iDreamPost
android-app
ios-app

విజయ్ సినిమా డిజాస్టర్ అని ముందే తెలుసు: తమన్నా

  • Author ajaykrishna Updated - 12:00 PM, Tue - 1 August 23
  • Author ajaykrishna Updated - 12:00 PM, Tue - 1 August 23
విజయ్ సినిమా డిజాస్టర్ అని ముందే తెలుసు: తమన్నా

ఒక్కోసారి ఇండస్ట్రీలో సినిమాలు ప్లాప్ అవుతాయని ముందే తెలిసినా.. ఇచ్చిన కమిట్మెంట్ కారణంగా సినిమాలు చేస్తుంటారు హీరోహీరోయిన్స్. కాస్త సీనియర్స్ అయ్యాక ఇలాంటి తప్పులు చేయరు. కానీ.. కెరీర్ ఆరంభంలో కథలను జడ్జిమెంట్ చేయలేక.. అవకాశం వచ్చింది కదా అని ఓకే చేసేస్తుంటారు. దాదాపు కెరీర్ ప్రారంభంలో ఎవరైనా హిట్స్, ప్లాప్స్ గురించి కాకుండా అవకాశం వస్తే చాలు అనే ఆలోచనలో ఇలాంటి నిర్ణయాలు, కమిట్మెంట్స్ ఇస్తుంటారు. అలా తాను కూడా కెరీర్ స్టార్టింగ్ లో.. సినిమాని అంచనా వేయలేక మిస్టేక్ చేశానని చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా. అదికూడా దళపతి విజయ్ సినిమా అని ఓపెన్ గా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తమన్నా గురించి ఇండియా వైడ్ ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటు తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా గడిపేస్తోంది. రీసెంట్ గా జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లతో తనలోని బోల్డ్ యాంగిల్ ని బయటపెట్టి.. అందరికీ షాకిచ్చింది. ముఖ్యంగా లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా.. విజయ్ వర్మతో రొమాన్స్ సన్నివేశాలు రెచ్చిపోయి చేసిందంటే ఆశ్చర్యపోయే అవసరం లేదు. అసలు తమన్నాని ఇలా ఎప్పుడు చూసుండరు.. అసలు ఎవరు ఎక్స్ పెక్ట్ కూడా చేయలేరు. ఆ రేంజ్ లో అమ్మడు అందాల ఆరబోత.. కిస్ సీన్స్.. బెడ్ సీన్స్ లో చెలరేగిపోయింది. ఈ క్రమంలో ప్రస్తుతం తమన్నా నటిస్తున్న రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ అవుతున్నాయి.

ఆగష్టు 10న సూపర్ స్టార్ రజనీ మూవీ ‘జైలర్’ రిలీజ్ అవుతుండగా.. ఆగష్టు 11న మెగాస్టార్ నటించిన భోళా శంకర్ రిలీజ్ అవుతోంది. సో.. ప్రస్తుతం ఈ రెండు సినిమాలపై హోప్ తో ఉంది తమన్నా. అలాగే జైలర్ లో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ‘కావాలా’.. మ్యూజిక్ లవర్స్ ని ఊపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. తన కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచిన సినిమా గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “కెరీర్ ఆరంభంలో చాలా సినిమాలు చేసుకుంటూ పోయాను. అందులో ఒకటి దళపతి విజయ్ తో చేసిన ‘సుర’ ఒకటి. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే.. ఆ సినిమాలో నా క్యారెక్టర్ ముందే నచ్చలేదు. సినిమా షూటింగ్ జరిగేటప్పుడే అది డిజాస్టర్ అవుతుందని నాకు అర్థమైంది. కానీ.. కమిట్మెంట్ ఇచ్చా కాబట్టి.. పూర్తి చేయక తప్పలేదు. సో.. చేయడం వరకే నా చేతిలో ఉంటుంది. అది హిట్టా ఫట్టా ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు.” అని తెలిపింది. ప్రస్తుతం తమన్నా కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి తమన్నా మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetcasibom