iDreamPost
android-app
ios-app

రజినీ రెమ్యూనరేషన్.. పాన్ ఇండియా మూవీ బడ్జెట్ కి సమానమా?

  • Author ajaykrishna Updated - 03:43 PM, Tue - 5 September 23
  • Author ajaykrishna Updated - 03:43 PM, Tue - 5 September 23
రజినీ రెమ్యూనరేషన్.. పాన్ ఇండియా మూవీ బడ్జెట్ కి సమానమా?

ఒక్కోసారి సినిమా హీరోలకు సంబంధించి రెమ్యూనరేషన్స్ గురించి వింటే షాకింగ్ గా అనిపిస్తుంటుంది. కొన్నేళ్లుగా సినిమాల బడ్జెట్స్ వంద కోట్లకు పైగా దాటిపోయాయి.. ఇంకా దాటిపోతున్నాయి. అయితే.. సినిమాల బడ్జెట్స్ అంటే.. స్టార్ కాస్ట్, విజువల్ ఎఫెక్ట్స్, లొకేషన్స్, ప్రొడక్షన్ డిజైన్ లాంటివి ఉంటాయి. కాబట్టి.. సినిమా మేకింగ్ కి వందల కోట్లు ఖర్చు అయ్యాయంటే ఒప్పుకోవచ్చు. కానీ.. కొన్నిసార్లు సినిమా బడ్జెట్ ఓ రేంజ్ లో ఉంటే.. అందులో సగం వరకు హీరో రెమ్యూనరేషన్ ఉంటుందని అంటుంటారు. అది ఎంత వరకు నిజమో గానీ.. అసలు హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు అనేది అందరు తెలుసుకోవాలని అనుకుంటారు.

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ ఏడాది జైలర్ తో ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దాదాపు చాలకాలంగా కంబ్యాక్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ రూపంలో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందించాడు. దీంతో ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న రజినీ ఫ్యాన్స్.. జైలర్ సక్సెస్ తో పండగ చేసుకున్నారు. అయితే.. రూ. 124 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన జైలర్.. ఏకంగా రూ. 650 కోట్లకు పైగా వసూల్ చేసి.. ట్రిపుల్ షేర్ రాబట్టింది. దీంతో నిర్మాత కళానిధి మారన్.. సూపర్ స్టార్ కి, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ లకు చెక్ లతో పాటు ఖరీదైన కార్లు గిఫ్ట్ గా ఇచ్చాడు.

ఇదిలా ఉండగా.. జైలర్ సినిమాకు రజినీ మొత్తం రూ. 210 కోట్లు అందుకున్నాడని కోలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. మొదట రెమ్యూనరేషన్ గా రూ. 110 కోట్లు తీసుకున్న రజినీకి.. సినిమా సక్సెస్ అయ్యాక ప్రొడ్యూసర్ ఓ చెక్ తో పాటు బిఎండబ్ల్యూ కారు ఇచ్చారు. అయితే.. ఆ చెక్ విలువ దాదాపు రూ. 100 కోట్లు అని టాక్. ఈ లెక్కన ముందుగా రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ రూ. 110 కోట్లకు, ఇప్పుడీ రూ. 100 కోట్లు కలిపి రూ. 210 కోట్లు అయ్యిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే.. రజినీ రెమ్యూనరేషన్ దాదాపు ఓ పాన్ ఇండియా మూవీ బడ్జెట్ తో సమానం అని చెప్పుకుంటున్నారు. ఇటీవల పాన్ ఇండియా మూవీస్ అన్ని దాదాపు రూ. 200 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నాయి. అలాంటిది రజినీ రెమ్యూనరేషనే అంతంటే.. ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా రజినీ అవతరించినట్లే. మరి రజినీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetticket girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş