iDreamPost
android-app
ios-app

డిల్లీ వస్తే రోలెక్స్ వస్తాడు.. LCUలో నెక్స్ట్ బిగ్ ఫైట్ కన్ఫర్మ్?

  • Author ajaykrishna Updated - 04:30 PM, Tue - 31 October 23

ఖైదీలో డిల్లీ క్యారెక్టర్.. విక్రమ్ లో రోలెక్స్ పాత్రలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. LCU లో ఇప్పటిదాకా ఈ పాత్రలు ఎదురు పడలేదు. కానీ.. పడితే ఎలా ఉంటుందో ఊహించుకుంటే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. తాజాగా ఇవే క్యారెక్టర్స్ పై క్రేజీ హింట్ ఇచ్చాడు సూర్య. మరి సూర్య ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం!

ఖైదీలో డిల్లీ క్యారెక్టర్.. విక్రమ్ లో రోలెక్స్ పాత్రలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. LCU లో ఇప్పటిదాకా ఈ పాత్రలు ఎదురు పడలేదు. కానీ.. పడితే ఎలా ఉంటుందో ఊహించుకుంటే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. తాజాగా ఇవే క్యారెక్టర్స్ పై క్రేజీ హింట్ ఇచ్చాడు సూర్య. మరి సూర్య ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం!

  • Author ajaykrishna Updated - 04:30 PM, Tue - 31 October 23
డిల్లీ వస్తే రోలెక్స్ వస్తాడు.. LCUలో నెక్స్ట్ బిగ్ ఫైట్ కన్ఫర్మ్?

ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు కలిసి సినిమాలు చేస్తే బాగుంటుందని ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తుంటుంది. అందులోనూ రెండు రకాల ఆలోచనలు ఉంటాయి. ఒకటి మనం అనుకున్న హీరోలు.. మల్టీస్టారర్ చేయాలని అనిపిస్తుంది. రెండోది మనం అనుకున్న హీరోలు ఒకరు హీరోగా.. ఇంకొకరు విలన్ గా చేయాలని అనుకుంటారు. ఇవన్నీ ఫ్యాన్స్ కోరికలు. ఒక్కోసారి కథ సెట్ అయి.. క్యారెక్టర్స్ కూడా కుదిరి.. సబ్జెక్టులో అంత దమ్ము ఉందని అనుకుంటే ఖచ్చితంగా హీరోలు సినిమాలు చేసేందుకు రెడీగానే ఉంటారు. ఇదివరకు ఏమో గానీ.. ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ లు వస్తున్నప్పటి నుండి ఒకరి ఒకరు విలన్ గా లేదా స్పెషల్ క్యారెక్టర్స్ చేసేందుకు ముందుకు వస్తున్నారు.

మీకు LCU గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన ఈ యూనివర్స్ లో.. ఇప్పటికైతే ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు చేరాయి. LCU లో తదుపరి వస్తున్న సినిమా ఖైదీ 2. కార్తీ హీరోగా లోకేష్ రూపొందించిన ఖైదీ సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది. 2019లో విడుదలైన ఖైదీ.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గతేడాది విక్రమ్ సినిమా వచ్చింది. కమల్ హాసన్ హీరోగా నటించిన ఆ సినిమా.. ఖైదీ లింక్ తో LCU క్రియేట్ అయ్యింది. అక్కడినుండి లియో సినిమా లింక్ తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఇంకా డెవలప్ అవుతూనే ఉంది.

ఇదిలా ఉండగా.. LCUలో భాగంగా వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో నెక్స్ట్ రాబోతున్న ఖైదీ 2 పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కాగా.. ఖైదీ తర్వాత విక్రమ్ 2, రోలెక్స్ కూడా లైన్ లో ఉన్న విషయం విదితమే. అయితే.. ప్రస్తుతం కార్తీ హీరోగా జపాన్ అనే సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. దీపావళి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియో లాంచ్ రీసెంట్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వచ్చాడు రోలెక్స్ అలియాస్ సూర్య. ఈ సందర్బంగా డిల్లీ – రోలెక్స్ క్యారెక్టర్స్ పై క్రేజీ హింట్ ఇచ్చాడు. అదేంటంటే.. డిల్లీ ఎప్పుడు వస్తే రోలెక్స్ కూడా అప్పుడే వస్తాడని అన్నాడు. అంటే.. ఖైదీ 2 లో రోలెక్స్ కూడా ఉన్నాడని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. మరి డిల్లీ, రోలెక్స్ కి వార్ పడితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomMariobetMadridbetbetciomatbet girişjojobetdeneme bonusugrandpashabet girişgrandpashabet girişJojobet Girişcasibom girişGrandPashaBet Şikayetvarjojobet girişcasino siteleriCasibom GirişCasibomcasibomcasibomjojobetcasibom girişjojobet girişcasibom