iDreamPost
android-app
ios-app

ఆడియన్స్ ని ఫిదా చేసిన.. తమన్నా- రాశీఖన్నా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..!

  • Published May 07, 2024 | 4:22 PM Updated Updated May 07, 2024 | 4:22 PM

Tamanna Rashi Khanna Achacho Full video Song: తమిళ్ లోనే కాకుండా.. తెలుగులో కూడా సుందర్ సి హారర్ కామెడీ చిత్రాలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా వచ్చిన బాక్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ నుంచి ఇప్పుడు తమన్నా, రాశీఖన్నా ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు.

Tamanna Rashi Khanna Achacho Full video Song: తమిళ్ లోనే కాకుండా.. తెలుగులో కూడా సుందర్ సి హారర్ కామెడీ చిత్రాలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా వచ్చిన బాక్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ నుంచి ఇప్పుడు తమన్నా, రాశీఖన్నా ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు.

  • Published May 07, 2024 | 4:22 PMUpdated May 07, 2024 | 4:22 PM
ఆడియన్స్ ని ఫిదా చేసిన.. తమన్నా- రాశీఖన్నా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..!

ఈ మధ్యకాలంలో మూవీస్ కంటే కూడా ఆ సినిమాలో ఉండే సాంగ్స్ కే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. సినిమా మీద హైప్ ని క్రియేట్ చేయడానికి కూడా ఈ  సాంగ్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా అంతా ఈ ఫార్ములాని వాడేస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో పాటను విడుదల చేస్తూ ఉంటారు. అలా ఇటీవల వచ్చిన అచ్చెచ్చో సాంగ్ కి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. సినిమా కంటే కూడా ఈ సాంగ్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఆ సాంగ్ లిరికల్ సాంగ్ కే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. ఇప్పుడు ఫుల్ సాంగ్ వచ్చేసింది.

ప్రముఖ డైరెక్టర్ సుందర్.సి హార్రర్ సినిమాని ఒక ఫ్రాంచైజ్ లా తీస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇటీవల వచ్చిన బాక్ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. మూవీ టేకింగ్ కి తెలుగు ప్రేక్షకులు కూడా మెస్మరైజ్ అయిపోయారు. కానీ, కథ మాత్రం ఎప్పటిలాగానే ఉందని.. కొత్తదనం లేదంటూ చెప్పుకొచ్చారు. కానీ, మూవీకి మాత్రం మంచి ఆదరణే లభించింది. ముఖ్యంగా ఈ మూవీలో ఇద్దరు మిల్కీ బ్యూటీలను పెట్టారు. ఒకరు తమన్నా అవ్వగా.. ఇంకొకరు రాశీఖన్నా. ఈ ఇద్దరు భామలు ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

Macho song

ఈ బాక్ చిత్రం నుంచి విడుదలైన అచ్చెచ్చో సాంగ్ కి పాన్ ఇండియా లెవల్లో మంచి రెస్పాన్స్ లభించింది. వాస్తవానికి తమన్నా డాన్సింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు తోడు రాశీఖన్నాలాంటి ఎనర్జిటిక్ బ్యూటీ తోడవ్వడంతో ఫ్యాన్స్ అందరికీ పిచ్చెక్కిపోయింది. ఆన్ స్క్రీన్ ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ చేసిన డాన్స్, ఎక్స్ ప్రెషన్స్ కు సినిమా ప్రేక్షకులు పిచ్చెక్కిపోయారు. అందుకే ఈ సాంగ్ ఫుల్ వీడియో ఎప్పుడు విడుదల అవతుుందా అని ఎంతగానో ఎదురుచూశారు. ఆ తరుణం రానే వచ్చింది. ఫుల్ వీడియో సాంగ్ ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.

మూవీకి మంచి టాక్ దక్కడానికి ఈ సాంగ్ కీ రోల్ ప్లే చేసింది. అంటే మూవీ టీమ్ చేసిన ప్రమోషన్స్ కంటే ఈ అచ్చెచ్చో సాంగ్ వల్లే ఎక్కువ మంది థియేటర్ కు వెళ్లారు. ఇప్పుడు ఆన్ పబ్లిక్ డిమాండ్ ఈ అచ్చెచ్చో సాంగ్ ఫుల్ వీడియో విడుదల చేశారు. ఈ సాంగ్ లో మిల్కీ బ్యూటీలు తమన్నా, రాశీఖన్నా ఇద్దరూ అందాలు ఆరబోశారు. సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ మాత్రమే కాకుండా స్టెప్పులకు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సాంగ్ కి సంబంధించిన రీల్సే కనిపిస్తున్నాయి. మరి.. ఆ ఫుల్ వీడియో సాంగ్ చూసేసి.. మిల్కీ బ్యూటీస్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbahsegel girişgrandpashabet