iDreamPost
android-app
ios-app

కేరళ వరదలు.. సూర్య ఫ్యామిలీ రూ. 50 లక్షల సాయం

Kerala Floods.. కేరళను అతలాకుతలం చేశాయి వరదలు. కొండ చరియల విరిగి పడి నాలుగు గ్రామాలు బురదలో కూరుకుపోయాయి. ముమ్మురంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ ఇండస్ట్రీ తన వంతు సాయం చేస్తుంది.

Kerala Floods.. కేరళను అతలాకుతలం చేశాయి వరదలు. కొండ చరియల విరిగి పడి నాలుగు గ్రామాలు బురదలో కూరుకుపోయాయి. ముమ్మురంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ ఇండస్ట్రీ తన వంతు సాయం చేస్తుంది.

కేరళ వరదలు.. సూర్య ఫ్యామిలీ రూ. 50  లక్షల సాయం

దైవ భూమి కేరళను వరదలు ముంచెత్తాయి. కొండ చరియలు విరిగిపడటంతో వయనాడ్ జిల్లాలోని ముండక్కయ్, చోర్ మల, అత్తమల, నూల్ పుజా గ్రామాలు నామా రూపాలు లేకుండా మాయమయ్యాయి. బురదలో ఎంతో మంది చిక్కుకుపోయారు. అక్కడ మరుభూమిని తలపిస్తుంది. శవాల దిబ్బగా మారింది. మొత్తం 285 మంది ప్రాణాలు కోల్పోయారు. 240 మంది ఆచూకీ గల్లంతు అయ్యింది. గురువారం కూడా సహాయక చర్యలు జరుగుతున్నాయి. ముండక్కయ్, చోర్ మలలో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా బాధితుల్ని కాపాడారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇదిలా ఉంటే వరద బాధితులకు సాయం అందించేందుకు సినీ ఇండస్ట్రీ కూడా తమ వంతు ప్రయత్నిస్తుంది.

కేరళ బాధితులకు సాయం చేసేందుకు మాలీవుడ్ నటి నిఖిలా విమల్ వాలంటీర్‌గా మారి.. బాధితులకు అవసరమైన ఆహారం, వస్తు సామాగ్రిని ప్యాక్ చేసి తన వంతు తోడ్పాటును అందించింది. అలాగే మరికొంత మంది నటీనటులు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే కేరళ ఇండస్ట్రీ నటీనటులే కాకుండా పొరుగున ఉన్న కోలీవుడ్ కూడా స్పందిస్తోంది. ఇప్పటికే చియాన్ విక్రమ్ రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన మేనేజర్ పంచుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినీ సెలబ్రిటీలు స్పందించారు. తమిళ స్టార్ కపుల్స్ సూర్య, జ్యోతిక, హీరో కార్తీ వయనాడ్ వరద బాధితులకు తమ వంతు సాయంగా రూ. 50 లక్షల రూపాయల నగదును అందించారు. రష్మిక కూడా రూ. 10 లక్షల సాయాన్ని ప్రకటించింది.

లులు గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎంఏ యూసఫలి, ప్రముఖ పారిశ్రామికవేత్త రవి పిళ్లై, కళ్యాణ్ జ్యువెలర్స్ యజమాని కళ్యాణరామన్ ఒక్కొక్కరు రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆదానీ పోర్ట్ గ్రూప్ కూడా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి 5 కోట్ల రూపాయలను హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే కేరళలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్టీఆర్ఎఫ్ దళాలు తరలి వెళ్లాయి. బురదలో చిక్కుకుపోయిన వారిని రక్షిస్తున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యల్లో భాగంగా వయనాడ్ లో బెయిలీ బ్రిడ్జిని నిర్మించింది ఇండియన్ ఆర్మీ. ఇక కుటుంబ సభ్యులను పొగొట్టుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు ప్రాణాలతో మిగిలి ఉన్న వాళ్లు. అక్కడ ఎక్కడా చూసినా హృదయ విదారక ఘటనలే నెలకొన్నాయి. టీవీల్లో కనిపించే దృశ్యాలను చూసి  గుండె బరువెక్కుతోంది వీక్షకులకు.