iDreamPost
android-app
ios-app

పవన్‌-Jr NTR రేంజ్‌ ఒకటే.. బాబుకు ఆ కర్మ ఎందుకు: తమ్మారెడ్డి

పవన్‌-Jr NTR రేంజ్‌ ఒకటే.. బాబుకు ఆ కర్మ ఎందుకు: తమ్మారెడ్డి

జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఇంట్లో పెట్టుకుని పవన్‌ చుట్టూ తిరిగాల్సిన కర్మ చంద్రబాబు నాయుడికి ఎందుకని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అసలు జూనియర్‌ ఎన్టీఆర్‌ను తెలుగు దేశం పార్టీలోంచి వెళ్లగొట్టింది చంద్రబాబేనని ఆయన అన్నారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎప్పుడూ ఫ్యామిలీ సభ్యుడిగా చూల్లేదన్నారు. తాజాగా, ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్‌ని నందమూరి, నారా ఫ్యామిలీలు తమ కుటుంబం అనుకోలేదు. ఎన్టీఆర్ ఎప్పుడూ వేరుగానే ఉన్నాడు.

అతడికి క్రేజ్‌ వచ్చిన తర్వాత వీళ్లంతా వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీకోసం ప్రాణం పెట్టిన మనిషి. అలాంటి వ్యక్తిని కాదని 2014లో పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లారు. రెండు గంటలు వెయిట్ చేసి మరీ పవన్ కళ్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా.. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. పవన్ కోసం వెళ్లి ఎదురు చూడాల్సిన కర్మ ఎందుకొచ్చింది? పవన్‌, ఎన్టీఆర్‌ రేంజ్‌ ఒకటే.. అలాంటప్పుడు ఎన్టీఆర్‌ని వదిలిపెట్టి.. ఈ కర్మ ఎందుకు? ‘నువ్వు రావాల్సిన అవసరం లేదు..

మాకు పవన్ ఉన్నారు’ అని అన్నపుడు ఎన్టీఆర్ ఎందుకు వస్తారు? పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లారంటే.. ఎన్టీఆర్‌ని వదులుకున్నట్టే కదా. పార్టీ కోసం ప్రచారం చేయమని ఎన్టీఆర్ ఇంటికెళ్లి చంద్రబాబు అడగలేదు. మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఎన్టీఆర్ రాలేదని అంటారు’’ అంటూ మండిపాటు వ్యక్తం చేశారు. కాగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ మౌనంపై బాలయ్య తాజాగా స్పందించారు. ‘ఐ డోంట్‌ కేర్‌ బ్రో’ అంటూ కామెంట్‌ చేశారు. మరి, జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం వ్యక్తం చేయటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.