Krishna Kowshik
ఒకప్పుడు తన అందం, అభినయంతో ఆకట్టుకున్న నటి మాధవి గుర్తుందా..? కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని న్యూజెర్సీలో సెటిల్ అయ్యింది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు.. వీళ్లెలా ఉన్నారంటే..?
ఒకప్పుడు తన అందం, అభినయంతో ఆకట్టుకున్న నటి మాధవి గుర్తుందా..? కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని న్యూజెర్సీలో సెటిల్ అయ్యింది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు.. వీళ్లెలా ఉన్నారంటే..?
Krishna Kowshik
ఒకప్పుడు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న అతికొద్ది మంది నటీమణుల్లో ఒకరు మాధవి. పదాహరణాల తెలుగు అమ్మాయైన మాధవి.. కేవలం టాలీవుడ్ మాత్రమే బాలీవుడ్ టూ మాలీవుడ్ వరకు తన హవా కొనసాగించింది. ఎక్కువగా పొగరుబోతు క్యారెక్టర్లతో నటించి మెప్పించిన ఆమె.. మాతృదేవో భవ మూవీతో ప్రతి ఒక్కరినీ ఏడిపించింది. అన్ని ఇండస్ట్రీల్లోని స్టార్ హీరోలతో నటించింది. అప్పట్లో ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. బిజినెస్‌మెన్ రాల్ఫ్ శర్మని 1996లో పెళ్లి చేసుకుని.. భర్తతో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడింది. పెళ్లి తర్వాత ఆమె నటించలేదు. ప్రస్తుతం ఆమె బిజినెస్ రంగంలో రాణిస్తుంది. అప్పట్లో హీరోలకు ధీటుగా నటించిన ఆమె ఇప్పుడెలా ఉంది అన్న క్యూరియాసిటీ చాలా మందిలో ఉంటుంది.
అయితే సోషల్ మీడియా పుణ్యమా అని.. మాధవి వివరాలు తెలుస్తుంటాయి. ప్రస్తుతం ఆమె బిజినెస్ రంగంలో స్థిరపడింది. ఈ మధ్య కాలంలో ఇన్ స్టాగ్రాంలో యాక్టివ్ అయిన ఈ స్టార్ నటీమణీ.. సినిమాలతో పాటు ఫ్యామిలీ ఫోటోస్ పంచుకుంటూ ఉంటుంది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. మాధవికి ముత్యాల్లాంటి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా అమ్మను మించిపోయిన అందంతో మెస్మరైజ్ చేస్తుంటారు. పెద్ద కూతురు పేరు టిఫనీ, రెండో కూతురు ప్రిసిల్లా, ఇక మూడో కూతురు పేరు ఎవలిన్. ఈ ముగ్గురు ప్రస్తుతం టీనేజ్‌కు వచ్చేశారు. పిల్లల్ని కూడా తనలా భరత నాట్యంలో వంటి వాటిల్లో ప్రావీణ్యురాలిని చేసింది మాధవి. ప్రస్తుతం కూతుళ్లు కూడా చదువుతో పాటు వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు.
ఇక మాధవి వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో శశిరేఖ, గోవిందస్వామి దంపతులకు పుట్టింది. ఆమె అసలు పేరు కనక విజయ లక్ష్మీ. చిన్నప్పటినుంచే భరతనాట్యం పట్ల ఆసక్తి ఉండడంతో అందులో శిక్షణ ఇప్పించారు ఆమె తల్లి. ఆ తర్వాత వీరి కుటుంబం హైదరాబాద్ షిప్ట్ అయ్యింది. ఆమె విద్యాబ్యాసం హైదరాబాద్ అబిడ్స్‌లోని స్టాన్లీ బాలికల పాఠశాలలో సాగింది. రవీంద్రభారతిలో స్టేజ్ ఫెర్మామెన్స్ చూసిన దాసరి నారాయణరావు.. తాను తీస్తున్న‘తూర్పు పడమర’ చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. అలా 13 ఏళ్లకే హీరోయిన్ అయిపోయింది. ఆమె పేరును మాధవిగా మార్చింది దాసరిగారే. చిరంజీవితో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో మొదలుకుని బిగ్ బాస్ వరకు అరడజనకు పైగా చిత్రాల్లో నటించింది. అప్పట్లో బెస్ట్ స్క్రీన్ పెయిర్. బిగ్ బాస్ తర్వాత పెళ్లి చేసుకుని పూర్తిగా నటనకు దూరమైంది.