iDreamPost
android-app
ios-app

టేస్టీ తేజాకి హార్ట్ అటాక్.. అసలు ఏం జరిగిందంటే?

  • Published Jan 29, 2024 | 3:20 PM Updated Updated Jan 29, 2024 | 3:43 PM

Heart Attack For Tasty Teja: టేస్టీ తేజా బిగ్ బాస్ తర్వాత మరింత పాపులర్ అయ్యాడు. అయితే తేజాకి హార్ట్ అటాక్ అంటూ వార్త ఒకటి వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే?

Heart Attack For Tasty Teja: టేస్టీ తేజా బిగ్ బాస్ తర్వాత మరింత పాపులర్ అయ్యాడు. అయితే తేజాకి హార్ట్ అటాక్ అంటూ వార్త ఒకటి వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే?

  • Published Jan 29, 2024 | 3:20 PMUpdated Jan 29, 2024 | 3:43 PM
టేస్టీ తేజాకి హార్ట్ అటాక్.. అసలు ఏం జరిగిందంటే?

టేస్టీ తేజా గురించి బుల్లితెర, యూట్యూబ్ వ్యూవర్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫుడ్ వీడియోలతో తేజా కాస్తా టేస్టీ తేజాగా పాపులర్ అయిపోయాడు. ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి వెళ్లొచ్చిన తర్వాత తేజా పాపులారిటీ మరింత పెరిగిపోయింది. మనోడు ఏ వీడియో పెట్టినా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అయితే తాజాగా తేజాకి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. తేజాకి హార్ట్ అటాక్ వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రియాంక జైన్, శివకుమార్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. అయితే అసలు ఏం జరిగిందో చూద్దాం.

ప్రియాంక జైన్- శివకుమార్ లను కలిసేందుకు టేస్టీ తేజా వారి ఇంటికి వెళ్లాడు. ముందుగా ప్రియాంకతో కాసేపు మాట్లాడి ఆ తర్వాత ప్రియాంకకు వంటలో హెల్ప్ చేస్తానని చెప్తాడు. రాగానే శివకుమార్ తేజాకి స్పెషల్ కర్బూజా జ్యూస్ తాగిస్తాడు. అది తాగిన తర్వాత తనకు ఏదో అనీజీగా ఉందని తేజా చెప్తాడు. అయినా వీళ్లు వంటగదిలో పనులు ప్రారంభిస్తారు. క్యారెట్లు కోస్తున్న సమయంలో తేజా తనకు బాలేదు అంటూ.. గుండె పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలతాడు. తనకి హార్ట్ అటాక్ వచ్చింది అంటూ చెప్తాడు. ప్రియాంక జైన్ ఎంతో కంగారు పడి పోతుంది. కానీ, శివకుమార్ మాత్రం ఎంతో రిలాక్స్డ్ గా ఉంటాడు. ఎందుకంటే టేస్టీ తేజాకి నిజంగానే హార్ట్ అటాక్ రాలేదు. ప్రియాంకను భయపెట్టేందుకు శివకుమార్ ఇలా తేజాతో కలిసి ప్రాంక్ ప్లాన్ చేశాడు.

ఆ విషయాన్ని వీడియో స్టార్టింగ్ లోనే చెప్తారు. కానీ, ప్రియాంక మాత్రం ఎంతో కంగారు పడిపోతుంది. పైగా అంబులెన్స్ కు కాల్ చేయడానికి లేకుండా శివకుమార్ ఫోన్లు కూడా దాచిపెడతాడు. దాంతో ప్రియాంకకు ఏం చేయాలో అర్థంకాక విలవిల్లాడిపోతూ ఉంటుంది. చివరికి ఆమె టెన్షన్ చూసి ఇదంతా ప్రాంక్ అంటూ శివకుమార్ కు తెలియకుండా టేస్టీ తేజా చెప్పేస్తాడు. ఆ తర్వాత ప్రియాంక కాస్త కూల్ అవుతుంది. రివర్స్ లో శివకుమార్ ను కొట్టడం స్టార్ట్ చేస్తుంది. మొత్తానికి శివకుమార్ అనుకున్నది సాధించాడు. గతంలో ప్రియాంక కూడా శివకుమార్ పై ఇలాంటి ప్రాంకులు చాలానే చేసింది. అయితే అవి వాళ్ల ఇద్దరి మధ్యే ఉండేవి. ఇప్పుడు తేజాని తీసుకొచ్చి హెల్త్ పాడైంది అనగానే ఆమె కంగారు పడింది.

వీడియో స్టార్టింగ్ లోనే ఇదంతా ప్రాంక్ అని చెప్పారు. ఎవరూ తప్పుగా తీసుకోవద్దు. సరదా కోసం మాత్రమే చేస్తున్నాం అంటూ డిస్ క్లైమర్ కూడా ఇచ్చారు. కానీ, ఇక్కడ విషయం ఏంటంటే.. వీళ్లు ప్రస్తుతం సొసైటీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. అంటే వీళ్లకు ఎంత లేదన్నా సమాజం పట్ల కాస్త కాకపోయినా కాస్తయినా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వీళ్లు వ్యూస్, రివేంజులు అంటూ ఇలాంటి ప్రాంకులు చేస్తూ ఎవరిని ఉద్దరించాలి అనేది అర్థం కావడం లేదు. శివకుమార్ పిలిచాడు అని.. టేస్టీ తేజా కూడా అదే పనిగా వెళ్లి ప్రాంకు చేసి వచ్చాడు. ఇది చూడటానికి కాసేపు సరదాగా అనిపించినా కూడా ఈసారి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చి రోడ్డు మీద పడిపోయినా కూడా.. తేజా ప్రాంక్ చేస్తున్నాడులే అనుకుని వెళ్లిపోయే పరిస్థితి కచ్చితంగా ఉంటుంది. ఆ విషయాన్ని స్వయంగా తేజా కూడా ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. మరి.. ప్రియాంక జైన్ ను భయపెట్టడానికి శివకుమార్, టేస్టీ తేజా చేసిన హార్ట్ అటాక్ ప్రాంక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet