iDreamPost
android-app
ios-app

అభిమానులకు విందు ఇచ్చిన సూర్య.. ఎందుకంటే..?

  • Published Mar 04, 2024 | 12:28 PM Updated Updated Mar 04, 2024 | 12:28 PM

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య.. హీరోగానే కాకుండా అగరం అనే ఫౌండేషన్ తో విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నాడు. తాజాగా తన ఫ్యాన్స్‌కు విందు ఏర్పాటు చేశాడు.. ఎందుకంటే..?

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య.. హీరోగానే కాకుండా అగరం అనే ఫౌండేషన్ తో విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నాడు. తాజాగా తన ఫ్యాన్స్‌కు విందు ఏర్పాటు చేశాడు.. ఎందుకంటే..?

  • Published Mar 04, 2024 | 12:28 PMUpdated Mar 04, 2024 | 12:28 PM
అభిమానులకు విందు ఇచ్చిన సూర్య.. ఎందుకంటే..?

టాలీవుడ్ సైతం మెచ్చే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. వర్సటైల్ యాక్టర్‌గా ఆయన చేసిన ప్రయోగాలు.. బహుశా యంగ్ హీరోల్లో మరొకరు చేసి ఉండరేమో అనిపిస్తూ ఉంటుంది. సినిమా సినిమాకు వ్యత్యాసం చూపుతూ డైరెక్టర్స్ ఛాయిస్ నటుడిగా మారాడు. గత ఏడాది కేవలం క్యామియో రోల్స్‌తో ప్రేక్షకులను అలరించిన సూర్య ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రం కంగువాతో బిజీగా మారిపోయారు. 10 భాషల్లో విడుదల చేయనున్నారు ఈ చిత్రాన్ని. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అంత బిజీ బిజీ షెడ్యూల్లో కూడా ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టి.. రియల్ హీరో అనిపించుకున్నాడు ఈ స్టార్ నటుడు. తన అభిమానులకు, సామాన్యులకు విందు భోజనం ఏర్పాటు చేయడమే కాదూ.. వారికి స్వయంగా వడ్డించారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో వచ్చిన మిగ్ జాం తుఫాను చెన్నై నగరంతో సహా తమిళనాడులోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసిన సంగతి విదితమే. భారీ వర్షాలు, వరదలు పలు ప్రాంతాలను నీట ముంచేశాయి. దీంతో చాలా మంది ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. ఆ సమయంలో సూర్య.. తన వంతు సాయంగా రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించడమే కాకుండా.. బాధితులను ఆదుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు. దీంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో.. ఆహారం.. ఇతర సహాయక చర్యలు చేపట్టారు ఆయన ఫ్యాన్స్. వారి సేవలను గుర్తించిన సూర్య..ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారికి విందు ఏర్పాటు చేశారు. స్వయంగా ఆయన వడ్డించారు. అనంతరం అభిమానులతో ముచ్చటించారు సూర్య.

సూర్య తుఫాన్ సహాయకులకు విందు భోజనం ఏర్పాటు చేయడంతో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.. ఇక కంగువా సినిమా విషయానికి వస్తే.. శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఆరు విభిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించబోతున్నట్లు టాక్. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి జ్ఞానవేల్ రాజా, వంశీ కృష్ణా రెడ్డి.. ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలు. బాబీ డియోల్, జగపతి బాబు, యోగి బాబు, బాబీ సింహా, కోవై సరళ కీలక పాత్రలో పోషిస్తున్నారు. సుమారు రూ.300 కోట్లతో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్నట్లు తెలుస్తోంది. ఐమ్యాక్స్, 3డీ వెర్షన్లలోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుండటం విశేషం. ఇప్పటికే సూర్యకు సంబంధించిన షూట్ కంప్లీట్ అయినట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా విడుదల కానున్నట్లు టాక్ నడుస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet