iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ లో బో*ల్డ్ క్రైమ్ థ్రిల్లర్ తో సన్నీలియోన్ రీఎంట్రీ..

  • Published Aug 18, 2024 | 4:21 PM Updated Updated Aug 18, 2024 | 4:21 PM

Sunny Leone Reentry In Tollywood: సన్నీలియోన్ కు ఉండే క్రేజ్ గురించి తెలియనిది కాదు. అయితే తెలుగులో సన్నీలియోన్ సినిమా వచ్చి చాలా కాలమే అయింది. ఈ క్రమంలో ఇప్పుడు దాదాపు రెండేళ్ల తర్వాత సన్నీలియోన్ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Sunny Leone Reentry In Tollywood: సన్నీలియోన్ కు ఉండే క్రేజ్ గురించి తెలియనిది కాదు. అయితే తెలుగులో సన్నీలియోన్ సినిమా వచ్చి చాలా కాలమే అయింది. ఈ క్రమంలో ఇప్పుడు దాదాపు రెండేళ్ల తర్వాత సన్నీలియోన్ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 18, 2024 | 4:21 PMUpdated Aug 18, 2024 | 4:21 PM
టాలీవుడ్ లో  బో*ల్డ్  క్రైమ్ థ్రిల్లర్ తో సన్నీలియోన్ రీఎంట్రీ..

సన్నీలియోన్ కు ఉండే ఫ్యాన్ బేస్ గురించి తెలిసిందే. ఈ హీరోయిన్ సినిమాలన్నీ అసలు మిస్ కాకుండా చూస్తూ ఉంటారు అభిమానులు. అయితే తెలుగులో సన్నీ లియోన్ నటించి చాలా కాలమే అయింది. ఈ క్రమంలో ఇప్పుడు రెండేళ్ల తర్వాత సన్నీలియోన్ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా పేరు ‘క్యూజీ'(కొటేష‌న్ గ్యాంగ్‌). బో*ల్డ్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంగా ఈ మూవీ.. ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్.. సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలను చూసేద్దాం.

బో*ల్డ్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ‘క్యూజీ’ సినిమాకు వివేక్ కుమార్ కన్నన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో సన్నీ లియోన్ తో పాటు ప్రియ‌మ‌ణి, సారా అర్జున్‌, జాకీ ష్రాఫ్ లాంటి వారు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. జాకీ ఫ్రాఫ్ ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను రుషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్ పై.. ఎం. వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. కానీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. కచ్చితంగా ఈ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుందని భావిస్తున్నారు మేకర్స్.

ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను గమనిస్తే.. క్రైమ్ సిండికేట్ గ్యాంగ్ గా ఉన్న కొంతమంది మహిళలు.. అంతా కలిసి కొన్ని హత్యలను చేస్తుంటారు. వారికి ఎవరు అడ్డొస్తే వారిని అతి దారుణంగా చంపేస్తూ ఉంటారు. అసలు వాళ్లంతా అలా హంతకులుగా మారడానికి కారణాలు ఏంటి ? తమకు అడ్డొచ్చిన వారిని ఏ విధంగా చంపుతున్నారు ? ఇలాంటి అంశాలతో బో*ల్డ్, క్రైమ్ టచ్ ను ఇస్తూ ఈ మూవీ ఉండబోతుంది. ఈ మూవీలో సన్నీలియోన్ క్రైమ్ సిండికేట్ గ్యాంగ్ లీడర్ గా కనిపించబోతుంది. ఇక ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş