iDreamPost
android-app
ios-app

మంచానికే పరిమితమైన హిట్ డైరెక్టర్ భార్య.. ఆస్తులన్నీ అమ్ముకున్నామంటూ..!

  • Author Soma Sekhar Published - 05:03 PM, Fri - 27 October 23

తెలుగులో సూపర్ హిట్స్ గా నిలిచిన చెప్పవే చిరుగాలి, వసంతం వంటి సినిమాలకు డైరెక్టర్ గా పనిచేశాడు విక్రమన్. కానీ గత దశాబ్ద కాలంగా వెండితెరకు దూరంగా ఉన్నాడు. ఆయన ఇండస్ట్రీకి దూరమవ్వడం వెనక ఓ విషాదగాథ దాగుందని చాలా మందికి తెలియదు.

తెలుగులో సూపర్ హిట్స్ గా నిలిచిన చెప్పవే చిరుగాలి, వసంతం వంటి సినిమాలకు డైరెక్టర్ గా పనిచేశాడు విక్రమన్. కానీ గత దశాబ్ద కాలంగా వెండితెరకు దూరంగా ఉన్నాడు. ఆయన ఇండస్ట్రీకి దూరమవ్వడం వెనక ఓ విషాదగాథ దాగుందని చాలా మందికి తెలియదు.

  • Author Soma Sekhar Published - 05:03 PM, Fri - 27 October 23
మంచానికే పరిమితమైన హిట్ డైరెక్టర్ భార్య.. ఆస్తులన్నీ అమ్ముకున్నామంటూ..!

ఆయనో స్టార్ డైరెక్టర్.. తమిళంలో సూర్యవంశం తో పాటుగా తెలుగులో సూపర్ హిట్స్ గా నిలిచిన చెప్పవే చిరుగాలి, వసంతం వంటి సినిమాలకు డైరెక్టర్ గా పనిచేశాడు విక్రమన్. కానీ గత దశాబ్ద కాలంగా వెండితెరకు దూరంగా ఉన్నాడు. ఆయన ఇండస్ట్రీకి దూరమవ్వడం వెనక ఓ విషాదగాథ దాగుందని చాలా మందికి తెలియకపోవచ్చు. విక్రమన్ భార్య జయప్రియ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం గురించి, తాము అనుభవిస్తున్న బాధల గురించి చెప్పుకొస్తూ.. ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను మంచానికే పరిమితం అయ్యానని, అడుగుతీసి అడుగు కూడా వేయలేకపోతున్నాను అంటూ తన బాధలు చెప్పుకొచ్చింది. ఈ కారణంగానే విక్రమన్ సినిమాలకు దూరమయ్యాడని తెలుస్తోంది.

చెప్పవే చిరుగాలి, వసంతం టాలీవుడ్ లో ఈ సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ ఈ సినిమాలోని డైలాగ్స్ ప్రేక్షకుల నోటి నుంచి వినిపిస్తూనే ఉంటాయి. ఈ చిత్రాలను డైరెక్టర్ విక్రమన్ తెరకెక్కించాడు. తమిళంలో కూడా సూర్యవంశం లాంటి మూవీని తీసి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇలాంటి డైరెక్టర్ నుంచి సినిమా వచ్చి దాదాపు 10 సంవత్సరాలు కావొస్తుంది. ఒక దశాబ్ద కాలంగా విక్రమన్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దానికి కారణం ఆయన జీవితంలో నెలకొన్న విషాదమే. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఆయన భార్య జయప్రియ.

ఆమె మాట్లాడుతూ..”నేను వెన్నునొప్పితో ఆస్పత్రికి వెళ్లాను. వారు నా పరిస్థితి చూసి సిటీ స్కాన్ చేసి.. ఇది క్యాన్సర్ లా ఉందని, ఆపరేషన్ చేసి బయాప్సీ చేయాలన్నారు. అందుకు నా భర్త ఒప్పుకోలేదు. కానీ క్యాన్సర్ అయితే మరింత కష్టం అవుతుంది కదా అని నేనే ఆయన్ని ఒప్పించాను. అయితే అరగంటలో పూర్తిచేస్తామన్న సర్జరీ మూడున్నర గంటలపాటు చేశారు. ఆపరేషన్ జరిగిన పది రోజుల పాటు నేను అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. ఒక నెలరోజుల తర్వాత నన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు.

తరచుగా ఫిజియోథెరపీ చేయించుకోవాలని చెప్పారే తప్ప.. ఆ తర్వాత నన్ను అస్సలు పట్టించుకోలేదు. ఎన్నో మందులు వాడాను కానీ నా ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో నా భర్త కంగారుపడుతున్నాడు. పైగా నా చికిత్స కోసం సంపాదించిన ఆస్తులన్నింటినీ అమ్మేశాడు” అంటూ తన దీనస్థితిని చెప్పుకొచ్చింది జయప్రియ. అయితే విక్రమన్ ను సూర్యవంశం సినిమాకు సీక్వెల్ తీయమని అడుగుతున్నారని, కానీ ఈ స్థితిలో నన్ను వదిలివెళ్లడం ఇష్టంలేక ఆగిపోతున్నారని జయప్రియ తెలిపింది. కాగా.. జయప్రియ తమిళ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. వీరి పరిస్థితి చూసి.. ఎవరైనా సాయం చేస్తే బాగుంటుందని ఈ విషయం తెలిసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.