iDreamPost
android-app
ios-app

సంక్రాంతి బరిలో ఈసారి మరో చిన్న సినిమా.. మళ్ళీ సీన్ రిపీట్ అవుతుందా !

  • Published Sep 20, 2024 | 12:16 PM Updated Updated Sep 20, 2024 | 12:16 PM

2025 Sankranti Releases: ప్రస్తుతం చిన్న సినిమాలు ఇండస్ట్రీని రూల్ చేస్తున్న సంగతి తెలియనిది కాదు.ఈ ఏడాది హనుమాన్ మూవీతో స్టార్ట్ అయినా ఈ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే పోటీ మొదలైపోయింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సంక్రాంతికి మరో చిన్న సినిమా రాబోతుంది. ఆ వివరాలేంటో చూసేద్దాం.

2025 Sankranti Releases: ప్రస్తుతం చిన్న సినిమాలు ఇండస్ట్రీని రూల్ చేస్తున్న సంగతి తెలియనిది కాదు.ఈ ఏడాది హనుమాన్ మూవీతో స్టార్ట్ అయినా ఈ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే పోటీ మొదలైపోయింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సంక్రాంతికి మరో చిన్న సినిమా రాబోతుంది. ఆ వివరాలేంటో చూసేద్దాం.

  • Published Sep 20, 2024 | 12:16 PMUpdated Sep 20, 2024 | 12:16 PM
సంక్రాంతి బరిలో ఈసారి మరో చిన్న సినిమా.. మళ్ళీ సీన్ రిపీట్ అవుతుందా !

సంక్రాంతి అంటే ఎవరైనా పెద్ద సినిమాలను రిలీజ్ చేయడానికి చూస్తూ ఉంటారు. ప్రేక్షకులకు కూడా బిగ్ స్టార్ సినిమాలనే ఆసిస్తూ ఉంటారు. ఇక అటు మేకర్స్ కూడా ఆరు ఏడు నెలల ముందు నుంచే సంక్రాంతి డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కుదరని వారు డేట్స్ ఎడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది సంక్రాతికి అదే జరిగింది. ఈ క్రమంలో ఈ ఏడాది పెద్ద సినిమాలతో పాటు ఓ చిన్న సినిమా కూడా రిలీజ్ అయింది. అదే హనుమాన్.. ఈ మూవీ ఇండస్ట్రీని ఏ విధంగా రూల్ చేసిందో తెలియనిది కాదు. ఈ క్రమంలో వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే పోటీ మొదలైంది. ఈసారి కూడా బిగ్ స్టార్స్ తో పోటీ పడేందుకు.. మరొక చిన్న సినిమా రానుంది. మరి ఆ సినిమా ఏంటో.. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం.

సంక్రాంతి అంటేనే సినిమా పండగ.. ఆ సీజన్ లో ఒకేసారి మూడు నాలుగు సినిమాలు వస్తుంటాయి. 2025 లో ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఇప్పటికే చిరంజీవి విశ్వంభర మూవీ డేట్ లాక్ చేసుకుంది. దర్శకుడు వసిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ మూవీ జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న కూడా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరో వైపు బాలకృష్ణ మూవీ కూడా సంక్రాంతికే తీసుకురాడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఈ బడా హీరోల మధ్యలో ఓ చిన్న హీరో తన లక్ ను టెస్ట్ చేసుకునేందుకు వస్తున్నాడు. ఆయన ఎవరో కాదు సందీప్ కిషన్. త్రినాథరావు దర్శకత్వంలో వస్తున్న సినిమాతో సందీప్ కిషన్ సంక్రాంతికి ఎంట్రీ ఇవ్వనున్నారట. గతంలో కూడా సంక్రాంతి సీజన్ లో వచ్చిన చిన్న సినిమాలన్నీ హిట్ టాక్ ను సంపాదించుకున్నాయి. మరి ఈసారి సందీప్ కిషన్ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలాగూ చిన్న సినిమాల హావ నడుస్తుంది. ప్రతి సారి పెద్ద సినిమాలే ఇండస్ట్రీని బ్రతికేస్తాయనే బ్రమలోనుంచి బయటకు వచ్చేసారు మేకర్స్. ఈ ఏడాది చాలా వరకు చిన్న సినిమాలే థియేటర్స్ లో సందడి చేశాయి. కాబట్టి ఈ లెక్కన చూస్తే సందీప్ కిషన్ మూవీ కూడా ప్రేక్షకులను మెప్పించే అవకాశం లేకపోలేదు. ఇక ఈలోపు ఇంకేమైనా సినిమాలు వచ్చే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. మరి ఇకనైనా దర్శకులు ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలను తీస్తారో లేదో వేచి చూడాలి. ఒకవేళ అనుకున్నట్లుగానే సందీప్ మూవీ హిట్ కొడితే మాత్రం.. మళ్ళీ హనుమాన్ సీన్ రిపీట్ అవ్వడం ఖాయం. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet