విజయ్ ఆ స్థాయి మార్కెట్ కూడా ఉందనే చెప్పాలి. దళపతి విజయ్ సినిమాలు కేవలం తమిళ్ మార్కెట్ లోనే రూ.250 నుంచి రూ.300 కోట్లు కలెక్ట్ చేస్తుంటాయి. అలాంటిది సరైన స్టోరీతో వస్తే పాన్ ఇండియా లెవల్లో దుమ్మురేపుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి.. విజయ్ తన కెరీర్ లో ఆఖరి సినిమాకి హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet