iDreamPost
android-app
ios-app

గ్రాండ్‌గా ‘క్యూజి గ్యాంగ్ వార్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

  • Published Aug 26, 2024 | 6:46 PM Updated Updated Aug 26, 2024 | 6:46 PM

QG Trailer Launch Event: జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ క్యూజి. ఈ సినిమా ఆగస్టు 30న విడుదలవుతున్న సందర్భంగా మూవీ యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు.

QG Trailer Launch Event: జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ క్యూజి. ఈ సినిమా ఆగస్టు 30న విడుదలవుతున్న సందర్భంగా మూవీ యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు.

  • Published Aug 26, 2024 | 6:46 PMUpdated Aug 26, 2024 | 6:46 PM
గ్రాండ్‌గా ‘క్యూజి గ్యాంగ్ వార్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రధారులుగా.. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో తెరకెక్కిన మూవీ క్యూజీ- గ్యాంగ్ వార్. ఈ మూవీకి సంబంధించిన తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులని ఇప్పటికే రుషికేశ్వర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మాత వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 30న ఐదు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా టి. ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్, శివనాగు, శ్రీను, నిర్మాత వేణుగోపాల్, ఎన్టీఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా క్యూజి మూవీ బిగ్ టికెట్ ని లాంచ్ చేశారు. 

ఈ సందర్భంగా నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఈవెంట్ కి వచ్చిన ముఖ్య అతిథులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అడగ్గానే క్యూజి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రసన్న కుమార్ కి, దామోదర్ ప్రసాద్ కి, శివనాగుకి ప్రత్యేక కృతజ్ఞతలు.. ఇదొక మంచి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ అని.. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. 

QG GANG WAR TRAILER

ఇక ఎన్టీఆర్ శ్రీను మాట్లాడుతూ.. తనకు గురువు, దైవం లాంటి వ్యక్తి ప్రసన్న కుమార్ అని.. ఆయన ఇవాళ మా సినిమాని సపోర్ట్ చేయడానికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నారు. మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చి సపోర్ట్ చేసిన ప్రసన్నకుమార్ కి, దామోదర్ ప్రసాద్ కి, శివనాగుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. ఈ మూవీ దర్శకుడు వివేక్ కుమార్ కన్నన్.. దిగ్గజ దర్శకుడు బాలా దగ్గర 15 ఏళ్ళు దర్శకత్వ శాఖలో పని చేశారని.. విదేశాల్లో అద్భుతమైన లొకేషన్స్ లో ఈ మూవీని షూట్ చేశారని అన్నారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని.. పెద్ద విజయాన్ని సాధిస్తుందని ఎన్టీఆర్ శ్రీను అన్నారు.

టి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్ లాంటి పెద్ద స్టార్స్ తో కమర్షియల్ సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ తో క్యూజి మూవీని నిర్మించారని అన్నారు. ఎన్నో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఎన్టీఆర్ శ్రీను, నిర్మాత వేణుగోపాల్ తో కలిసి ఈ సినిమాకి సపోర్ట్ గా నిలబడడం పెద్ద ప్లస్ అవుతుందని అన్నారు. శివపుత్రుడు లాంటి సినిమా తీసిన బాలా దగ్గర అసిస్టెంట్ గా చేసిన వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వంలో క్యూజి మూవీ రాబోతుందని.. వేణుగోపాల్, ఎన్టీఆర్ శ్రీనులకి ఇది సరైన సినిమా అవుతుందని అన్నారు. ఈ సినిమాకి డ్రమ్స్ శివమణి అందించిన సంగీతం అద్భుతంగా ఉండబోతుందని.. ఈ సినిమా ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నానని అన్నారు.

ఈ సినిమాకి ముఖ్య అతిథిగా దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. క్యూజి ట్రైలర్ పెద్ద షాక్ ఇచ్చిందని అన్నారు. ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుందని.. జాకీ ష్రాఫ్, సన్నీలియోన్, ప్రియమణి లాంటి మంచి క్యాస్టింగ్ ని ఎంచుకున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ ఫార్మాట్ ఈ మూవీలో ఉందని.. విజువల్స్ చాలా బాగున్నాయని అన్నారు. ఈ మూవీ నిర్మాత వేణుగోపాల్ కి పెద్ద విజయం సాధించి పెట్టి బాగా డబ్బులు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అన్నారు.    

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş