Aditya N
సంక్రాంతికి విడుదల కావాల్సిన "ఈగల్" ఫిబ్రవరి 9న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాను గుంటూరు కారం చిత్రంతో పోల్చుతూ కొత్త కథనాలు పుట్టుకొస్తున్నాయి
సంక్రాంతికి విడుదల కావాల్సిన "ఈగల్" ఫిబ్రవరి 9న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాను గుంటూరు కారం చిత్రంతో పోల్చుతూ కొత్త కథనాలు పుట్టుకొస్తున్నాయి
Aditya N
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ఈగల్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. అయితే ఈ సినిమా సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. 2024 సంక్రాంతి రిలీజ్ కోసం నాలుగుకు పైగా సినిమాలు పోటీ పడటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఈగల్ సినిమాను రేసు నుంచి తప్పించారు. సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామి రంగా చిత్రాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 9కి విడుదల తేదీని మార్చడంతో ఈగల్ కి మరే సమస్యా ఉండదని అనుకున్నారు. అయితే మహేష్ బాబు గుంటూరు కారం మరోసారి ఈగల్ ను ఇబ్బంది పెడుతుంది. కానీ ఈసారి థియేటర్లలో కాదు ఓటీటీ ద్వారా
మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ ఈరోజు నెట్ ఫ్లిక్స్ లో విడుదలయింది. ఓటీటీలో విడుదలయ్యే ఒక పెద్ద సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఇతర సినిమాల ఓపెనింగ్స్ పై ప్రభావం చూపడం మనం చాలాసార్లు చూశాం. గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి తొలిరోజు ఈగల్ ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఓటీటీ రిలీజ్ డేట్స్ అనేవి నిర్మాతల చేతుల్లో లేకపోవడంతో ఈగల్ కు గుంటూరు కారంను ఎదుర్కోక తప్పడం లేదు. అయితే సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈగల్ సినిమాను మరే సినిమా అడ్డుకోలేదు.
గతంలో నిఖిల్ తో సూర్య వర్సెస్ సూర్య సినిమా తీసిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈగల్ ఈ వారం ఓటీటీలో గుంటూరు కారంతో పాటు థియేటర్లలో యాత్ర 2, రజినీకాంత్ లాల్ సలాం సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, మధూ, శ్రీనివాస్ అవసరాల, కావ్య థాపర్ కీలక పాత్రలు పోషించారు.