iDreamPost
android-app
ios-app

షో పేరు మాత్రమే మారుతోంది.. నటరాజ్ మాస్టర్ మాత్రం మారట్లేదుగా!

  • Author Soma Sekhar Updated - 02:21 PM, Mon - 4 September 23
  • Author Soma Sekhar Updated - 02:21 PM, Mon - 4 September 23
షో పేరు మాత్రమే మారుతోంది.. నటరాజ్ మాస్టర్ మాత్రం మారట్లేదుగా!

సెలబ్రిటీలు ఏదైనా ఈవెంట్ కు లేదా షోకు వెళ్లినప్పుడు.. అక్కడ అనుకోని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటనలతో సదరు సెలబ్రిటీలు కోపాని గురైన సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. అలా కోపానికి గురై ఆ ఈవెంట్ నుంచి లేదా ఆ షో నుంచి అనేక మంది కోపంతో వెళ్లిపోవడం జరిగింది. అయితే ఇందులో కొన్ని టీఆర్పీ రేటింగ్ కోసమైతే.. మరికొన్ని నిజమైన సంఘటనలే. అయితే కోపంతో వెళ్లిపోయే వారిలో ముందు వరుసలో ఉంటాడు నటరాజ్ మాస్టర్. మెున్న నీతోనే డ్యాన్స్ షోలో కూడా కోపంతో ఇలాగే చేశాడు. నేడు సుమ అడ్డా షోలో కూడా సుమ చేసిన పనికి కోపంతో స్టేజి నుంచి తన భార్యను తీసుకుని కోపంగా వెళ్లిపోయాడు. దీంతో షో పేరు మాత్రమే మారుతుంది.. కానీ నటరాజ్ మాస్టర్ మాత్రం మారట్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

నటరాజ్ మాస్టర్.. బిగ్ బాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు అయ్యారు. ఇక ఆ షోలో మాస్టర్ చేసిన అరాచకం ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు. అదీకాక నిన్నకాక మెున్న నీతోనే డ్యాన్స్ షోలో కూడా నటరాజ్ మాస్టర్ కోపానికి గురైయ్యాడు. తాజాగా మరోసారి కోపంతో షో నుంచి అర్దాంతరంగా తన భార్యను తీసుకుని వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే.. బుల్లితెర స్టార్ యాంకర్ సుమ యాంకర్ గా చేస్తున్న షో సుమ అడ్డా. సెప్టెంబర్ 9వ తేదీ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రొమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ కు ఆట సందీప్-జ్యోతి రాజ్, నటరాజ్ మాస్టర్-నీతు ఫ్యామిలీస్ వచ్చాయి.

ఇక ఎప్పటిలాగే సుమ తనదైన పంచులతో కవ్వించగా.. డ్యాన్స్ మాస్టర్లు తమ ఫ్యామిలీస్ తో కలిసి డ్యాన్స్ కుమ్మేశారు. ఈ క్రమంలోనే ఆట సందీప్, నటరాజ్ మాస్టర్ లకు సుమ డ్యాన్స్ షూటౌట్ పోటీ పెట్టింది. ఈ షూటౌట్ లో ఇద్దరు రెచ్చిపోయి సూపర్ డ్యాన్స్ చేశారు. వీరి డ్యాన్స్ తో స్టేజి దద్దరిల్లిపోయింది. ఇక విన్నర్స్ ఎవరో సుమ అనౌన్స్ చేసింది. సూపర్ గా డ్యాన్స్ చేసిన వీరిద్దరికి కాకుండా అక్కడ నిల్చున్న స్టూడెంట్ విన్నర్ అంటూ సుమ ఆ కుర్రాడికి ట్రోఫీ ఇచ్చింది. దీంతో నటరాజ్ మాస్టర్ కు కోపం వచ్చింది. నన్ను కించపరిచినట్లు అనిపించింది, నేను అన్నీ తీసుకోలేను.. కొంత వరకే కామెడీగా తీసుకుంటా. నా వల్లకాదు అంటూ తన భార్యను తీసుకుని కోపంగా స్టేజి దిగి వెళ్లిపోయాడు. సుమ పిలుస్తున్నా నటరాజ్ మాస్టర్ ఆగలేదు.

అయితే నటరాజ్ మాస్టర్ ఇలా కోపంతో వెళ్లిపోవడం ఇదే తొలిసారి కాదు. మెున్న నీతోనే డ్యాన్స్ ప్రొగ్రాంలో కూడా ఇదే విధంగా చేశాడు. ఇప్పుడు సుమ అడ్డాలో కూడా కోపంతో వెళ్లిపోయాడు. దీంతో షో పేర్లు మారుతున్నాయి కానీ నటరాజ్ మాస్టర్ మాత్రం మారట్లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది టీఆర్పీ రేటింగ్ కోసం చేసిన స్టంట్ గా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి నటరాజ్ మాస్టర్ కోపంతో వెళ్లిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet