ఆఖరికి తమన్నా కూడా అలాంటి పాత్రలో.. ఫస్ట్ లుక్ వైరల్!

  • Author ajaykrishna Published - 10:03 AM, Sat - 30 September 23
  • Author ajaykrishna Published - 10:03 AM, Sat - 30 September 23
ఆఖరికి తమన్నా కూడా అలాంటి పాత్రలో.. ఫస్ట్ లుక్ వైరల్!

చిత్రపరిశ్రమలో హీరోయిన్స్ గా కెరీర్ మొదలుపెట్టిన భామలు.. ఎప్పటికైనా తాము అనుకున్న పాత్రలన్ని చేసేయాలని తాపత్రయపడుతుంటారు. ఎందుకంటే.. సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఎప్పుడు ఎవరి టైమ్ నడుస్తుందో.. ఎవరి టైమ్ మారిపోతుందో ఎవరు గెస్ చేయలేరు. అలాగని టాలెంట్ ఉంటే.. ట్రెండ్ కి తగ్గట్టుగా నడిస్తే ఎక్కువ కాలం ఉండకపోరు. కెరీర్ ఆరంభించి దాదాపు పదిహేనేళ్లు దాటినా.. ఇంకా చేయాల్సిన పాత్రలు మిగిలి ఉన్నాయని అంటుంటారు హీరోయిన్స్. హీరోయిన్స్ అంటే.. ఒకటి గ్లామర్ రోల్స్ లేదా డిగ్లామర్ రోల్స్ ఇవి రెండే చేస్తుంటారు. వీటిలో పాత్రను బట్టి జానర్ డిసైడ్ అవుతుంది.

ఇక మిల్కీ బ్యూటీ తమన్నా.. గురించి పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా వైడ్ తమన్నాకు ఫ్యాన్స్ ఉన్నారు. అన్ని భాషలలో సినిమాలు చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంది. కెరీర్ లో ఇప్పటిదాకా ఎన్నో గ్లామర్ పాత్రలు పోషించిన తమన్నా.. ఎప్పుడూ లిప్ లాక్ రూల్ బ్రేక్ చేయలేదు. అలాగే బెడ్ సీన్స్ కూడా ప్రోత్సాహించలేదు. కానీ.. చాలా కాలం తర్వాత ప్రియుడు విజయ్ వర్మతో చేసిన ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్ లో ఆ రూల్ బ్రేక్ చేసింది. లిప్ లాక్స్ తో పాటు బెడ్ సీన్స్ కూడా చేసి అందరి మైండ్ బ్లాక్ చేసింది. ఇన్నాళ్లు కేవలం సాంగ్స్ వరకు అందాల ప్రదర్శన చేసిన తమన్నా.. ఒక్కసారిగా రూల్స్ బ్రేక్ చేసేసరికి. సరే ఇకపై ఏ పాత్ర చేసినా చూస్తామని ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు.

ఈ క్రమంలో ఇన్నిరోజులు గ్లామర్ హీరోయిన్ గా పేరొందిన తమన్నా.. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లతో బోల్డ్ బ్యూటీ అనిపించుకుంది. ఇప్పుడు త్వరలోనే కొత్త పేరుకు తెరలేపే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం తమన్నా.. డైరెక్టర్ సుందర్ సి తెరకెక్కిస్తున్న ‘అరణ్మనై 4’లో నటిస్తుంది. ఈ హరర్ కామెడీ మూవీలో తమన్నాతో పాటు రాశిఖన్నా కూడా నటిస్తోంది. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో తమన్నా ఫస్ట్ టైమ్ దయ్యంగా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి తమన్నా దయ్యంగా కనిపిస్తుందా లేక.. దయ్యం పట్టిన లేడీ క్యారెక్టర్ లో కనిపిస్తుందా అనేది సస్పెన్స్. చూడాలి మరి తమన్నాతో సుందర్ సి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. మరి తమన్నా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments