GOAT Movie: విజయ్ మూవీతో మైత్రీ మేకర్స్ రిస్క్.. కాస్త తేడా వచ్చినా మొదటికే మోసం!

Thalapathy Vijay: దళపతి విజయ్​కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సినిమాలన్నీ ఏకకాలంలో ఇక్కడ కూడా విడుదలవడం చూస్తున్నాం.

Thalapathy Vijay: దళపతి విజయ్​కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సినిమాలన్నీ ఏకకాలంలో ఇక్కడ కూడా విడుదలవడం చూస్తున్నాం.

దళపతి విజయ్​కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సినిమాలన్నీ ఏకకాలంలో ఇక్కడ కూడా విడుదలవడం చూస్తున్నాం. ‘స్నేహితుడు’, ‘తుపాకీ’, ‘సర్కార్’, ‘అదిరింది’, ‘వారసుడు’, ‘మాస్టర్’, ‘లియో’ చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకుల మనసుల్లో ఆయన చోటు దక్కించుకున్నారు. విజయ్ హుషారైన నటనకు ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. దళపతి నుంచి మూవీ వస్తోందంటే ఇక్కడి ఆడియెన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. చివరగా ‘లియో’తో ప్రేక్షకుల్ని పలకరించిన విజయ్.. నెక్స్ట్ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్)’ మూవీతో అందరి ముందుకు రానున్నారు. ఈ ఫిల్మ్ రిలీజ్ డేట్ కూడా లాక్ అయింది. ​

విజయ్ ‘గోట్’ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన ఒకేసారి తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్​కు ఆడియెన్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. దీంతో అసలు తెలుగులో ‘గోట్​’కు ఎంత థియేట్రికల్ బిజినెస్ జరిగిందో తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విజయ్ లేటెస్ట్ ఫిల్మ్​కు బిజినెస్ గట్టిగానే జరిగిందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ‘గోట్’ థియేట్రికల్ రైట్స్​ను దక్కించుకుంది. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. అయితే విజయ్ మూవీ రైట్స్ కోసం ఏకంగా రూ.30 కోట్లు చెల్లించారని టాలీవుడ్​ సర్కిల్స్​లో వినిపిస్తోంది.

విజయ్ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ఫిల్మ్స్ టాక్​తో సంబంధం లేకుండా ఇక్కడ వసూళ్లు సాధించడం విశేషం. అయితే ఆయన మార్కెట్​కు మించి మైత్రీ మూవీ మేకర్స్ రిస్క్ చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విజయ్ గత చిత్రం ‘లియో’ తప్పితే మిగతా సినిమాలు ఇక్కడ భారీగా కలెక్ట్ చేసిన దాఖలాలు లేవని బాక్సాఫీస్ ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. ఇక్కడ ఆయన మూవీస్​కు రూ.10 నుంచి రూ.15 కోట్ల మార్కెట్ ఉందని.. అలాంటప్పుడు రూ.30 కోట్లు పెట్టి రైట్స్ తీసుకోవడం అంటే రిస్క్ అంటున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ‘లియో’ తెలుగు వెర్షన్ రూ.25 కోట్ల వరకు కలెక్ట్ చేసినా.. అందులో ఎక్కువ క్రెడిట్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్​కు వెళ్లిపోయింది. లోకేశ్​ మూవీస్​కు, లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్​కు ఉన్న క్రేజ్ వల్లే ‘లియో’కు భారీ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. మరి.. ‘గోట్’తో తెలుగులోనూ విజయ్ వసూళ్ల పంట పండిస్తాడని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

Show comments