Krishna Kowshik
‘ఏం సక్కగున్నవ్ రో .. నా సొట్ట సెంపలోడ’ అంటూ తెలుగు వారిని ఆకట్టుకున్న నటి తాప్సీ పన్ను, ప్రభాస్, రవితేజ, రానా, గోపిచంద్, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన ఆడిపాడిన ఈ చిన్నది.. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. అక్కడకు వెళ్లాక..
‘ఏం సక్కగున్నవ్ రో .. నా సొట్ట సెంపలోడ’ అంటూ తెలుగు వారిని ఆకట్టుకున్న నటి తాప్సీ పన్ను, ప్రభాస్, రవితేజ, రానా, గోపిచంద్, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన ఆడిపాడిన ఈ చిన్నది.. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. అక్కడకు వెళ్లాక..
Krishna Kowshik
కొంతమంది అప్ కమింగ్ హీరోయిన్లు టాలీవుడ్‌ను ప్రాక్టీస్ మ్యాచ్ లా భావిస్తుంటారు. ఇక్కడ నటనలో ఓనమాలు దిద్ది.. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెడుతుంటారు. బీటౌన్ వెళ్లాక.. తెలుగు ఇండస్ట్రీ గురించి తక్కువ చేసి మాట్లాడటమే కాకుండా.. ఇక్కడ దర్శకులు, సినిమాలపై ఆరోపణలు చేస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను.ఝుమ్మంది నాదం మూవీలో టీటౌన్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. మిస్టర్ ఫర్‌ఫెక్ట్, వీర, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, సాహసం, షాడో, ఘాజీ, నువ్వెవరో వంటి చిత్రాల్లో నటించింది. తమిళ్, మలయాళ సినిమాల్లో చేస్తూనే హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ భామ తొలుత బొద్దుగా కనిపించేది. ఆ తర్వాత ఫిటెనెస్‌పై దృష్టి సారించి నాజూగ్గా మారింది
ఇక వరుసగా బాలీవుడ్ అవకాశాలను అందిపుచ్చుకుంది. పింక్ ఆమెను బీటౌన్‌లో స్టార్ హీరోయిన్‌ను చేసింది. అక్కడకు వెళ్లాక.. టాలీవుడ్ దర్శకులు, హీరోలపై ఆరోపణలు చేస్తూనే ఉంది. గతంలో అక్కడ దర్శకులు బొడ్డు తప్ప ఏం చూపించరంటూ వ్యాఖ్యానించింది. అలాగే టాలీవుడ్ కన్నా బాలీవుడ్‌లో అవకాశాలు ఎక్కువ వస్తున్నాయని కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న తాప్సీ యానిమల్ మూవీ గురించి, హీరోయిన్ రష్మికపై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమెలా తాను చేయలేనని, తానైతే ఈ చిత్రంలో నటించేదాన్ని కాదని రష్మికపై ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేసింది . అలాగే చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులకు పవర్ ఉంటుందని, అదేవిధంగా సమాజంపై బాధ్యత ఉంటుందని పేర్కొంది. అలా అని యానిమల్ వంటి చిత్రాల్లో నటించే వాళ్లను తప్పుబట్టడం లేదని పేర్కొంది.
మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, నచ్చింది చేసే స్వేచ్ఛ మనకు ఉన్నాయని, తానైతే యానిమల్ మూవీలో నటించనంటూ పేర్కొంది తాప్సీ పన్ను. అయితే ఈ ఘటనపై సందీప్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.‘ నిన్ను ఎవరు అడిగారు.. ఏంటీ నీ ఓవర్ యాక్షన్’ అంటూ ఆమెపై మండిపడుతున్నారు. ఇక్కడ దర్శకులతో సినిమాలు చేసి.. అక్కడకు వెళ్లి స్టార్ డమ్ వచ్చాక ఇష్టమొచ్చినట్లు నోరు జారొద్దంటూ వార్నింగ్ ఇస్తున్నారు. కాగా, యానిమల్ గత డిసెంబర్ 1న విడుదలై.. భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ రాధిక శరత్ కుమార్, కస్తూరి ఈ మూవీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వెళ్లాక .. టీటౌన్ పై హీరోయిన్లు చేస్తున్న ఆరోపణలు సరైనవేనంటారా..? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.