iDreamPost
android-app
ios-app

సూర్య సినిమాకి రూ. 500 కోట్ల బడ్జెట్! సబ్జెక్టు ఏంటో తెలుసా?

  • Author ajaykrishna Published - 11:46 AM, Wed - 4 October 23
  • Author ajaykrishna Published - 11:46 AM, Wed - 4 October 23
సూర్య సినిమాకి రూ. 500 కోట్ల బడ్జెట్! సబ్జెక్టు ఏంటో తెలుసా?

కొన్నాళ్ళుగా సౌత్ ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంటెంట్ పరంగా అద్భుతాలు సృష్టిస్తూ.. సినిమాలు తెరపైకి తీసుకొస్తుంది. పాన్ ఇండియా అనే క్రేజ్ లేనప్పుడు బాలీవుడ్ స్టార్స్ ఇండస్ట్రీని ఊపేశారు. కానీ.. ఎప్పుడైతే సౌత్ నుండి పాన్ ఇండియా మూవీస్ మొదలయ్యాయో.. అప్పటినుండి నార్త్ లో కూడా డామినేషన్ అంతా సౌత్ సినిమాలదే కనిపిస్తుంది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య.. ఇన్నేళ్లకు బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి పర్ఫెక్ట్ స్టోరీ, డైరెక్టర్ ని కూడా ఓకే చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ సూర్య బాలీవుడ్ డెబ్యూ దేనితో చేస్తున్నాడో తెలుసా?

ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. సూర్య ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కంగువ చేస్తూనే.. మరోవైపు వెట్రిమారన్ తో వాడివాసల్ చేయాల్సి ఉంది. పీరియడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కంగువ.. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. ఇవేగాక తనకు సూరరై పొట్రు.. సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుధా కొంగరతో సెకండ్ మూవీ చేయనున్నాడు. ఓ రకంగా సూర్య దాదాపు అందరికీ కమిట్మెంట్ ఇచ్చేసాడు. దీంతో ఇప్పుడు వరుసగా సినిమాలు కంప్లీట్ చేస్తూనే.. మరోవైపు బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయ్యాడని టాక్ వినిపిస్తుంది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. మహాభారతంలోని కర్ణ పాత్ర ఆధారంగా ఓ సినిమా ప్లానింగ్ జరుగుతోంది. దాదాపు దాని బడ్జెట్.. రూ. 500 కోట్లు అని అంటున్నారు. పైగా దీనికి కర్ణ అని పేరు వాడుకలో ఉంది. అయితే.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్ర.. సూర్యతో కర్ణ మూవీ చేయనున్నారు. అదిగాక కర్ణ మూవీని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు రూమర్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. కాగా.. సూర్య ఇప్పుడున్న సినిమాలన్నీ పూర్తి చేసాక.. వచ్చే ఏడాది జులైలో సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలు లేకపోలేదు. 2024 జులై వరకు అన్ని సినిమాలు పూర్తి చేసి.. పూర్తిగా కర్ణపైనే సూర్య ఫోకస్ పెట్టబోతున్నాడని సమాచారం. మరి కర్ణ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet