iDreamPost
android-app
ios-app

నా తల్లిదండ్రులే ఇలా ప్రశ్నించలేదు.. ఫ్యాన్స్ పై మిల్కీ బ్యూటీ అసహనం!

నా తల్లిదండ్రులే ఇలా ప్రశ్నించలేదు.. ఫ్యాన్స్ పై మిల్కీ బ్యూటీ  అసహనం!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  ‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత హ్యాపీ డేస్ సినిమాతో యువత క్రేజ్ సంపాదించింది. తన అందచందాలతో కుర్రాళ్ల మతులు పొగొట్టింది ఈ మిల్కీ బ్యూటీ. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన ఈ అమ్మడు నటించింది. దక్షిణాది భాషలతో పాటు, బాలీవుడ్ లోను అనేక చిత్రాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒకవైపు సినిమాలతో పాటు  మరోవైపు పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్న ఈ అమ్మడు.. అసహనానికి గురైంది. తన తల్లిదండ్రులే ఇలాంటి ప్రశ్నలు వేయలేదంటూ ఫ్యాన్స్ పై  అసహనం వ్యక్తం చేసింది.

ఇటీవల చెన్నైలో జరిగిన ఫ్యాన్స్ మీట్ లో తమన్నా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి అభిమానులతో ముచ్చటించారు. అలానే వారు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చారు. అయితే  ఒక ప్రశ్నకు మాత్రం ఆమె ఫ్యాన్స్ పై అసహనం వ్యక్తం చేసింది. నెగెటివి వార్తలను మీరు ఎలా ఎదుర్కొంటారు? అని ఓ అభిమాని ప్రశ్నించాడు. దానికి మిల్కీ బ్యూటీ సమాధానం ఇస్తూ.. వ్యతిరేకత, విమర్శలు వచ్చినప్పుడు.. ఎందుకిలా జరుతుందని ఆలోచిస్తారంట. మనల్ని  కొంతమంది ప్రశంసిస్తారు, మరికొందరు  విమర్శలు చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, దానికి చింతించాల్సిన అవసరం లేదని ఈ భామ్మ తెలిపింది. అనతరం మరో నెటిజన్.. “మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?. తమిళ అబ్బాయిలు మీకు నచ్చలేదా? అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నపై తమన్నా తీవ్ర అశహనానికి లోనయ్యారు. తన తల్లిదండ్రులే ఇలా తనను ఎప్పుడూ అడగలేదని ఈ బ్యూటీ  అన్నారు. తన లవర్ విజయ్ వర్మను ఉద్దేశిస్తూ.. ప్రస్తుతం జీవితంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని, తన లైఫ్ ఆనందంగా సాగుతుందని తమన్నాచెప్పారు. మరి.. తమన్నా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş