iDreamPost
android-app
ios-app

Thangalaan Trailer: విక్రమ్ నట విశ్వరూపం! తంగలాన్ ట్రైలర్.. గూస్ బంప్స్ పక్కా!

  • Published Jul 10, 2024 | 5:49 PM Updated Updated Jul 10, 2024 | 5:49 PM

'తంగలాన్' అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు చియాన్ విక్రమ్. తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేయగా.. మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు విక్రమ్.

'తంగలాన్' అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు చియాన్ విక్రమ్. తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేయగా.. మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు విక్రమ్.

  • Published Jul 10, 2024 | 5:49 PMUpdated Jul 10, 2024 | 5:49 PM
Thangalaan Trailer: విక్రమ్ నట విశ్వరూపం! తంగలాన్ ట్రైలర్.. గూస్ బంప్స్ పక్కా!

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. కెరీర్ ప్రారంభం నుంచే విక్రమ్ విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించేవాడు. శివపుత్రుడు, అపరిచితుడు లాంటి కల్ట్ క్లాసికల్ మూవీలతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి ‘తంగలాన్’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేయగా.. మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు విక్రమ్. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

‘తంగలాన్’ విక్రమ్, స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఆగస్ట్ 15న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ పా. రంజిత్. ఫస్ట్ లుక్, టీజర్ తోనే ఫిదా చేసిన విక్రమ్.. ట్రైలర్ తో గూస్ బంప్స్ తెప్పించాడు. బంగారం గనుల కోసం జరిగే అన్వేషణలో ఓ దొరకు, హీరో తెగకు మధ్య జరిగే పోరాటమే ఈ తంగలాన్ మూవీ స్టోరీగా అర్ధమవుతోంది.

ఈ ట్రైలర్ లో విక్రమ్ చేసిన పోరాటలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. పా. రంజిత్ ఈ మూవీతో ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జీవీ ప్రకాశ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. దాదాపు రూ. 100 నుంచి 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఈ మూవీ.. చివరికి విడుదలకు సిద్ధమైంది. ట్రైలర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచిన విక్రమ్.. విడుదల అయ్యాక ఏ రేంజ్ లో కలెక్షన్లను రాబడతాడో చూడాలి. మరి తంగలాన్ ట్రైలర్ లో విక్రమ్ నట విశ్వరూపంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio