iDreamPost
android-app
ios-app

ఇంటర్‌ ఎగ్జామ్స్‌లో సత్తా చాటిన సూర్య కూతురు.. ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా?

  • Published May 09, 2024 | 8:34 PM Updated Updated May 09, 2024 | 8:34 PM

సినీ నటులు సూర్య, జ్యోతిక దంపతుల కుమార్తె దియా ఇంటర్ ఎగ్జామ్స్ లో సత్తా చాటింది. ఆమె తల్లిదండ్రులు గర్వపడేలా అత్యధిక మార్కులు సాధించింది.

సినీ నటులు సూర్య, జ్యోతిక దంపతుల కుమార్తె దియా ఇంటర్ ఎగ్జామ్స్ లో సత్తా చాటింది. ఆమె తల్లిదండ్రులు గర్వపడేలా అత్యధిక మార్కులు సాధించింది.

ఇంటర్‌ ఎగ్జామ్స్‌లో సత్తా చాటిన సూర్య కూతురు.. ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా?

డబ్బున్న వాళ్ళ పిల్లలు, సెలబ్రిటీల పిల్లలు సరిగా చదవరు, వాళ్ళు కూడా తల్లిదండ్రుల్లానే పార్టీలనీ, పబ్ లనీ తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటారు. కానీ యథా రాజా తథా ప్రజా అన్నట్టు తల్లిదండ్రుల సంస్కారం బట్టే పిల్లల తీరు కూడా ఉంటుంది. క్రమశిక్షణతో ఉండే సెలబ్రిటీల పిల్లలు కూడా అంతే క్రమశిక్షణతో ఉంటారు. పిల్లలను క్రమశిక్షణతో పెంచే సెలబ్రిటీ పేరెంట్స్ జాబితాలో సూర్య, జ్యోతిక దంపతులు కూడా ఉన్నారు. వీళ్ళ పిల్లలు సాధించిన మార్కులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సూర్య, జ్యోతికల ముద్దుల కుమార్తె దియా (17).. 12వ జనరల్ ఎగ్జామినేషన్ లో తెచ్చుకున్న మార్కులతో ఇప్పుడు హెడ్ లైన్స్ లో నిలిచింది.

సెలబ్రిటీల పిల్లలు పాసవ్వడమే ఎక్కువ అని అనుకుంటారు. కానీ సూర్య, జ్యోతిక దంపతుల కూతురు దియా అత్యధిక మార్కులతో పాస్ అయ్యింది. తమిళ్ లో వందకు 96, ఇంగ్లీష్ లో 97, అకౌంట్స్ లో 94, ఫిజిక్స్ లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్ లో 97 మార్కులు వచ్చాయి. మొత్తం 600కి 581 మార్కులు వచ్చాయి. 96.83 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్ ఎగ్జామ్స్ లోనే కాదు.. పదో తరగతి పరీక్షల్లో కూడా సత్తా చాటింది. ఏకంగా 97 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించింది. చదువులోనే కాకుండా ఇతర యాక్టివిటీస్ లో కూడా చురుగ్గా పాల్గొంటుంది. టెన్నిస్, ఫుట్ బాల్ బాగా ఆడుతుంది. మరోవైపు సూర్య కొడుకు దేవ్ (16) కూడా ఆటల్లో ఉత్సాహంగా ఉంటాడు. తన స్కూల్లో జరిగిన కరాటే పోటీల్లో విన్నర్ గా నిలిచాడు. బ్లాక్ బెల్ట్ సాధించాడు.

Surya

అయితే దియా, దేవ్ ఇద్దరిలో ఏ ఒక్కరూ ఇంకా నటనపై ఆసక్తి కనబరిచినట్లు లేదు. రాబోయే రోజుల్లో ఏమైనా సినిమాల్లో నటించే ఛాన్స్ ఉందేమో చూడాలి. ఇక సూర్య, జ్యోతికలది ప్రేమ వివాహం. వారిద్దరి మీద వస్తున్న రూమర్స్ కి చెక్ పెడుతూ ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి 2006లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. చాలా అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటారు. పిల్లలని కూడా చాలా పద్ధతిగా పెంచుతున్నారు. వారి పెంపకానికి తగ్గట్టే పిల్లలు కూడా చదువులోనూ, ఇతర యాక్టివిటీస్ లోనూ రాణిస్తున్నారు. తల్లిదండ్రులను తలెత్తుకునేలా, గర్వపడేలా రాణిస్తున్నారు. వీళ్ళు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిగమించాలని కోరుకుందాం. మరి సూర్య కూతురు దియా చదువులో ఉన్నతమైన మార్కులు సాధించడం.. కొడుకు ఇటీవల కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.