iDreamPost

ముచ్చటగా మూడోసారి తండ్రైన శివ కార్తికేయన్.. బిడ్డ రాకతో ఖుషీ!

  • Published Jun 03, 2024 | 8:52 PMUpdated Jun 03, 2024 | 8:52 PM

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ముచ్చటగా మూడోమారు తండ్రి అయ్యారు. పండంటి బిడ్డ రాకతో ఆయన కుటుంబంతో పాటు అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

శివ కార్తికేయన్.. పేరుకే తమిళ నటుడు. కానీ తెలుగులోనూ ఆయనకు మంచి పాపులారిటీ ఉంది. ‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’ లాంటి సినిమాలతో ఇక్కడ ఆయనకు మార్కెట్ ఏర్పడింది. తెలుగు నాట శివ కార్తికేయన్​కు ఉన్న పాపులారిటీ చూసి ‘ప్రిన్స్’ అనే మూవీని బైలింగ్యువల్​గా తెరకెక్కించారు. శివ కార్తికేయన్ నుంచి ఓ మూవీ వస్తోందంటే.. కోలీవుడ్​తో పాటు టాలీవుడ్​లోనూ అంతే క్రేజ్ నెలకొంటుంది. అలాంటి ఈ హీరో నుంచి ఓ శుభవార్త. శివ కార్తికేయన్ ముచ్చటగా మూడోమారు తండ్రి అయ్యారు. ఆయన భార్య ఆర్తి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

శివ కార్తికేయన్-ఆర్తి దంపతులకు ఇప్పటికే ఆరాధన అనే ఓ పాప, గుగన్ అనే బాబు ఉన్నారు. ఇప్పుడు మూడో సంతానానికి జన్మనిచ్చారు. దీంతో ఈ జంటకు అందరూ విషెస్ చెబుతున్నారు. శివ కార్తికేయన్ ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్ అంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక, ఈ మధ్య ‘అయలాన్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు శివ కార్తికేయన్. తెలుగు వెర్షన్ రిలీజ్ టైమ్​లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇంకా ఈ వెర్షన్ అందుబాటులోకి రాలేదు. కాగా, ప్రస్తుతం ఆర్మీ నేపథ్యంలో రూపొందుతున్న ఓ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు శివ కార్తికేయన్. ఈ మూవీతో బిగ్ హిట్ కొట్టి మళ్లీ ట్రాక్​లోకి రావాలని ఆయన చూస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి