iDreamPost
android-app
ios-app

ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు అరెస్ట్‌!

  • Published Dec 02, 2023 | 8:57 AM Updated Updated Dec 02, 2023 | 8:57 AM

ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బు కోసం ఎన్నో రకాల తప్పుడు పనులు చేస్తున్నారు. ఎదుటి వారిని బురిడీ కొట్టించి కోట్లు దండుకుంటున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు కేటుగాళ్ళ ఉచ్చులో పడిపోయి డబ్బు పోగొట్టుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బు కోసం ఎన్నో రకాల తప్పుడు పనులు చేస్తున్నారు. ఎదుటి వారిని బురిడీ కొట్టించి కోట్లు దండుకుంటున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు కేటుగాళ్ళ ఉచ్చులో పడిపోయి డబ్బు పోగొట్టుకుంటున్నారు.

ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు అరెస్ట్‌!

డబ్బు మనిషిని ఏ పనైనా చేయిస్తుందని అంటారు. నేటి సమాజంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు డబ్బు సంపాదన కోసం ఎన్నోరకాలుగా కష్టపడుతుంటారు. కొంతమంది ఈజీ మనీ కోసం అక్రమాలకు పాల్పపడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతుంటారు. నేరం చేసిన వాళ్లు చట్టం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరు. సినీ రంగానికి చెందిన కొంతమంది వ్యాపార రంగంలోకి దిగి డబ్బు సంపాదిస్తున్నారు. ఇటీవల కాలంలో అధిక వడ్డీ ఆశ చూపించి కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ళు ఎక్కువ అయ్యారు. పెట్టిన పెట్టుబడికి తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ రూపంలో వస్తుందంటే ఎవరికైనా ఆశ.. అదే ఆశను కొంతమంది క్యాష్ చేసుకుంటూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

అధిక వడ్డీ ఆశ చూపించి వందలాది మందిని మోసం చేసిన కేసులో ప్రముఖ నిర్మాతని పోలీసులు అరెస్ట్ చేశారు. నీదీ నాది ఒకే కథ, గర్ల్ ఫ్రెండు లాంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన అట్లూరి నారాయణరావు‌ని ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ దందా కేసులో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో ఆయనను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి, హైదరాబాద్ నాంపల్లి కోర్టులు హాజరు పరిచారు. నారాయణరావుపై గతంలో చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్, డీలర్ షిప్ పేరతో దాదాపు వందల మందిని మోసం చేసి రూ.530 కోట్లు వసూళ్లు చేశారని ఆభియోగం ఆయనపై ఉంది. ఈ కేసులో ప్రధాన సూత్రదారి గూదే రాంబాబు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కృష్ణం రాజును గత నెలలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.

తక్కవ సమయంలో పెట్టిన పెట్టుబడికి ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశ చూపించి ఇండస్ట్రీకి చెందినవారిని, పలు వ్యాపారులను మోసం చేసి కోట్లు వసూళ్లు చేసి తర్వాత బోర్డు తిప్పేయడంతో బాధితులు తీవ్ర మనస్థాపానికి గురై కేసు పెట్టారు. బాధితులు రాంబాబు ని ఒత్తిడి చేయగా.. ఓ చార్టెట్ అకౌంట్ ద్వారా నిర్మాత నారాయణరావును కలవగా, కేసు లేకుండా చేస్తాను.. అందుకోసం ఖర్చు అవుతుందని చెప్పి రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు. బేరసారాలు చేసి డీల్ రూ.2 కోట్లకు కుదుర్చుకొని పది లక్షలు అడ్వాన్స్, కోటి విలువైన గోల్డ్ ఆభరణాలు తీసుకున్నాడు. ఆభరణాలను పాతబస్తీలో కరిగించి రూ.90 లక్షలకు అమ్మేశాడు. ఈ క్రమంలోనే ఆయనను ఏపీలో అరెస్ట్ చేశారు. కాగా, నారాయణరావును అదనపు విచారణ కోసం పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా నాంపల్లి కోర్టుకు పోలీసులు పిటీషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. డబ్బు కోసం వెంపర్లాడే ఇలాంటి వారి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.