iDreamPost
android-app
ios-app

రాజమౌళికి 100 ఏనుగుల బలం ఇచ్చిన అంబానీ ఇంట పెళ్లి! కారణం?

  • Published Jul 13, 2024 | 5:31 PM Updated Updated Jul 13, 2024 | 5:31 PM

అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ పెళ్లితో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి 100 ఏనుగుల బలం వచ్చింది. అదేంటి? ఆ పెళ్లికి, జక్కన్నకు సంబంధం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ పెళ్లితో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి 100 ఏనుగుల బలం వచ్చింది. అదేంటి? ఆ పెళ్లికి, జక్కన్నకు సంబంధం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jul 13, 2024 | 5:31 PMUpdated Jul 13, 2024 | 5:31 PM
రాజమౌళికి 100 ఏనుగుల బలం ఇచ్చిన అంబానీ ఇంట పెళ్లి! కారణం?

అంబానీ ఇంట పెళ్లి గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఆ రేంజ్ లో అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న నటులతో పాటుగా గ్లోబల్ స్టార్స్ కూడా అటెండ్ అయ్యారు. ఎవరికి వారే స్పెషల్ అట్రాక్షన్ గా నిలవాలని రెడీ అయ్యి వచ్చారు. కానీ అందరి అటెన్షన్ ను మాత్రం డ్రా చేసింది టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేశ్ బాబు అనే చెప్పాలి. బ్లాక్ కలర్ డ్రెస్ లో నవాబులా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ పెళ్లితో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి 100 ఏనుగుల బలం వచ్చింది. అంబానీ ఇంట్లో పెళ్లి అయితే.. జక్కన్నకు వంద ఏనుగుల బలం రావడం ఏంటి? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకుందాం పదండి.

ప్రపంచ బిలియనీర్ అంబానీ ఇంట పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్నిరంగాల అతిరథమహారథులు హాజరైయ్యారు. సినిమా ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోలు, హీరోయిన్లు, రాజకీయ ప్రముఖులతో పాటుగా బిజినెస్ దిగ్గజాలు కూడా వచ్చారు. వీరే కాకుండా.. పలువురు గ్లోబల్ స్టార్స్ ఈ వేడుకలో సందడి చేశారు. అయితే ఈ పెళ్లికి ఎంతమంది సెలబ్రిటీలు వచ్చినా.. ఒక్క హీరోని మాత్రం డామినేట్ చేయలేకపోయారు. అతడే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. అనంత్-రాధిక పెళ్లికి ఫ్యామిలీతో పాటుగా హాజరైయ్యాడు ప్రిన్స్.

అంబానీ ఇంట వివాహానికి బ్లాక్ కలర్ డ్రెస్ లో లాంగ్ హెయిర్ లో అచ్చం హాలీవుడ్ హీరోలా దర్శనమిచ్చాడు మహేశ్. దాంతో అందరి దృష్టి ఇతడిపైనే పడింది. ఇప్పుడితే రాజమౌళికి 100 ఏనుగుల బలం ఇవ్వడమే కాక.. పలు ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది. అసలు విషయం ఏంటంటే? మహేశ్ బాబు-జక్కన్న కాంబోలో అడ్వెంచరల్ యాక్షన్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి జక్కన్న అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలో ఓ ప్రశ్న రాజమౌళిని కలవరపెట్టింది. అదేంటంటే? ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయని మహేశ్ బాబుతో ఇంత పెద్ద మూవీ తీస్తే రీచ్ అవుతుందా? ఈ ప్రశ్నకు తాజాగా అంబానీ ఇంట పెళ్లితో సమాధానం దొరికింది. అనంత్ అంబానీ పెళ్లిలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు మహేశ్. లాంగ్ హెయిర్ తో లుక్స్ కేకపెట్టించాడు. దాంతో అందరి అటెన్షన్ ను తనపైకి తిప్పుకున్నాడు. పెళ్లికి హాజరైన గ్లోబల్ సెలబ్రిటీలను వెనక్కినెట్టి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇప్పుడు ఇదే రాజమౌళికి బిగ్ బూస్ట్.

రాజమౌళికి, అభిమానులకు ఉన్న అనుమానాలు అన్నీ ఈ పెళ్లితో తీరిపోయాయి. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కే ఈ మూవీకి మహేశ్ ఫేస్ చాలా కీలకం. ఈ వేడుకతో ఆ సమస్యకూడా తీరిపోయింది. దాంతో జక్కన్న హ్యాపీగా SSMB 29ను ఇంకా అద్భుతంగా రూపొందించే పనిలో పడ్డాడు. మహేశ్ స్టామినా.. జక్కన్న టేకింగ్ కలిస్తే.. పాన్ ఇండియా ఏం కర్మ, పాన్ వరల్డ్ రికార్డులనే బద్దలు కొట్టొచ్చు అంటున్నారు ఫ్యాన్స్. మరి అంబానీ ఇంట పెళ్లితో వచ్చిన 100 ఏనుగుల బలంతో జక్కన్న ఏ రేంజ్ లో సినిమాను తెరకెక్కిస్తాడో వేచి చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş