iDreamPost
android-app
ios-app

స్వయంకృషిలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు పెద్ద నటి! అస్సలు నమ్మలేరు!

సిల్వర్ స్క్రీన్ పై బెస్ట్ జోడీల్లో ఒకరు చిరంజీవి-విజయశాంతి. ఈ కాంబోలో వచ్చిన మూవీస్ అన్ని ఆల్మోస్ట్ హిట్. అయితే కమర్షియల్ హంగులు, ఆర్బాటాలు లేని మూవీ స్వయంకృషి. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి మార్కులే పడ్డాయి. ఇందులో చిన్నప్పటి సుమలత క్యారెక్టర్ చేసిన నటి ఎవరో తెలుసా..?

సిల్వర్ స్క్రీన్ పై బెస్ట్ జోడీల్లో ఒకరు చిరంజీవి-విజయశాంతి. ఈ కాంబోలో వచ్చిన మూవీస్ అన్ని ఆల్మోస్ట్ హిట్. అయితే కమర్షియల్ హంగులు, ఆర్బాటాలు లేని మూవీ స్వయంకృషి. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి మార్కులే పడ్డాయి. ఇందులో చిన్నప్పటి సుమలత క్యారెక్టర్ చేసిన నటి ఎవరో తెలుసా..?

స్వయంకృషిలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు పెద్ద నటి! అస్సలు నమ్మలేరు!

ఇండస్ట్రీలో ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. కేవలం నటనే కాదు డ్యాన్సులు, డైలాగులతో టాలీవుడ్ బాక్సాఫీసు రారాజుగా ఎదిగాడు. కష్టపడితే కచ్చితంగా సక్సెస్ లభిస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం. తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిశలా వ్యాపించేలా చేసిన నటుడాయన. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన పాదాక్రాంతం. ఆనాటి దర్శకుల నుండి యంగ్ డైరెక్టర్ల వరకు వర్క్ చేసిన అనుభవం చిరు సొంతం. కళామతల్లికి ఆయన చేసిన సేవలకు‌గానూ.. దేశంలోనే రెండవ పౌరపురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. చిరు కేవలం యాక్షన్ మూవీలే కాదు స్వయం కృషి, రుద్రవీణ వంటి ఢిపరెంట్ జోన్ చిత్రాలతోనూ అలరించాడు.

స్వయంకృషి.. ఆయన సినీ ప్రస్తానానికి సరిగ్గా సరిపోతుంది. కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయం కృషి 1987లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విజయ శాంతి, సుమలత హీరోయిన్లు. శర్వదమన్ బెనర్జీ, చరణ్ రాజ్, బ్రహ్మానందం, పిఎల్ నారాయణ, మిశ్రో తదితరులు నటించారు. ఉత్తమ నటుడు, నటి కేటగిరిలో చిరంజీవి, విజయ్ శాంతిలకు నంది అవార్డులు వరించాయి. అలాగే ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది లేడీ అమితాబ్ బచ్చన్. హిందీలో ధర్మ యుధ్ పేరుతో డబ్ అయ్యింది. అంతేనా ఈ చిత్రం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్, ఆసియా ఫసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది.

ఈ చిత్రం రష్యన్ భాషలోకి డబ్ అయ్యింది. అంతేనా మాస్కో ఇంటర్నేషన్‌లో కూడా స్క్రీన్ చేశారు. ఇందులో సుమలతను మంచి చదువులు చదివించి, ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు చిరంజీవి. కానీ ఆమె మరొకర్ని ఇష్టపడుతుంది. దీంతో తనను ఇష్టపడుతున్న విజయ్ శాంతిని వివాహం చేసకుంటాడు. ఇందులో చైల్ట్ ఆర్టిస్టులు కూడా గుర్తుండిపోతారు. చిరంజీవి మేనల్లుడిగా అర్జున్ అనే చిన్నారి నటించాడు. అలాగే చిరంజీవి చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన బాబు ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్. సుమలత చిన్నప్పుడు క్యారెక్టర్‌లో నటించిన పాప ఎవరో తెలుసా..? చెబితే అసలు నమ్మలేరు. ఆమె ప్రముఖ టీవీ, సినీ నటి భావన.

మన బుల్లితెరపై ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటుంది. అయితే ఆమె చైల్ట్ ఆరిస్టుగా ఎన్నో చిత్రాల్లో నటించింది. లాయర్ సుహాసిని, భారతంలో బాల చంద్రుడు, రాజేశ్వరి కళ్యాణం ఇలా 25 సినిమాలు చేసింది. సంధ్య సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అందం సీరీయల్‌తో బుల్లితెరపై ఆకట్టుకుంది. సుమారు 200ల సీరియల్స్ చేసింది. అలాగే హీరోయిన్‌గా మెరిసింది. అందగాడులో ఆమెనే హీరోయిన్. అమ్మాయి బాగుంది, సుప్రభాతం వంటి మూవీస్‌లో నటించింది. ప్రస్తుతం మేఘ సందేశం, శుభస్య శ్రీఘం వంటి ధారావాహికలు చేస్తుంది. అలాగే స్పెషల్ ఈవెంట్స్ లోనూ మెరుస్తుంది. సీరియల్ దర్శకుడు విజయ్ కృష్ణను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వీక్షకులను పలకరిస్తూ ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Bhavana Samanthula (@bhavanasamanthula_official)