Venkateswarlu
సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు తమిళంతో పాటే తెలుగులోనూ విడుదల అయి సక్సెస్ సాధిస్తున్నాయి.
సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు తమిళంతో పాటే తెలుగులోనూ విడుదల అయి సక్సెస్ సాధిస్తున్నాయి.
Venkateswarlu
తమిళ హీరో అయినప్పటికీ తమిళంతో సమానంగా తెలుగులోనూ పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు సూర్య. ఆయన సినిమాలు తమిళంతో పాటే తెలుగులోనూ విడుదల అవుతున్నాయి. ఇక్కడ కూడా సంచలన విజయాన్ని అందుకుంటున్నాయి. తమిళంలో హిట్టు కాని సినిమాలు కూడా ఇక్కడ సూపర్ హిట్ అవుతున్నాయి. ఫ్యాన్ బేస్ విషయంలోనూ తెలుగు స్టార్ హీరోలతో సమానంగా సూర్యకు ఫ్యాన్స్ ఉన్నారు. అది కూడా వేల సంఖ్యలో హార్డ్ కోర్ ఫ్యాన్స్.
తమిళనాడులో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూర్య అంటే ఫ్యాన్స్ పడి ఛస్తారు. ఇక, దేశ వ్యాప్తంగా సినిమాల రీరిలీజ్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న సూర్య నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ వారనమ్ ఆయిరమ్’ మూవీ రీ రిలీజ్ అయింది. తమిళ నాడు వ్యాప్తంగా ఉన్న పలు థియేటర్లలో సందడి చేసింది. దీంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. చిత్రం విడుదల అవుతున్న ప్రతీ థియేటర్‌ను ఫుల్ చేసేశారు.
Anyday Coimbatore – @Suriya_offl Fort#VaaranamAayiram @CoimbatoreSFC pic.twitter.com/wSl6AYkjQi
— Suriya Heram ツ (@Heram_offl) December 17, 2023
సినిమా హాల్లో సైతం రచ్చ రచ్చ చేశారు. ఎలాంటి అపశృతి జరక్కుండా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మూవీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పాటలకు సీట్లోంచి లేచి డ్యాన్సులు వేస్తూ.. కేకలు పెడుతూ రచ్చ రచ్చ చేశారు. ముఖ్యంగా లవ్ ఫెయిల్ తర్వాత వచ్చే ‘‘ అంజల’’ పాట కోసం ఏకంగా థియేటర్ యజమాన్యంతో గొడవకు దిగినంత పని చేశారు. సినిమాలో సీక్వెన్స్ ప్రకారం పాట అయిపోయింది. అయితే, పాటను మళ్లీ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ పట్టుబట్టారు. ‘వన్స్ మోర్’ అంటూ పెద్దగా గోల చేయసాగారు.
Celebration of cinema ❤️🔥
V1000 😍👌 @Suriya_offl #kanguva pic.twitter.com/QZJnuL6cAu
— Suriya Heram ツ (@Heram_offl) December 17, 2023
దీంతో చేసేదేమీ లేక మళ్లీ పాటను విడదుల చేశారు. ప్రస్తుతం ‘వారనమ్ ఆయిరం’ చిత్రం విడుదలైన థియేటర్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా సూర్య ఫ్యాన్స్ పేజీల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా, వారనమ్ ఆయిరమ్ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. సూర్య ఇందులో రెండు పాత్రల్లో కనిపిస్తారు. సిమ్రాన్, సమీర రెడ్డి, దివ్య స్పందనలు సూర్యకు జంటగా నటించారు.
2008 నవంబర్ 14వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ‘ సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్’’ పేరుతో డబ్ అయి రిలీజ్ అయింది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని నమోదు చేసింది. హరీష్ జైరాజ్ అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మరి, సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్( వారనమ్ ఆయిరమ్) మూవీ రీరిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mad response for Anjala song. Played twice due to fans request.#VaaranamAayiram is a vibe 💥💥
pic.twitter.com/LEzxg5yPv1— Suriya Fans Club (@SuriyaFansClub) December 17, 2023