iDreamPost
android-app
ios-app

ప్రియుడిని సీక్రెట్ గా పెళ్లాడిన హీరోయిన్ తాప్సీ పన్ను!

  • Published Mar 25, 2024 | 4:38 PM Updated Updated Mar 25, 2024 | 4:38 PM

Tapsee Pannu- Mathyas By: తాప్సీ పన్ను ఇటీవల తన పెళ్లి గురించి వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించడమే కాకుండా.. ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు అదే తాప్సీ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకుంది అంటున్నారు.

Tapsee Pannu- Mathyas By: తాప్సీ పన్ను ఇటీవల తన పెళ్లి గురించి వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించడమే కాకుండా.. ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు అదే తాప్సీ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకుంది అంటున్నారు.

  • Published Mar 25, 2024 | 4:38 PMUpdated Mar 25, 2024 | 4:38 PM
ప్రియుడిని సీక్రెట్ గా పెళ్లాడిన హీరోయిన్ తాప్సీ పన్ను!

తాప్సీ పన్ను.. ఈ అమ్మడుకి పాన్ ఇండియా లెవల్లో ఇప్పుడు ఎంతో క్రేజ్ ఉంది. టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసింది. ఇప్పుడు మాత్రం దాదాపుగా బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్న ఈ భామ పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలపై ఈ బ్యూటీ రియాక్ట్ అయ్యింది కూడా. జస్ట్ రియాక్షన్ కాదండోయ్.. ఆల్మోస్ట్ ఇల్లు పీకి పందేరిసినంత పని చేసింది. నా వ్యక్తిగత విషయాల గురించి ఎందుకు రాస్తున్నారు? నేను నోరు విప్పేతే చాలు ఏదో ఒకటి రాసేస్తున్నారు అటూ తాప్సీ పన్ను తెగ సీరియస్ అయిపోయింది. కానీ, ఇప్పుడు బీటౌన్ లో బాగా గట్టిన వినిపిస్తున్న వార్తలు ఏంటంటే.. తాప్సీ నిజంగానే పెళ్లి చేసుకుందంట.

తాప్సీ తన పెళ్లి వార్తలను ఖండించిన కొన్ని రోజులకే ఆమెకు పెళ్లైంది అంటూ మళ్లీ వార్తలు వస్తున్నాయి. ముందుగా చెప్పినట్లుగానే ఉదయ్ పూర్ కోటలో తాప్సీ పన్ను వివాహం జరిగిందంట. మార్చి 23న తాప్సీ పన్ను- డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియస్ బోను వివాహం చేసుకుందని చెప్తున్నారు. అయితే ఈ విషయంపై తాప్సీ పన్ను మిత్రులు కూడా పరోక్షంగా ఖరారు చేశారు. ఇప్పుడు బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఈ అమ్మడు రహస్య వివాహం గురించి టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితులు రాకూడదు అనే తాప్సీ తన వివాహం గురించి చాలా గోప్యంగా ఉంచింది అంటున్నారు. అందుకే ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు, బంధువులకు మాత్రమే ఈ పెళ్లి ఆహ్వానం దక్కింది అంటున్నారు. అయితే ఈ పెళ్లికి హాజరైన తాప్సీ మిత్రులు మాత్రం ఇన్ స్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్టులు చూస్తే తాప్సీ పెళ్లి వార్తలు నిజమే అనే భావన కలుగుతుంది.

ఫ్రెండ్స్ రివీల్:

తాప్సీ పెళ్లికి హాజరైన వారిలో పవైల్ గులాటీ కూడా ఉన్నారని చెప్తున్నారు. పవైల్ గులాటీ ఒక ఫొటో షేర్ చేశాడు. దానిలో తాప్సీ సోదరి షగ్ను పన్నుతో పాటుగా మరికొంత మిత్రులు ఉన్నారు. ఈ ఫొటో దిగింది తాప్సీ పెళ్లిలోనే అంటూ తెలుస్తోంది. అలాగే తాప్సీ ఫ్రెండ్ కనిక కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. వాటికి హ్యాష్ ట్యాగ్ “మేరే యార్ కి షాదీ” అని ట్యాగ్ పెట్టింది. ఇది కూడా తాప్సీ వివాహం గురించే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ మొత్తం ఇప్పుడు తాప్సీ పన్ను- మథియస్ బో వివాహం గురించే మాట్లాడుకుంటున్నారు. పెళ్లి వార్తలను ఖండించిన ఈ అమ్మడు ఇంత త్వరగా పెళ్లి పీటలు ఎక్కేసిందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఎవరికీ చెప్పలేదు సరే.. వార్తలు వచ్చాయని ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేయడం అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి తాప్సీ పన్ను సీక్రెట్ గా వివాహం చేసుకుంది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pavail Gulati (@pavailgulati)

 

View this post on Instagram

 

A post shared by Kanika Dhillon (@kanika.d)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş