Superstar Singer Season 3 Winner Avirbhav: బాలీవుడ్‌లో అదరగొట్టిన ఆవిర్బావ్! ఏకంగా సూపర్ స్టార్ సింగర్-3 విజేతగా!

బాలీవుడ్‌లో అదరగొట్టిన ఆవిర్బావ్! ఏకంగా సూపర్ స్టార్ సింగర్-3 విజేతగా!

నిండా పదేళ్లు కూడా లేని ఓ కుర్రాడు సంగీతమే ప్రపంచంగా బతికాడు. చిన్నప్పటి నుండే స్వరాలు, గమకాలు నేర్చుకుని సంగీత వేదికలపై పాటలు పాడి విస్మయానికి గురి చేశాడు. బాలీవుడ్ సైతం అతడి పాటలకు ఫిదా అయిపోయింది.

నిండా పదేళ్లు కూడా లేని ఓ కుర్రాడు సంగీతమే ప్రపంచంగా బతికాడు. చిన్నప్పటి నుండే స్వరాలు, గమకాలు నేర్చుకుని సంగీత వేదికలపై పాటలు పాడి విస్మయానికి గురి చేశాడు. బాలీవుడ్ సైతం అతడి పాటలకు ఫిదా అయిపోయింది.

చిన్నోడే కానీ చిచ్చర పిడుగు ఈ బుడ్డోడు. కేరళ నుండి మొదలైన అతడి సింగింగ్ ప్రస్తానం నేడు బాలీవుడ్ వేదికలపై అవార్డును కైవసం చేసుకునేంత వరకు చేరింది. మాటలు కూడా సరిగా రాని, తన పేరు కూడా స్పష్టంగా చెప్పలేని ఓ పిల్లాడు.. అలవోకగా పాటలు పాడి ఫేమస్ అయ్యాడు. అడుగులు సరిగా వేయలేని వయస్సులో గమకాలను గుర్తుంచుకుని వేదికలపై తన పాటలతో, ముద్దుముద్దు మాటలతో ఆకట్టుకున్నాడు. అతడికి ఎంతో సపోర్టుగా నిలిచారు అక్క, అతడి అమ్మ నాన్నలు. కఠినమైన సాధన చేసి, తనది కానీ భాషను ఓన్ చేసుకుని అద్భుతమైన పాటలతో బాలీవుడ్ దిగ్గజ సింగర్లను మెప్పించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. అతడు మరెవరో కాదు ఆవిర్భావ్.  అలియాస్ బాబు కుట్టాన్. సూపర్ స్టార్ సింగర్ 3 విజేతగా నిలిచాడు. మరో కంటెస్టెంట్ అథర్వ్ బక్షితో కలిసి టైటిల్ విన్ అయ్యాడు.

కేరళలోని కొచ్చికి చెందిన ఆవిర్బావ్.. అక్క అనిర్విణ్య కూడా సింగరే. ఈ ఇద్దరు ఎన్నో సింగింగ్ కాంపిటీషన్లలో పాల్గొన్నారు. ఈ  ఇద్దరు తెలుగు వారికి సుపరిచయస్థులే. 2018లో ప్రసారమైన సరిగమ లిటిల్ ఛాంప్స్‌లో పాల్గొన్నారు అనిర్విణ్య. అప్పట్లోనే స్టేజీ మీదకు వచ్చి తన ముద్దు ముద్దు మాటలతో, పాటలతో అలరించాడు ఆవిర్బావ్. అతడి చేష్టలకు యాంకర్ శ్రీముఖి, జడ్జీలు శైలజ, విజయ్ ప్రకాష్, చంద్రబోస్ ఫిదా అయిపోయేవారు. ఆ సీజన్‌లో విన్నర్ అయ్యింది సాయి వేద అనే పాప. కానీ అనిర్విణ్యతో పాటు ఆవిర్భావ్‌కు మంచి అప్లాజ్ దక్కింది. తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో పాటలు పాడేవారు. డివోషనల్, సినిమా సాంగ్స్ పాడుతూ ఫేమ్ తెచ్చుకున్నారు.

తెలుగులో మంచి పాపులర్ అయ్యారు ఈ అక్కా తమ్ముళ్లు.  పేరుకు కేరళ అయిన ఎక్కువ తెలుగు సాంగ్స్ పాడుతుంటారు. అలా బాలీవుడ్ సింగింగ్ కాంపిటీషన్ సూపర్ స్టార్ సింగర్ సీజన్ 3లో ఆడిషన్ ఇచ్చాడు ఆవిర్బావ్. స్టార్ సింగర్ నేహా కక్కర్, అరుణితనే కాకుండా ఉదిత్ నారాయణ, గీతా కపూర్ వంటి స్టార్ సింగర్స్ సైతం అతడి సింగింగ్ స్టైల్‌కు మెస్మరైజ్ అయిపోయారు. యాంకర్స్, తోటి కంటెస్టెంట్ల మనస్సులను దోచాడు. అతడికి జోడిగా పాడిన పాప అయితే.. అతడి స్నేహాన్ని వదులుకోలేక కన్నీరుమున్నీరు అయ్యింది వేదికపైన. ఈ సింగింగ్ కాంపిటీషన్‌లో తొలి నుండి గట్టిపోటీనిస్తున్న ఆవిర్బావ్.. ఫైనల్ వరకు చేరాడు. దక్షిణాది నుండి వెళ్లి.. బాలీవుడ్ వేదికపై హిందీ పాటలతో, తన మాటలతో అందర్ని కట్టిపడేశాడు.

ఎంతో చక్కగా  పాడి తాజాగా  జరిగిన గ్రాంఢ్ ఫినాలేలో తన కో కంటెస్టెంట్ జార్ఖండ్‌కు చెందిన అథర్వ్ బక్షితో కలిసి ట్రోఫీని పంచుకున్నాడు. అలాగే ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు అందించారు. ఈ అవార్డును గెలవడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేసిన ఆవిర్భావ్.. గెలిచానంటే నమ్మలేకపోతున్నానంటూ ఎమోషనల్ అయ్యాడు. తనకు సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. మాటలు రాని వయస్సు నుండే పాటలనే ప్రాణంగా ప్రేమించిన ఆవిర్బావ్‌కు ఈ విజయం దక్కడం సరైనదే అనిపిస్తుంది.

Show comments