iDreamPost
android-app
ios-app

కాపీ కష్టాల్లో కొరటాల.. బయటపడటానికి ఆ ఒక్క మార్గమే ఉంది!

  • Published Jan 31, 2024 | 2:47 PM Updated Updated Jan 31, 2024 | 2:47 PM

Srimanthudu Copyright Dispute: శ్రీమంతడు కాపీ రైట్ వివాదంలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివకు సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురైంది. దీంతో అతడు ఈ కేసు నుంచి బయటపడటానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదేంటంటే?

Srimanthudu Copyright Dispute: శ్రీమంతడు కాపీ రైట్ వివాదంలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివకు సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురైంది. దీంతో అతడు ఈ కేసు నుంచి బయటపడటానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదేంటంటే?

కాపీ కష్టాల్లో కొరటాల.. బయటపడటానికి ఆ ఒక్క మార్గమే ఉంది!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే మాట ‘కాపీ రైట్’ వివాదం. సదరు రైటర్, డైరెక్టర్ నా కథను కాపీ కొట్టారు అంటూ గతంలో ఎంతో మంది కోర్టు మెట్లను ఎక్కిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ లో ఓ కాపీ రైట్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు-కొరటాల శివ దర్శకత్వంలో 2015లో వచ్చిన ‘శ్రీమంతుడు’ ఎంతటి విజయం సాధించిందో మనందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాను తన కథ కాపీ కొట్టి తీశారని శరత్ చంద్ర అనే రైటర్ కోర్టును ఆశ్రయించాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కేసు నాంపల్లి, హైకోర్టుల్లో విచారణకు రాగా.. కొరటాల శివదే తప్పని కోర్టులు తేల్చిచెప్పాయి. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు కోరటాల. అయితే తాజాగా ఈ విషయంలో సుప్రీం కోర్టులో సైతం ఈ స్టార్ డైరెక్టర్ కు చుక్కెదురైంది. దీంతో ఈ కేసు నుంచి బయటపడటానికి ఆ ఒక్క మార్గమే ఉంది ఈ స్టార్ డైరెక్టర్ కి.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాపీ కష్టాల్లో చిక్కుకున్నారు. 2015లో వచ్చిన శ్రీమంతుడు మూవీని తన కథతోనే తీశాడని రైటర్ శరత్ చంద్ర ఆరోపించాడు. ఈ విషయంపై రచయితల సంఘం సహకారంతో నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు శరత్ చంద్ర. అతడు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన నాంపల్లి, హైకోర్టు లు డైరెక్టర్ కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ.. దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు కోరటాల శివ. కానీ.. సుప్రీం కోర్టు సైతం కింది స్థాయి కోర్టులు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో కొరటాల శివకు మరిన్ని చిక్కులు ఏర్పడ్డాయి.

Korataala siva scripts copy issue

కాగా.. ఈ కేసును నుంచి కొరటాల బయటపడాలంటే ఒక్కటే మార్గం ఉంది. అదేంటంటే? కేసు వేసిన రైటర్ శరత్ చంద్రతో రాజీ కుదుర్చుకోవడమే. అతడు చెప్పిన విధంగా టైటిల్ కార్డ్స్ లో క్రెడిట్ ఇవ్వడంతో పాటుగా కొంత మెుత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఈ రెండింటికి డైరెక్టర్ ఒకే అంటే.. ఈ కథ ప్రశాంతంగా ముగుస్తుంది. ఇప్పుడు శివ ముందున్న ఒకే ఒక్క మార్గం ఇది. ఇలా కాదని ఇంకా ముందుకు వెళ్లాలని చూస్తే మాత్రం కోర్టు ఆదేశించినట్లుగా క్రిమినల్ చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఆ ఎఫెక్ట్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీపై పడుతుంది అనడంలో ఎలాంటి సందేహంలేదు. ఈ విషయాలన్ని పరిగణంలోకి తీసుకుంటే.. కొరటాల శరత్ చంద్రతో రాజీ కుదుర్చుకోవడం తప్ప మరో రూట్ కనిపించడం లేదు.

ఇదిలా ఉండగా.. టాలీవుడ్ లో రికార్డులు కొల్లగొట్టిన ఎన్నో సినిమాలకు కథ, డైలాగ్స్ అందించాడు కొరటాల. అందులో భద్ర, మున్నా, సింహా, బృందావనం లాంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక తన తొలి చిత్రం ‘మిర్చి’తోనే రికార్డులు కొల్లగొట్టాడు. ఆ తర్వాత వరుసగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించాడు. అలాంటి స్టార్ డైరెక్టర్ కాపీ రైట్స్ వివాదాన్ని ఎదుర్కొవడం ఒక్కింత ఆశ్చర్యకరమైన విషయమే. ఇక ఇప్పటికే ఆచార్య సినిమా డిజాస్టర్ తో ఆర్థిక ఇబ్బందులను ఫేస్ చేస్తున్న కొరటాలకు శ్రీమంతుడి కాపీ రైట్స్ వ్యవహారం పెద్ద తల నొప్పిగా మారింది. ఈ ఎఫెక్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ మూవీపై పడకూడదు అంటే.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సినీ పండితులు చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి కొరటాల శివ తీసుకోబోయే నెక్ట్స్ స్టెప్ ఏంటో?