iDreamPost
android-app
ios-app

‘దళపతి 68’ క్రేజీ అప్డేట్! వైరల్ గా మారిన డైరెక్టర్ పోస్ట్!

  • Author ajaykrishna Updated - 01:34 PM, Fri - 1 September 23
  • Author ajaykrishna Updated - 01:34 PM, Fri - 1 September 23
‘దళపతి 68’ క్రేజీ అప్డేట్! వైరల్ గా మారిన డైరెక్టర్ పోస్ట్!

దళపతి విజయ్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ‘లియో’ పూర్తి చేసి తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. మాస్టర్ మూవీ తర్వాత లోకేష్ కనగరాజ్ తో విజయ్ చేసిన మూవీ లియో. ఖైదీ, విక్రమ్ సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్.. ఇప్పటికే కార్తీ, కమల్ హాసన్, సూర్య, విజయ్ సేతుపతిలను తన యూనివర్స్ లో భాగం చేశాడు. ఇప్పుడు లియోతో దళపతి విజయ్ ని.. అలాగే సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, త్రిషలని కూడా భాగం చేస్తున్నాడు. దీంతో ఇప్పుడు లియోపై పాన్ ఇండియా వైడ్ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక లియో మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లియో తర్వాత విజయ్.. దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అది విజయ్ కెరీర్ లో 68వ మూవీ కాబోతుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న వెంకట్ ప్రభు సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అసలు వీరి కాంబినేషన్ లో ఎలాంటి మూవీ రాబోతుంది? అని ఫ్యాన్స్ అంతా అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో దర్శకుడు వెంకట్ ప్రభు.. సోషల్ మీడియా వేదికగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. తమ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని రెండు ఫోటోలు పోస్ట్ చేసి సర్ప్రైజ్ చేశాడు.

దళపతి 68 కోసం.. విజయ్, వెంకట్ ప్రభు టీమ్ లాస్ ఏంజెల్స్ చేరుకుంది. ప్రస్తుతం విజయ్ క్యారెక్టర్ కి సంబంధించి లుక్ టెస్ట్ జరుగుతోందట. కాగా.. డైరెక్టర్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనుందని అంటున్నారు. ఎందుకంటే.. దర్శకుడు భవిష్యత్ కి స్వాగతం.. అని పోస్ట్ లో రాసుకొచ్చాడు. పైగా ఫోటోలలో విజయ్ ని కూడా చూపించాడు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ పోషించనున్నాడని టాక్ నడుస్తోంది. విజయ్ కి జంటగా జ్యోతిక కనిపించనుందట. ఇక సినిమాని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్మిస్తుండగా.. యువన్ శంకర్ రాజా మూవీకి సంగీతం అందిస్తున్నాడు. మరి దళపతి 68 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet